అజిత్‌ పవార్‌ అంత్యక్రియలకు మోదీ, అమిత్‌ షా | Maharashtra Deputy CM Ajit Pawar Died In Plane Crash, Last Rites Funeral Live Updates Latest News Telugu | Sakshi
Sakshi News home page

Ajit Pawar Funerals: అజిత్‌ పవార్‌ అంత్యక్రియలకు మోదీ, అమిత్‌ షా

Jan 29 2026 8:09 AM | Updated on Jan 29 2026 9:58 AM

Ajit Pawar Plane Crash Last Rites funeral Live Updates News

ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. గురువారం ఉదయం బారామతిలోని విద్య ప్రస్థాన్‌లో జరగబోయే అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్‌ నితిన్‌ నబీన్‌.. తదితరులు హాజరు కానున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అజిత్‌ దాదా కడసారి చూపు కోసం రాజకీయ నేతలు, అభిమానులు బారామతిలోని ఆయన నివాసం వద్దకు క్యూ కడుతున్నారు. శివసేన(యూబీటీ) చీఫ్‌ ఉద్దవ్‌ థాక్రే, ఆయన తనయుడు ఆదిత్య థాక్రే ఈ ఉదయం అజిత్‌ పవార్‌కు నివాళులర్పించారు. అంతిమ యాత్ర, అంత్యక్రియలకు పవార్‌ కుటుంబం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్ర రాజకీయ ప్రముఖులందరూ ఈ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.

మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తన సొంత నియోజక వర్గం బారామతిలో జరగబోయే ప్రచార సభలకు బుధవారం ఉదయం అజిత్‌ పవార్‌ చార్టెడ్‌ ఫ్లైట్‌లో బయల్దేరారు. అయితే ల్యాండింగ్‌ చివరి నిమిషంలో విమానం అదుపు తప్పి సమీపంలోని గోజుబావి గ్రామ సమీంలోని గుట్టల్లో కూలిపోయింది.

బండ రాయిని విమానం బలంగా ఢీ కొట్టి రెండు ముక్కులై.. పేలి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో అజిత్‌ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది, పైలెట్లు, ఫ్లైట్‌ అటెండెంట్‌ మొత్తం ఐదుగురు మరణించారు. ప్రమాదం ధాటికి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు కాలిపోయాయి. అయితే చేతి వాచీ ఆధారంగా అజిత్‌ పవార్‌ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అజిత్‌ పవార్‌తో పాటు ప్రమాదంలో మరణించిన మిగతా వాళ్ల మృతదేహాలకు ఈ ఉదయం పోస్టుమార్టం పూర్తైంది. దీంతో పుణ్యశ్లోక్‌ అహల్యాదేవి హోల్కర్‌ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బంధువులు మృతదేహాలను తమ స్వస్థలాలకు తరలించారు.

ఈ ఘటనపై ఏఏఐబీ (Aircraft Accident Investigation Bureau.. విమాన ప్రమాదాల పరిశోధన బ్యూరో) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఘటనా స్థలం నుంచి పలు ఆధారాలు సేకరించింది. బ్లాక్‌ బాక్స్‌ను రికవరీ చేసుకుని డీ కోడింగ్‌ చేసుకునే పనిలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement