Parineeti Chopra's house gets decked up ahead of engagement with Raghav Chadha - Sakshi
Sakshi News home page

Parineeti Chopra: ఎంపీతో ఎంగేజ్‌మెంట్‌.. అందంగా ముస్తాబైన హీరోయిన్‌ ఇల్లు

May 12 2023 1:22 PM | Updated on May 12 2023 2:50 PM

Parineeti Chopra House Gets Decked Up With Lights Aheaf Of Engagement - Sakshi

బాలీవుడ్‌ భామ పరిణీతి చోప్రా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో డిన్నర్, లంచ్ అంటూ రెస్టారెంట్స్ చుట్టూ తిరుగుతూ పలుమార్లు మీడియా కంట పడ్డారు. కానీ తమ ప్రేమ విషయంపై మాత్రం ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు.

ఇప్పుడు తమ రిలేషన్‌షిప్‌ను పెళ్లిబంధంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. రేపు(శనివారం)ఢిల్లీలో రాఘవ్‌ చద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని పరిణీతి చోప్రా ఇంటిని ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

సంబంధింత వర్గాల సమాచారం ప్రకారం.. పరిణీతి-రాఘవ్‌ల ఎంగేజ్‌మెంట్‌కు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, పలువురు రాజకీయ నేతలు మాత్రమే హాజరవుతారని సమాచారం. నిశ్చితార్థ వేడుకలో రాఘవ్‌ పవన్ సచ్‌దేవా రూపొందించిన డిజైనర్‌ డ్రెస్‌లో కనిపించనుండగా, పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్‌ చేసిన అవుట్‌ఫిట్‌లో కనిపించనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement