గుడ్‌న్యూస్‌ చెప్పిన 'జాట్‌' విలన్‌ | Actors Randeep Hooda and Lin Laishram announce First Pregnancy | Sakshi
Sakshi News home page

50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు

Nov 29 2025 1:51 PM | Updated on Nov 29 2025 3:00 PM

Actors Randeep Hooda and Lin Laishram announce First Pregnancy

బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్‌ హుడా శుభవార్త చెప్పాడు. 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. రణ్‌దీప్‌ హుడా నటి లిన్‌ లైశ్రామ్‌ను 2023లో పెళ్లి చేసుకున్నాడు. నేడు (నవంబర్‌ 29న) వారి పెళ్లి రోజు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ బ్యూటిఫుల్‌ ఫోటో షేర్‌ చేశారు. అందులో దంపతులిద్దరూ పచ్చని చెట్ల మధ్య చలి మంట కాచుకుంటున్నారు. 

త్వరలో బుజ్జి పాపాయి
ఈ పోస్ట్‌ కింద.. రెండేళ్ల ప్రయాణం, ఇప్పుడు మా ఇంట్లోకి ఓ బుజ్జి పాపాయి రాబోతోంది.. అని క్యాప్షన్‌ జోడించారు. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు రణ్‌దీప్‌ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లిన్‌ లైశ్రామ్‌.. ఓం శాంతి ఓం, మేరీ కోమ్‌, ఉమ్రిక, రంగూన్‌ వంటి పలు సినిమాలు చేసింది. 

సినిమా 
నటుడు రణ్‌దీప్‌ (Randeep Hooda).. రిస్క్‌, లవ్‌ కిచిడీ, జన్నత్‌ 2, హీరోయిన్‌, మర్డర్‌ 3, హైవే, సుల్తాన్‌, లవ్‌ ఆజ్‌ కల్‌, భాగీ 2 వంటి పలు సినిమాలు చేశాడు. స్వతంత్ర వీర్‌ సావర్కర్‌ సినిమాలో నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగానూ వ్యవహరించాడు. చివరగా జాట్‌ సినిమాలో విలన్‌గా నటించాడు. ప్రస్తుతం అమెరికన్‌ ఫిలిం మ్యాచ్‌బాక్స్‌లో నటిస్తున్నాడు.

 

 

చదవండి: శ్రావణ భార్గవితో విడాకులు.. హేమచంద్ర ఏమన్నాడంటే?

Advertisement
 
Advertisement
Advertisement