Bigg Boss Actress Priyanka Singh Latest Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Priyanka Singh: మీ హృదయంతో చూడండి.. కామంతో కాదు.. బిగ్ బాస్ పింకీ పోస్ట్ వైరల్!

May 12 2023 3:17 PM | Updated on May 12 2023 4:34 PM

Bigg Boss Actress Priyanka Singh Latest Pics Goes Viral - Sakshi

బుల్లితెర నటి ప్రియాంక సింగ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్‌బాస్‌ సీజన్‌-5లో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. మానస్‌ అంటే ఇష్టమంటూ హౌస్‌లో సందడి చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది భామ. బోల్డ్ ఫోటో షూట్‌లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

(ఇది చదవండి: ఎంపీతో ఎంగేజ్‌మెంట్‌.. అందంగా ముస్తాబైన హీరోయిన్‌ ఇల్లు)

ప్రియాంక తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఇది బోల్డ్ కాదు.. నేను ఓ ఆర్టిస్ట్‌ అన్న విషయం గుర్తుంచుకోండి. మీ హృదయంతో నా అందాన్ని చూడండి. అంతేకానీ మీ కామపు కళ్లతో కాదు.' అంటూ పోస్ట్ చేసింది. అందులో టవల్‌ చుట్టుకున్న ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్స్ మరీ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్‌ ఆమె తీరును తప్పుబడుతుండగా.. మరికొందరేమో మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్‌ పింకీ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. 

(ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్‌ అవార్డులు.. నెటిజన్స్‌ ట్రోలింగ్‌)

Advertisement
 
Advertisement
Advertisement