ప్రమాదంపై స్పందించిన నిఖిల్‌ | Actor Nikhil Siddharth React On The India House Movie Incident | Sakshi
Sakshi News home page

ప్రమాదంపై స్పందించిన నిఖిల్‌

Jun 12 2025 12:02 PM | Updated on Jun 12 2025 12:14 PM

Actor Nikhil Siddharth React On The India House Movie Incident

హీరో నిఖిల్ (Nikhil) సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన ఒక పోస్ట్‌ చేశారు. రామ్‌చరణ్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా  ‘ది ఇండియా హౌస్’ (The India House) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, సినిమాలో అత్యంత కీలకమైన సీన్‌ చిత్రీకరణ కోసం  శంషాబాద్‌ సమీపంలో ఒక భారీ సెట్‌ వేశారు.  సముద్రం సీన్స్‌ తీసేందుకు  అతిపెద్ద వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేయగా ప్రమాదవశాత్తు అది పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా సెట్‌లోకి నీళ్లు ముంచెత్తాయి. ఈ ఘటన వల్ల చాలామంది గాయపడ్డారని తెలిసింది. అయితే, తాజాగా ఈ చిత్ర హీరో నిఖిల్‌ వివరణ ఇచ్చారు.

ప్రమాదంపై  నిఖిల్‌ ఇలా స్పందించారు. 'మేము అందరం చాలా క్షేమంగానే ఉన్నాం. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్‌ అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నాలు చేసే క్రమంలో కొన్నిసార్లు ఇలాంటి రిస్క్‌లు తీసుకోవాల్సిందే. అలాంటి సమయంలో ఒక్కోసారి ఇలాంటి ఘటనలు జరగొచ్చు. కానీ, మా చిత్ర యూనిట్‌ ముందుగా తీసుకున్న జాగ్రత్తల వల్ల మేము పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాం. అయితే, మేము అత్యంత ఖరీదైన సినిమా పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.' అని ఆయన తెలిపారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్‌, సయీ మంజ్రేకర్‌ జంటగా నటిస్తున్నారు. రామ్‌ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమ్‌ ఖేర్‌ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement