Atal Bihari Vajpayee Biopic: తెరపైకి అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ..

Biopic On Late PM Atal Bihari Vajpayee - Sakshi

Biopic On Late PM Atal Bihari Vajpayee: దివంగత భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. 'మై రహూ యా నా రహూ ఏ దేశ్‌ రెహనా చాహియే-అటల్‌' అనే టైటిల్‌తో వినోద్‌ భన్సాలీ, సందీప్ సింగ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మంగళవారం (జూన్‌ 28) ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి గ్లింప్స్‌ను విడుదల చేశారు. 

ఉల్లేక్‌ ఏన్‌పీ రాసిన 'ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయి: పొలిటీషియన్‌ అండ్‌ పారాడాక్స్‌' పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇంకా దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఖరారు కాలేదు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో షూటింగ్‌ ప్రారంభించి, క్రిస్మస్‌కు విడుదల చేయాలనుకుంటున్నారు. అటల్‌ పుట్టినరోజు డిసెంబర్‌ 25. వచ్చే ఏడాది 99వ జయంతి సందర్భంగా ‍్టల్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చదవండి: పాడె మోసి మాట నిలబెట్టుకున్న నటుడు.. ఎమోషనల్‌గా పోస్ట్‌..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top