భార్య ఆనందం కోసం రాజస్థాన్‌ నుంచి బెంగళూరుకు వచ్చి.. | Police Caught Rajasthan Chain Snatcher Karnataka | Sakshi
Sakshi News home page

భార్యను సంతోష పెట్టడం కోసం రాజస్థాన్‌ నుంచి బెంగళూరుకు వచ్చి..

Apr 5 2022 6:59 AM | Updated on Apr 5 2022 9:09 AM

Police Caught Rajasthan Chain Snatcher Karnataka - Sakshi

స్వాధీనం చేసుకున్న బంగారం, స్కూటర్‌

బనశంకరి(బెంగళూరు): ప్రేమ వివాహం చేసుకున్న భార్యను సంతోష పెట్టడం కోసం ఓ ఘనుడు రాజస్థాన్‌ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ సోమవారం చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీసులకు చిక్కాడు. నిందితుడు ఉమేశ్‌ ఖతిక్‌ నుంచి రూ. 4 లక్షల విలువైన బంగారు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఉమేశ్‌  చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు.

ఇటీవల మారతహళ్లి, పుట్టేనహళ్లి, చెన్నమ్మకెరె అచ్చుకట్టు పరిధిలో మూడు స్నాచింగ్‌లు జరిగాయి. దీంతో పోలీసులకు నిద్రలేకుండా పోయింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం సోమవారం ఉమేశ్‌ను అరెస్ట్‌ చేశారు. ఇతడిపై రాజస్థాన్‌లో 18, హైదరాబాద్‌లో 7, బెంగళూరులో 7 చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి.  

బైక్‌ మీద వెళ్తుండగా గొలుసు చోరీ
మైసూరు: బైక్‌ మీద భర్తతో కలిసి వెళ్తున్న మహిళ మెడలో ఉన్న గొలుసును దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటన మైసూరు బోగాది రెండో స్టేజిలోని ప్రశాంత్‌ నగర్‌లో సోమవారం జరిగింది. అర్చన అనే మహిళ భర్తతో కలిసి బైక్‌పై వెళ్తోంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మరో బైక్‌పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకెళ్లారు. గొలుసు 55 గ్రాములు ఉన్నట్లు బాధితురాలు సరస్వతిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement