సాక్షి, విజయవాడ: విజయవాడలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పెజ్జోనిపేటకు చెందిన వృద్ధుడి బ్యాంకు ఖాతా నుంచి రూ. 24 లక్షలు సైబర్ నేరగాళ్ళు కొల్లగొట్టారు. వృద్ధుడు బ్యాంకు ఖాతా నుంచి బాధితుడికి తెలియకుండా నగదు డెబిట్ చేశారు. ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న సొమ్మును సైబర్ కేటుగాళ్లు కొల్లగొట్టారు.
బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదుతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలో సొమ్ము మాయం చేశారు. అక్టోబర్ 20 నుంచే అనధికారిక లావాదేవీలు జరిగినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. నవంబర్ 4న ట్రాన్సాక్షన్ అలర్ట్ ఈ-మెయిల్స్ రావడంతో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: వెబ్‌ల్యాండ్‌లో ‘లాగిన్’ లూటీ


