ముంబై : 27వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర అకాడమీ (IIFA 2027) అవార్డుల ఉత్సవానికి సంబంధించిన అధికారిక విలేకరుల సమావేశం (ప్రెస్ కాన్ఫరెన్స్) అక్టోబర్ 22, 2026న ముంబైలో ఘనంగా జరిగింది.
27వ ఐఫా (IIFA) వేడుకలు 2027 జనవరి 22, 23 తేదీలలో అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో గల ఎతిహాద్ అరేనా (Etihad Arena) లో జరగనున్నాయి.
ఐఫా చరిత్రలోనే మొదటిసారిగా ఈ ప్రధాన అవార్డుల వేడుకను యూట్యూబ్ (YouTube) లో ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
అలాగే ఈసారి సరికొత్త "డిజిటల్ అవార్డ్స్" ఫార్మాట్‌ను కూడా ప్రవేశపెడుతున్నారు.
ఈ విలేకరుల సమావేశంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, రష్మిక మందన్న, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ వంటి తారలు సందడి చేశారు.
(Images Source : Instagram/iifa)


