అంత్యక్రియలు నిర్వహించి మాట నిలబెట్టుకున్న నటుడు.. ఎమోషనల్‌గా పోస్ట్‌..

Randeep Hooda Performs Last Rites Of Sarabjit Singh Sister Dalbir Kaur - Sakshi

Randeep Hooda Performs Last Rites Of Sarabjit Singh Sister Dalbir Kaur: బాలీవుడ్‌ ప్రముఖ నటుల్లో రణ్‌దీప్‌ హుడా ఒకరు. తాజాగా పంజాబ్‌కు చెందిన సరబ్‌జిత్‌ సింగ్‌ సోదరి దల్బీర్ కౌర్‌ పాడెను మోసి, అంత్యక్రియలు నిర్వహించాడు. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణల కింద సరబ్‌జిత్‌ సింగ్‌కు పాకిస్తాన్‌ సుప్రీం కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అతని బయోపిక్‌గా 2016లో తెరకెక్కిన 'సరబ్‌జిత్‌' సినిమాలో సరబ్‌జిత్‌ సింగ్‌ పాత్రలో రణ్‌దీప్ హుడా నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సరబ్‌జిత్‌ సింగ్‌ సోదరి దల్బీర్‌ కౌర్‌కు రణ్‌దీప్‌ హుడాకు మంచి అనుబంధం ఏర్పడింది.

రణ్‌దీప్‌ హుడాలో తన సోదరుడు సరబ్‌జిత్‌ సింగ్‌ను చూసుకుంటున్నట్లుగా ఆమె అతనితో చెప్పింది. ఈ క్రమంలోనే రణ్‌దీప్‌ హుడాను దల్బీర్‌ కౌర్ ఒక కోరిక కోరింది.  తాను చనిపోయినప్పుడు ఆమెకు 'కంధ' (అంత్యక్రియలకు తీసుకువెళ్లేటప్పుడు భుజంపై పాడెను మోయడం) ఇవ్వాల్సిందిగా అడిగింది. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లుగా ఒక సోదరుడిలా దల్బీర్‌ కౌర్‌ దహన సంస్కరాలు నిర్వహించాడు రణ్‌దీప్‌. 
 

ఈ విషయంపై తన ఇన్‌స్టాలో ఆమె చివరిసారిగా చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ 'నన్ను త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. కానీ నేను వెళ్లేసరికి ఆమె వెళ్లిపోయింది. దల్బీర్‌ కౌర్‌జీ ఇంత త్వరగా మమ్మల్ని విడిచి పెడతారని అనుకోలేదు. ఆమె తన ప్రియమైన సోదరుడు సరబ్‌జిత్‌ సింగ్‌ను కాపాడుకునేందుకు ఎంతో పోరాటం చేసింది. ఆమె ప్రేమ, ఆశీర్వాదం నాపై ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని. ఆమె కట్టిన రాఖీని నా జీవితంలో మర్చిపోలేను.' అని ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు. కాగా దల్బీర్‌ కౌర్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలో ఉన్న భిఖివింద్‌లో ఆదివారం (జూన్‌ 26) గుండెపోటుతో మరణించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top