తండ్రైన యంగ్‌ హీరో నిఖిల్‌.. ఫోటో వైరల్‌ | Young Hero Nikhil And His Wife Pallavi Are Blessed With A BABY BOY | Sakshi
Sakshi News home page

తండ్రైన యంగ్‌ హీరో నిఖిల్‌.. ఫోటో వైరల్‌

Published Wed, Feb 21 2024 1:49 PM | Last Updated on Wed, Feb 21 2024 3:47 PM

Young Hero Nikhil And His Wife Pallavi Are Blessed With A BABY BOY - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌ తండ్రి అయ్యాడు. నిఖిల్‌ భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్‌, డాక్టర్‌ పల్లవి  2020లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

(చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?)

నిఖిల్‌ సినీ  కెరీర్‌ విషయాకొస్తే.. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్‌’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు.  కార్తికేయ, స్వామిరారా సినిమాలతో హిట్స్‌ అందుకున్నాడు. కార్తికేయ 2తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం మరో పాన్‌ ఇండియా మూవీ ‘స్వయంభూ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. . చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్​ ఓ వారియర్​ పాత్రలో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement