

దుబాయ్‌లో 'షారుఖ్ ఖాన్'కు రెండు విల్లాలు ఉన్నాయి. బుర్జ్ ఖలీఫాలో ఆయనకు ఒక ఫ్లాట్ ఉంది ( రూ, 18 కోట్లు), ఆపై దుబాయ్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నఖీల్ రూ. 100 కోట్ల విలువైన విల్లాను బహుమతిగా ఇచ్చింది.

బాలీవుడ్ హీరోయిన్ 'శిల్పాశెట్టి'కి బుర్జ్ ఖలీఫాలో సుమారు రూ.50 కోట్ల విలువైన ఫ్లాట్ ఉంది. 2010లో తన భర్త రాజ్ కుంద్రా ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడు

దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా సమీపంలో ఉన్న 'ది అడ్రస్ డౌన్‌టౌన్'లో సల్మాన్ ఖాన్‌కు రూ. 60 కోట్లు విలువ చేసే విల్లా ఉంది.

.'ఐశ్వర్య రాయ్' దంపతులు దుబాయ్‌లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్ సాంక్చూరీ ఫాల్స్‌లో రూ.16 కోట్లకు పైగా విలువ చేసే విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారు.

దుబాయ్‌లోని ఆధునిక ప్రాంతాలలో ఒకటైన అల్ ఫుర్జాన్‌లో 'అనిల్ కపూర్'కు రెండు పడకగదుల అపార్ట్‌మెంట్ ఉంది.

మలైకా అరోరాకు దుబాయ్‌లో సరస్సు ఒడ్డున ఒక విలాసవంతమైన కాటేజ్ విల్లా ఉంది.

సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ పసిఫిక్ వెంచర్స్ బ్రాండ్ అంబాసిడర్. అతను 2013లో బుర్జ్ ఖలీఫా పై అంతస్తులో ఖరీదైన అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేశాడు.

మలయాళ నటుడు 'మోహన్‌లాల్'కు కూడా దుబాయ్‌లో లగ్జరీ ఫ్లాట్ ఉంది.

'మమ్ముట్టి'కి దుబాయ్‌లో అతిపెద్ద ఇల్లు ఉంది.