బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా? | Sakshi
Sakshi News home page

Yami Gautam: పెళ్లయిన మూడేళ్లకు తల్లయిన స్టార్ హీరోయిన్

Published Mon, May 20 2024 12:18 PM

Yami Gautam Welcome Baby Boy And Named Vedavid

హీరోయిన్ యామీ గౌతమ్ గుడ్ న్యూస్ చెప్పేసింది. కొన్నిరోజుల ముందు తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టిన ఈమె.. ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పింది. అలానే పిల్లాడికి వేదవిద్ అని పేరు కూడా పెట్టినట్లు ఇన్ స్టా పోస్ట్‌తో వెల్లడించింది. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈమెకు విషెస్ చెబుతున్నారు.

(ఇదీ చదవండి: ఇక్కడ నాపై బ్యాన్‌ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్‌ రాజ్‌పుత్‌)

2010లో 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ సినిమాతో యామీ గౌతమ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత ఏడాదే 'నువ్విలా' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ తదితర తెలుగు సినిమాల్లో చేసింది. కానీ ఇక్కడ పెద్దగా కలిసి రాకపోవడంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. గత ఏడేళ్ల నుంచి అక్కడే మూవీస్ చేస్తోంది.

2019లో రిలీజైన 'ఉరి' చేస్తున్న టైంలో ఆ సినిమా దర్శకుడు ఆదిత్య ధర్‌తో ప్రేమలో పడింది. అలా రెండేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న వీళ్లిద్దరూ 2021లో పెళ్లి చేసుకున్నారు. రీసెంట్‌గా 'ఆర్టికల్ 370' చిత్రంతో హిట్ కొట్టిన యామీ.. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెప్పింది. ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది.

(ఇదీ చదవండి: బెంగళూరు రేవ్‌ పార్టీ.. స్పందించిన నటి హేమ)

Advertisement
 
Advertisement
 
Advertisement