
హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’ (Mission Impossible) ఓటీటీలోకి రానుంది.. సుమారు రెండు నెలల తర్వాత అధికారికంగా ప్రకటన వచ్చేసింది. హాలీవుడ్ ఫ్రాంఛైజీల్లో మిషన్ ఇంపాసిబుల్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సిరీస్‌లో భాగంగా 8వ సినిమాగా వచ్చిన ‘మిషన్ ఇంపాసిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో టామ్ క్రూజ్ చేసిన సాహసాలు అత్యంత ప్రమాధకరంగా ఉన్నాయని హాలీవుడ్ మీడియా కూడా కథనాలు రాసింది.
ఆగష్టు 19న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్కు రానున్నట్లు ఒక పోస్టర్ను కూడా తాజాగా విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 6వేల కోట్ల వరకు ఈ చిత్రం కలెక్షన్స్ రాబట్టింది. సుమారు రూ. 3400 కోట్ల వరకు ఈ చిత్రం కోసం నిర్మాతలు ఖర్చు చేశారు. క్రిస్టోఫర్ మేక్‌క్వారీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
సిరీస్ మొత్తం ఒకే పరమైన కథాంశంతో ఉంటుంది. కథానాయకుడు తన టీమ్‌తో కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి విలువైన డాక్యుమెంట్లు, ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి వెళ్ళకుండా చూడడమే మిషన్ ఇంపాజిబుల్. సిరీస్ మొదటినుంచి ఒకే టీమ్‌ను మెయింటైన్ చేస్తూ ఈ సినిమాలో మాత్రం టీమ్‌లోని ఓ మెంబరైన లూథర్ పాత్రను చంపేశారు. అదే ఆడియన్స్‌ను కొంచెం ఆలోచనలో పడేస్తుంది. ఓవరాల్‌గా ‘మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌ను ఇష్టపడేవాళ్ళకి... అలాగే ఈ సిరీస్‌ను ఫాలో అయ్యేవాళ్ళకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.