
4.50 కేజీల బరువుతో పుట్టిన శిశువు
అనంతపురం,విడపనకల్లు: మండల పరిధిలోని వి.కొత్తకోట గ్రామానికి చెందిన రామనాథ్ భార్య వనిత మంగళవారం విడపనకల్లు ప్రభుత్వాస్పత్రిలో 4.50 కేజీల మగ శిశువుకు జన్మనిచ్చింది. ఇంత వరకు కూడా తమ ఆస్పత్రిలో 4.50 కేజీలు బరువు ఉన్న శిశువు జన్మించలేదని, ఇదే తొలిసారని డాక్టర్ శ్రీధర్, స్టాప్ నర్సు లీలావతి తెలిపారు. వనిత ప్రారంభం నుంచి కూడా వైద్యుల సలహాల పాటిస్తూ మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల అత్యధిక బరువు గల ఆరోగ్యకరమైన శిశువుకు సాధారణ డెలివరీలోనే జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు.