'హరిహర వీరమల్లు' ఫ్యాన్స్‌ కోసం మరో సినిమా..? | Tholi Prema Movie Re Release Plan For Pawan Kalyan Fans | Sakshi
Sakshi News home page

'హరిహర వీరమల్లు' ఫ్యాన్స్‌ కోసం మరో సినిమా..?

Jun 7 2025 5:14 PM | Updated on Jun 7 2025 5:52 PM

Tholi Prema Movie Re Release Plan For Pawan Kalyan Fans

పవన్‌ కల్యాణ్‌ 'తొలిప్రేమ' రీరిలీజ్‌

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కెరీర్‌లోనే సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచిన 'తొలిప్రేమ' (Tholiprema) 1998 జూన్ 24న విడుదలైంది. ఇప్పుడు మరోసారి రిలీజ్‌ కానుంది. ఈమేరకు ఒక పోస్టర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో కీర్తిరెడ్డి హీరోయిన్‌గా నటించగా  ఎ.కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. జీవీజీ రాజు నిర్మాత. అయితే, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు డిస్ట్రిబ్యూషన్‌ చేశారు. ఇప్పటికే ఈ మూవీ పలుమార్లు రీరిలీజ్‌ అయింది. 'తొలిప్రేమ' విడుదలై 25 ఏళ్లు సందర్భంగా 2023లో చివరిసారిగా రీరిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

పవన్‌ కల్యాణ్‌ నటించిన కొత్త సినిమా హరిహర వీరమల్లు జూన్‌ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే, పలు కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్‌ నిరుత్సాహం చెందడంతో తెరపైకి తొలిప్రేమ సినిమాను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 14న తొలిప్రేమ రీరిలీజ్‌ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టర్‌ వైరల్‌ అవుతుంది. దానిని నిర్మాత ఎస్‌కేఎన్‌ కూడా షేర్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement