ఓటీటీకి మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Main Atal Hoon Movie Streaming On This OTT Platform | Sakshi
Sakshi News home page

Main Atal Hoon Movie: ఓటీటీకి వాజ్‌పేయి బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Sun, Mar 10 2024 4:04 PM | Last Updated on Sun, Mar 10 2024 4:15 PM

Main Atal Hoon Movie Streaming On This OTT Platform - Sakshi

భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తోన్న బయోపిక్ మెయిన్ అటల్ హూన్. రవి జాదవ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

ఈ మూవీ హక్కులను ఇప్పటికే సొంతం చేసుకున్న జీ5 స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈనెల 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఇందులో పంకజ్ త్రిపాఠి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఆయన పర్సనల్ లైఫ్, రాజకీయ జీవితం గురించి చూపించారు. ఈ చిత్రంలో పీయూష్ మిశ్రా, దయా శంకర్ పాండే, రాజా సేవక్, ఏక్తా కౌల్ పలువురు నటించారు. జనవరి 19, 2024న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రెండు నెలల్లోపే ఓటీటీకి వచ్చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement