
సాక్షి, అమరావతి: హరిహర వీరమల్లు సినిమా కోసం పెంచిన టికెట్ ధరలను తక్షణమే తగ్గించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర శాక అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, జి. రామన్నలు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిత్యావసరాలతో సహా అన్ని ధరలు చుక్కలంటుతున్నాయని, చివరికి వినోదం కోసం సినిమా వీక్షించే అవకాశం కూడా సామాన్యలకు లేకుండా ఇష్టమొచ్చినట్లుగా వసూలు చేసుకునే అవకాశం కల్పించడం దారుణమని పేర్కొన్నారు.
బెనిఫిట్ షోల పేర‍్ట ఒక్కో టికెట్‌కు రూ. 700 నుంచి రూ. 1000 వసూలు చేయడం దారుణమని, ఈ దోపిడీ విధానానికి స్వస్తి చెప్పాలన్నారు. మిగిలిన రోజుల్లో కూడా టికెట్ ధరలు రూ. 177 నుంచి రూ.377 వరకు పెంచి సామాన్యులకు సైతం సినిమా చూసే అవకాశం లేకుంటా చేస్తున్నారని మండిపడ్డారు.