
ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం ఛావా. విక్కీ కౌశల్, రష్మిక కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఛావా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో మెప్పించారు.
తాజాగా ఛావా నటుడు వినీత్ కుమార్ సింగ్ తండ్రైనట్లు ప్రకటించారు. ఈనెల 24న బాబు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది మే నెలలో తన భార్య రుచిరా గర్భంతో ఉన్నారని శుభవార్త చెప్పారు. తాజాగా ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. కాగా.. వినీత్ కుమార్ సింగ్ 2021లో నటి రుచిరాను పెళ్లాడారు. ఈ విషయం తెలుసుకున్న 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సే అభినందనలు తెలిపారు. మీ చిన్నారిని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ తెలిపారు.
కాగా.. వినీత్ కుమార్ సింగ్ ముక్కాబాజ్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లాంటి చిత్రాలతో బాలీవుడ్‌లో ఫేమస్ అయ్యారు. ఈ ఏడాది ఛావా మూవీతో బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంలో చందోగమాత్య కవి కలష్ పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన జాట్ మూవీతోనూ కనిపించారు. అంతకుముందు 'సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలెగావ్', గుంజన్ సక్సేనా, గుస్పాతియా, మ్యాచ్ ఫిక్సింగ్' లాంటి సినిమాలతో పాటు రంగ్‌బాజ్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు.