‘మీకు డబ్బులు ఎలా వస్తాయి’.. నా భర్త చాలా కష్టపడతాడు: శిల్పా శెట్టి

Raj Kundra Arrest Old Video of Kapil Sharma Show About His Income Go Viral - Sakshi

Raj Kundra Arrest: లండన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. సినిమాలు, వెబ్‌ సిరీస్‌ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. ఆ తర్వాత వారితో బలవంతంగా అడల్ట్‌ చిత్రాలు నిర్మించి.. వాటిని కొన్ని యాప్‌ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడనే ఆరోపణల మీద పోలీసులు రాజ్‌ కుంద్రాను అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో రాజ్‌ కుంద్రా ఆదాయం గురించి భార్య శిల్పా శెట్టి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..

కపిల్‌ శర్మ షోకు ఓ సారి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రా, సోదరి షమితా శెట్టి గెస్ట్‌లుగా హాజరవుతారు. ఈ నేపథ్యంలో కపిల్‌ శర్మ, రాజ్‌ కుంద్రాను ఉద్దేశిస్తూ.. ‘‘మీరు ఎప్పుడు చూసినా టైం పాస్‌ చేస్తూ.. జాలీగా గడుపుతారు. ఇంత లగ్జరీ బతకడానికి మీకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది.. అసలు ఏం పని చేయకుండా మీకు డబ్బు ఎలా వస్తుందని’’ ప్రశ్నిస్తాడు.

అంతేకాక ‘‘మీరు ఎప్పుడు చూసినా పార్టీలకు వెళ్తూ, భార్యతో షాపింగ్‌ అంటూ తిరుగుతారు. సినీ తారలతో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఆడుతుంటారు. ఇన్ని పనులు చేస్తూ, బిజీగా ఉంటారు.. మీకు డబ్బులు సంపాదించడానికి టైం ఎప్పుడు దొరుకుతుంది’’ అని కపిల్‌ శర్మ ప్రశ్నిస్తాడు. అందుకు శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా, షమితా ముగ్గురు పెద్ద పెట్టున నవ్వుతారు. ఆ తర్వాత శిల్పా శెట్టి బదులిస్తూ.. ‘‘నా భర్త చాలా కష్టపడతారు.. ఒక్కోసారి ఆయన గంటలకొద్ది పని చేస్తూనే ఉంటారు. అసలు రెస్ట్‌ అనేది దొరకదు’’ అని సమాధానం చెప్పారు. 

ఏళ్ల నాటి ఈ వీడియో రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ తర్వాత మరోసారి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజనులు ‘‘కపిల్‌ శర్మ అడిగిన ప్రశ్నకు ఇన్నాళ్లకు సరైన సమాధానం లభించింది’’.. ‘‘సినిమా అవకాశాల పేరుతో యువతుల జీవితాలను నాశనం చేస్తూ.. తాను మాత్రం ఖరీదైన జీవితం గడుపుతున్నాడు’’.. ‘‘అవును పాపం.. పోర్న్‌ సినిమాలు తీయడానికి.. అమాయకులైన ఆడవారిని మోసం చేయడానికి చాలా కష్టపడుతున్నాడు’’ అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు నెటిజనులు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top