
నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద మూసీ ప్రాజెక్టు (Moosi Project)కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో శుక్రవారం (25-07-2025) అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. 3, 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తెలంగాణ అంతటా భారీ వర్షాలతో పలు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్న సంగతి తెలిసిందే.








