
నాగోలు: అభం శుభం తెలియని చిన్నారిని నిర్మాణంలో ఉన్న భవనం వద్ద వదిలేసి వెళ్లిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్‌బీనగర్ బిగ్‌బజార్ సమీపంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద మూడు నెలల బాబును వదిలేసి వెళ్లారు. వాచ్‌మెన్‌గా పని చేస్తున్న వెంకటయ్య దీనిని గుర్తించి ఎల్‌బీనగర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టినా ఫలితం లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటి అధికారులకు అప్పగించారు. పోలీసులు కేసు నమేదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.