
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు దాదాపు ఐదేళ్ల తర్వాత రిలీజైంది. క్రిష్ డైరెక్షన్లో మొదలైన ఈ చిత్రం చివరికి జ్యోతికృష్ణ దర్శకత్వంలో ముగించారు. అభిమానుల భారీగా అంచనాల మధ్య ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే తొలి రోజు నుంచే ఈ సినిమాకు నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. పవన్ ఫ్యాన్స్ సైతం సినిమా చూసి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల అంచనాలను అందుకోవడంతో హరిహర వీరమల్లు విఫలమైనట్లు తెలుస్తోంది.
అయితే అభిమానుల సంగతి పక్కనపెడితే ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం చేసిన కామెంట్స్ మరింత హాట్టాపిక్గా మారాయి. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన షాకింగ్ సమాధానమిచ్చారు. హరిహర వీరమల్లు పార్ట్-2 గురించి ప్లాన్ చేస్తున్నారా? అని ఓ ఛానెల్ రిపోర్టర్ నిర్మాతను అడిగారు. దీనికి రత్నం మాట్లాడుతూ.. ఈ సినిమా హిట్ అయ్యాకే దాని గురించి అలోచిస్తాం అని అన్నారు. ఏఎం రత్నం సమాధానం చూస్తే ఆయనకే ఈ సినిమా హిట్ కావడంపై డౌట్ ఉన్నట్లు అర్థమవుతోంది. తమ చిత్రం సూపర్ హిట్ అవుతుందన్న ఆత్మవిశ్వాసం నిర్మాతకు లేదంటే హరిహర వీరమల్లుకు పెద్ద షాకే. ఇప్పటికే ఫ్యాన్స్ నిరాశలో ఉండడంతో నిర్మాత కామెంట్స్తో హరిహర వీరమల్లు హిట్ కావడంపై ఆశలు ఇక లేనట్లే.
కాగా.. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కీలక పాత్ర పోషించారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏంతమేరకు కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాల్సిందే.
Appude Guess Cheyalsindi, We did a Mistake pic.twitter.com/b7hGjkbqMi
— Shiva Akunuri (@AkunuriShivaa) July 23, 2025