పుత్రోత్సాహంతో కమెడియన్‌ కపిల్‌ శర్మ

Kapil Sharma And Ginni Chatrath Blessed With Second Child Baby Boy - Sakshi

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ మరోసారి తండ్రి అయ్యాడు. ఈ రోజు ఉదయం ఆయన భార్య గిన్ని చరాత్‌ పండంటి మగ బిడ్డకు జన్మినించారు. ఈ విషయాన్ని కపిల్‌ శర్మ సోషల్‌ మీడియా వేదికగా సోమవారం ప్రకటించాడు. ‘నమస్కార్‌.. ఈ రోజు ఉదయం నా భార్య మగ బిడ్డకు జన్మినించింది. దేవుడి దయ వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ ఆయన ట్వీట్‌ చేశాడు. బాలీవుడ్‌ నటీనటులు, అభిమానులు కపిల్‌కు శభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే తమ ఇంట్లోకి చిన్న అతిథి రాబోతున్నాడన్న శుభవార్తను గతవారం ‍కపిల్‌ అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: అందుకే బ్రేక్‌ తీసుకుంటున్నా: కపిల్‌ శర్మ)

2018లో హిందూ, సిక్కు సంప్రదాయంలో వివాహం చేసుకున్న కపిల్‌ శర్మ-గిన్ని చరాత్‌లకు 2019 డిసెంబర్‌లో కూతురు అనైరా శర్మ జన్మించింది. కాగా ‘కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌’ షోతో ప్రాచుర్యం పొందిన కపిల్‌ శర్మ.. హిందీ బుల్లితెరపై స్టార్‌ కమెడియన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అంతేగాక.. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక పలు బాలీవుడ్‌ సినిమాలలో కూడా నటించిన కపిల్‌.. ‘సన్‌ ఆఫ్‌ మంజీత్‌ సింగ్‌’  అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top