అప్పుడే పుట్టిన పసికందు కిడ్నాప్‌.. నర్సు వేషంలో వచ్చి.. | Machilipatnam New Born Baby Kidnap Case Solved, More Details Inside | Sakshi
Sakshi News home page

అప్పుడే పుట్టిన పసికందు కిడ్నాప్‌.. నర్సు వేషంలో వచ్చి..

Jul 14 2024 12:44 PM | Updated on Jul 14 2024 1:50 PM

Machilipatnam New Born Baby Kidnap Case Solved

సాక్షి,కృష్ణాజిల్లా : కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి కలకలం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువు కిడ్నాప్‌కు గురైంది. నర్స్‌ వేషంలో వచ్చిన ఓ మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితులు, ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో నాలుగు గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు.

కిడ్నాప్‌ చేసిన మహిళ మచిలీ పట్నానికి చెందిన చెరుకురసం అమ్మే మహిళగా గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని బాబును తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే మహిళ అప్పుడే పుట్టిన చిన్నారిని కిడ్నాప్‌ చేయడానికి గల కారణాల్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement