
'గబ్బర్ సింగ్' సినిమాలో 'నాకు కొంచెం తిక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది' అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది. అయితే, ఆయన అభిమానులు 'హరి హర వీరమల్లు' సినిమా విషయంలో ఇదే లెక్కను ఫాలో అవుతున్నారనిపిస్తుంది. పాన్ ఇండియా రేంజ్లో ఎలాంటి బజ్లేని ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు నానాపాట్లు పడుతున్నారు. ట్రైలర్ విడుదల సమయంలో వ్యూస్ పరంగా ఫేక్ చేశారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ప్లాన్ వేశారు. ఈ క్రమంలో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా మీద హరి హర వీరమల్లు పోస్టర్ అంటూ అందుకు సంబంధించిన ఫేక్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అయితే, అవి నిజమేనని అందరూ నెటిజన్లు కూడా షేర్ చేస్తున్నారు. విషయం తెలిసిన వారు మాత్రం ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎందుకు చేసుకుంటారని ఘాటుగానే విమర్శిస్తున్నారు.
గత కొన్ని గంటలుగా సోషల్మీడియాలో బుర్జ్ ఖలీఫా మీద 'హరి హర వీరమల్లు' పోస్టర్ అంటూ ట్రెండ్ అవుతుంది. అయితే, అది నిజమైనది కాదు. సినిమా అధికారిక హ్యాండిల్‌ను అనుకరించే నకిలీ ఖాతా నుంచి మొదటసారి పోస్ట్ చేయబడింది. ఆపై వందల కొద్ది పలు పేజీలు దానిని షేర్ చేయడంతో వైరల్ అయిపోయింది. అంతపెద్ద ఎత్తున పోస్టర్ను పంచుకుంటే.. చిత్ర యూనిట్ తప్పకుండా తమ అధికారిక పేజీలో షేర్ చేస్తుంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సినిమా విడుదలకు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, సినిమా ప్రచార మాత్రం పెద్దగా లేదని కొందరు చెబుతున్నారు. అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే, టాలీవుడ్లో సినిమా బజ్ బాగున్నప్పటికీ.. హిందీ, తమిళ్లో పెద్దగా బజ్ లేదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రమోషన్ కార్యక్రం కూడా చిత్ర యూనిట్ నిర్వహించలేదు. హిందీ హక్కులను ఎవరు కొనుగోలు చేశారన్న వివరాలు అధికారికంగా ఇప్పటికీ వెల్లడించలేదు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను మేకర్స్ ఫైనల్ చేశారు. జులై 24న పాన్ ఇండియా రేంజ్‌లొ విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 20న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్: 2:42 నిమిషాలు ఉన్నట్లు పేర్కొంది.
Trust the Process 🔥🦅#HariHaraVeeraMallu #BurjKhalifa pic.twitter.com/tvH2Y8FGo1
— HariHaraVeeraMallu (@HHVMTeam) July 16, 2025
Nice job @HHVMFilm, @AMRathnamOfl, @MegaSuryaProd HHVM hits Burj Khalifa,
excellent promotions👏🏻👏🏻#HariHaraVeeraMallu pic.twitter.com/siMGeNqnkl— Megha Shyam Reddy 🦅🚩 (@MSRv96) July 16, 2025