Karthi Reveals His Baby Boy First Pic And Name, Shares Lovely Message - Sakshi
Sakshi News home page

కొడుకు పేరును రివీల్‌ చేసిన హీరో

Mar 18 2021 5:14 PM | Updated on Mar 18 2021 8:32 PM

Hero Karthi Reveals His Baby Boy Name - Sakshi

తమ హీరో వారసుడు ఎలా ఉన్నాడు? అతనికి ఏం పేరు పెట్టారు? అనే విషయాల కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. బుధవారం తన కొడుకుకు సంబంధించిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ పేరును ప్రకటించాడు కార్తి.

తమిళ హీరో కార్తి, రంజని దంపతులకు గతేడాది అక్టోబర్‌లో అబ్బాయి పుట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు తన వారసుడికి సంబంధించిన ఫోటోలను కానీ, ఇతర విషయాలను కానీ కార్తి బయట ప్రస్తావించలేదు. కేవలం కొడుకు పుట్టాడని మాత్రమే సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. తమ హీరో వారసుడు ఎలా ఉన్నాడు? అతనికి ఏం పేరు పెట్టారు? అనే విషయాల కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. బుధవారం తన కొడుకుకు సంబంధించిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ పేరును ప్రకటించాడు కార్తి.


ఈమేరకు తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో ‘నేను, మీ అమ్మ, నీ సోదరి ఎంతో ప్రేమతో నీకు కందన్ అని పేరు పెట్టాము. నీ రాకతో మా జీవితాలు మరింత మధురంగా మారిపోయాయి అని రాసుకొచ్చాడు హీరో కార్తి. కొడుకు పేరు అనౌన్స్ చేసిన వెంటనే కార్తికి సినీ ప్రముఖులతో పాటు అభిమనులను నుంచి అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. కాగా, 2011లో కార్తీ, రంజనీ వివాహం చేసుకున్నారు. 2013లో వాళ్లకు ఓ ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ఉమయాళ్‌ అని పేరు పెట్టారు. కార్తి ప్రస్తుతం ప్రస్తుతం సుల్తాన్, పొన్నీయన్ సెల్వన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement