ఫ్యామిలీతో నిఖిల్ ఫోటో
ఖమ్మం: భర్త, కుమార్తె మృతి చెందగా.. కుమారుడైనా బతుకుతాడని భావించిన తల్లి ఆశలు కూడా నెరవేరలేదు. ఆస్పత్రిలో 18రోజుల పాటు చికిత్స చేయించినా ఫలితం దక్కగా బాలుడు మృతి చెందాడు. నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాస్ (44) గతనెల 16న అప్పుల బాధ తట్టుకోలేక కుమార్తె లాస్య(14), కుమారుడు నిఖిల్(11)ను ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా గండ్రాయిలోని పొలం వద్దకు తీసుకెళ్లి కలుపు మందు తాగడమే కాక పిల్లలకు తాగించాడు.
అదేరోజు శ్రీనివాస్, లాస్య మృతి చెందగా నిఖిల్‌కు హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తున్నారు. రెండు రోజుల క్రితం పరిస్థితి విషమంగా మారడంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచి్చన ఫలితం దక్కగా ఆదివారం మృతి చెందాడు. భర్త, కుమార్తె మృతి ఆవేదన తీరకముందే కుమారుడు కన్నుమూయడంతో శ్రీనివాస్ భార్య, ఆయన తల్లిదండ్రులను ఓద్చారడం ఎవరి వల్లా కాలేదు. ఈమేరకు బాలుడి అంత్యక్రియలను స్వగ్రామంలో పూర్తిచేశారు.
నేనొస్తా అంటివిగా కొడుకా...
తండ్రి, కూతురు కన్నుమూశాక హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న నిఖిల్‌తో వీడియో కాల్ చేయించారు. అప్పుడు బాలుడు ‘నాకేం కాలేదు.. బాగానే ఉన్నా.. త్వరగా ఇంటికి వస్తా’అని చెప్పాడు. కానీ ఇప్పుడు మృతి చెందడంతో ఆయన మృతదేహం వద్ద తల్లి, కుటుంబ సభ్యులు ‘నేనొస్తా అంటివి కదా కొడుకా’అంటూ రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
ఇదీ చదవండి: తెలంగాణ సెక్రటేరియెట్‌లో మంచి నీటి కష్టాలు?


