వైకల్యంతో పుట్టాడని వదిలేశారు! | Abandoned Born With A Disability In Auto | Sakshi
Sakshi News home page

వైకల్యంతో పుట్టాడని వదిలేశారు!

Apr 5 2022 7:33 AM | Updated on Apr 5 2022 7:38 AM

Abandoned Born With A Disability In Auto - Sakshi

నాంపల్లి: నిలోఫర్‌ ఆస్పత్రి ఎదుట రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసిన ఓ ఆటోలో మూడ్రోజుల మగ శిశువు లభ్యమైంది. నాంపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దుస్తుల్లో చుట్టిన శిశువు ఏడుపులు విన్న ఆటో డ్రైవర్‌ నిలోఫర్‌ ఆస్పత్రికి, పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు శిశువును వదిలి వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. వైకల్యంతో పుట్టిన కారణంగానే పసికందును ఆటోలో వదిలివెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. శిశువిహార్‌ సిబ్బందికి సమాచారం అందించి చికిత్స నిమిత్తం నిలోఫర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

(చదవండి: భార్యను సంతోష పెట్టడం కోసం రాజస్థాన్‌ నుంచి బెంగళూరుకు వచ్చి..)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement