Dil Raju: నిర్మాత దిల్ రాజు ఇంటికి 'వారసుడు'..

Producer Dil Raju Blessed With Baby Boy With Wife Tejaswini: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన తాజాగా మరోసారి తండ్రి అయ్యారు. దిల్ రాజు సతీమణి తేజస్విని బుధవారం (జూన్ 29) ఉదయం మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో దిల్ రాజు ఇంట పండుగ వాతావరణం నెలకొంది. దీంతో దిల్ రాజు ఇంటికి వారసుడొచ్చాడు అంటూ టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 10, 2020న నిజామాబాద్‌లో దిల్ రాజు, తేజస్వినిల వివాహం జరిగింది. దిల్ రాజు, అనితలకు ఒక కుమార్తె హన్షిత ఉంది. కాగా ప్రస్తుతం దిల్ రాజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో 'వారసుడు' సినిమా చేస్తున్నారు. ఈ సమయంలోనే దిల్ రాజు ఇంటికి నిజంగానే వారసుడు వచ్చాడు.
చదవండి: తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ..
ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ ప్రముఖులు.. అమితాబ్ ఆసక్తికర పోస్ట్
తొలిసారిగా అది చూపించబోతున్నాం: మాధవన్
Superhit Producer Dil Raju blessed with a baby boy. Congratulations 🎉
— BA Raju's Team (@baraju_SuperHit) June 29, 2022