ఇంగ్లీష్‌ ఛానల్‌లో ప్రమాదం: 900 మైళ్ల దూరంలో శవం

Kurdish Boy Artin Body Found On Karmoy - Sakshi

నార్వే : గత సంవత్సరం బోటులో ఇంగ్లీష్‌ ఛానల్‌ను దాటుతూ కుటుంబంతో పాటు గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 900మైళ్ల దూరంలో నార్వేలోని కార్మోయ్‌లో బాలుడి మృతేహాన్ని గుర్తించారు అధికారులు. గత సంవత్సరం అక్టోబర్‌ 27న తండ్రి రసూల్‌, తల్లి శివ, అక్క అనిత, అన్న అర్మిన్‌తో పాటు 15 నెలల ఆర్టిన్‌ బోటు ప్రమాదానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో మిగిలిన కుటుంబసభ్యుల మృతదేహాలు లభించినప్పటికి చిన్నారి ఆచూకీ తెలియలేదు. ఇక అప్పటినుంచి అధికారులు బాలుడి మృతదేహం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. గత జనవరి నెలలోనే అతడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే శవం పూర్తిగా పాడై ఉండగా.. అతడు ఆర్టినో కాదో కనుక్కోవటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో శవానికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల అనంతరం అది ఆర్టినేనని తేలింది. చిన్నారి శవాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లాల్సిందిగా ఇరాన్‌లోని ఆర్టిన్‌ బంధువులకు అధికారులు సమాచారం అందించారు. 

కాగా, ఇరాన్‌కు చెందిన రసూల్‌ కుటుంబం మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో ఆస్తులన్నీ అమ్ముకుని గత సంవత్సరం ఆగస్టు నెలలో యూకే పయనమైంది. అన్ని అడ్డంకులు దాటుకుని ఫ్రాన్స్‌కు చేరుకుంది. యూకేను చేరుకోవటానికి చేసిన ఓ రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈనేపథ్యంలో బోటులో ఇంగ్లీష్‌ ఛానల్‌ను దాటడానికి ప్రయాణం కట్టారు. అయితే, సామర్థ్యానికి మించి మనషుల్ని కలిగి ఉండటంతో ఆ బోటు అక్టోబర్‌ 27న సముద్రంలో మునిగిపోయింది. 

చదవండి : 16 ఏళ్లకు భారీ అదృష్టం.. సరిగ్గా ఏడేళ్లకు ఊహించని విషాదం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top