ఆ ఓటీటీలోకి హరి హర వీరమల్లు.. స్ట్రీమింగ్‌ అప్పుడేనా? | Hari Hara Veeramallu OTT Details | Sakshi
Sakshi News home page

ఆ ఓటీటీలోకి హరి హర వీరమల్లు.. స్ట్రీమింగ్‌ అప్పుడేనా?

Jul 24 2025 2:16 PM | Updated on Jul 24 2025 3:00 PM

Hari Hara Veeramallu OTT Details

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) నేడు(జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయితే ఈ చిత్రానికి తొలి రోజే నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని సీజీ వర్క్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలకు సైతం అద్భుతమైన వీఎఫెక్స్‌ వాడుతున్నారు. కానీ ఒక పెద్ద స్టార్‌ హీరో సినిమాకు ఇంత పేవలమైన సీజీ వర్క్‌ చేయడం ఏంటని నెటిజన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. 

(చదవండి: హరి హర వీరమల్లు రివ్యూ)

పవన్‌ ఫ్యాన్స్‌ సైతం ఆ సినిమా పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం ఈ సినిమా ఓటీటీ వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది అనేది గూగుల్‌లో సెర్చ్‌ చేసి మరీ వెతుకున్నారు.

విడుదలకు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ అమ్ముడు పోయాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ మంచి ధరకు డిజిటల్‌ రైట్స్‌ పొందింది. సినిమా రిలీజ్‌ అయినా 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని భావించారట. ఈ లెక్కన సెప్టెంబర్‌ రెండో వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. 

అయితే ఈ సినిమాకు అన్యూహ్యంగా నెగెటివ్‌ టాక్‌ రావడంతో ఓటీటీలో అనుకున్నదాని కంటే ముందే స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. సినిమా హిట్‌ అయితే ఎనిమిది వారాల వరకు ఆగేవారు కానీ.. ఇప్పుడున్న టాక్‌ని బట్టి చూస్తే నెలలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తుంది. ఈ లెక్కన ఆగస్ట్‌ ఎండింగ్‌లోపే ఈ సినిమా డిజిటల్‌ తెరపై వచ్చే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement