Bollywood Actress Gauhar Khan Blessed With Baby Boy - Sakshi
Sakshi News home page

Gauhar Khan: మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ భామ.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

May 12 2023 4:36 PM | Updated on May 12 2023 4:46 PM

Bollywood Actress Gauhar Khan Blessed With Baby Boy - Sakshi

బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ బ్యూటీ గౌహర్‌ ఖాన్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

(ఇది చదవండి: బీస్ట్‌ మోడ్‌లో హీరో సూర్య.. వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ ఫోటో)

కాగా.. గతేడాది డిసెంబర్‌లో తల్లి కాబోతోన్నట్లు ప్రకటించింది బాలీవుడ్ భామ. ఇటీవలే సీమంతానికి సంబంధించిన ఫోటోలను కూడా గౌహర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. గౌహర్‌ ఖాన్‌ రాకెట్‌ సింగ్‌: సేల్స్‌మెన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అనే సినిమాతో నటిగా కెరీర్‌ ఆరంభించింది.

అంతే కాకుండా గేమ్‌, 14 ఫెరే వంటి పలు చిత్రాల్లో నటించింది. ఝలక్‌ దిఖ్‌ లాజా 3, బిగ్‌బాస్‌ 7, ఫియర్‌ ఫ్యాక్టర్‌: ఖత్రోన్‌ కే ఖిలాడీ 5 వంటి రియాలిటీ షోలలనూ పాల్గొంది. తాండవ్‌, సాల్ట్‌ సిటీ, శిక్షా మండల్‌ వెబ్‌ సిరీస్‌లలో నటించింది. ఇటీవలే నెట్‌ప్లిక్స్‌లో ప్రసారమైన ఇన్‌ రియల్‌ లవ్‌  షోలో రణ్‌విజయ్‌ సింగ్‌తో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ప్రముఖ గాయకుడు, కంపోజర్‌ ఇస్మాయిల్‌ దర్బార్‌ కుమారుడైన జైద్‌ దర్బార్‌ను 2020 డిసెంబర్‌లో పెళ్లాడింది.‌ 

(ఇది చదవండి: ఓ ఆర్టిస్ట్‌గా మాత్రమే చూడండి.. కామంతో కాదు.. బిగ్ బాస్‌ బ్యూటీ!)

Advertisement
 
Advertisement
Advertisement