బాబాయ్‌ సినిమాను పట్టించుకోని రామ్ చరణ్.. ఆ మెగా హీరోలు మాత్రం! | ram charan did not any Post aheahd of hari Hara Veera mallu Release | Sakshi
Sakshi News home page

Hari Hara Veera Mallu Release: బాబాయ్‌ సినిమాను పట్టించుకోని రామ్ చరణ్.. ఆ ఇద్దరు మాత్రమే!

Jul 24 2025 3:48 PM | Updated on Jul 24 2025 4:08 PM

ram charan did not any Post aheahd of hari Hara Veera mallu Release

పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు. దాదాపు ఐదేళ్లపాటు షూటింగ్ చేసిన సినిమా ఎట్టకేలకు జూలై 24 థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచి చిత్రం కోసం నిరీక్షించిన అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. బాక్సాఫీస్ బద్దలవుతుందని రిలీజ్కు ముందు హల్చల్చేశారు. కానీ తొలి ఆట నుంచే ఊహించని విధంగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఉత్సాహంగా థియేటర్కు వెళ్లిన అభిమానులు.. బయటికి వచ్చేటప్పుడు మాత్రం జోష్ కనిపించలేదు. దీంతో తొలిరోజే వీరమల్లుకు పెద్ద షాక్తగిలినట్లే అర్థమవుతోంది.

అయితే హరిహర వీరమల్లు రిలీజ్కావడంతో మెగా హీరోలంతా పవన్ కల్యాణ్ సినిమాకు ఆల్ ది బెస్ట్చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ట్వీట్ చేస్తూ సినిమా సక్సెస్ కావాలంటూ ట్వీట్ చేశారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ తారలు వీరమల్లు చిత్రం రిలీజ్వేళ మద్దతుగా పోస్టులు పెట్టారు.

అయితే మెగా హీరో, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాత్రం బాబాయ్ సినిమా రిలీజ్కు ముందు ఎలాంటి పోస్ట్ చేయలేదు. ట్రైలర్ రిలీజ్రోజు మాత్రమే పోస్ట్ పెట్టిన చెర్రీ.. హరిహర వీరమల్లు విడుదలకు ముందు ఎలాంటి విషెస్చెప్పలేదు. దీంతో బాబాయ్సినిమాకు చెర్రీ పోస్ట్పెట్టకపోవడంపై నెటిజన్స్చర్చించుకుంటున్నారు. మరోవైపు పెద్ది సినిమాతో బిజీగా ఉండడం వల్లే కుదరక పోయి ఉండొచ్చని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా బాబాయ్ చిత్రానికి మెగా హీరో రామ్ చరణ్ సపోర్ట్ చేయకపోవడం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement