
పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా జులై 24న థియేటర్స్లోకి వచ్చేసింది. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. అయితే, చాల పేలమైన కథ, మేకింగ్ విలువల వల్ల మొదటి ఆటతోనే డిజాస్టర్గా నిలిచిందని సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. సుమారు. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏంతమేరకు కలెక్షన్స్ రాబడుతుందో తెలియాల్సి ఉంది. అయితే, ఈ సినిమాకు పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ ఎంత అనేది ఆయన చెప్పారు.
పవన్ కల్యాణ్ తన మునుపటి చిత్రం 'బ్రో' కోసం తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 50 కోట్లు అంటూ ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే, హరి హర వీరమల్లు చిత్రం కోసం ఆయన రూ. 20 కోట్ల లోపే తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, ఆ సినిమా విడుదలైన తర్వాత వచ్చే ఆదాయాన్ని బట్టి తన పారితోషికాన్ని పరిగణనలోకి తీసుకుంటానని ఇంటర్వ్యూలో పవన్ అన్నారు.
కానీ, తాజాగా అందుతున్న మరో సమాచారం ప్రకారం.. రెమ్యునరేషన్తో పాటు సినిమా రన్ పూర్తి అయ్యాక నిర్మాతకు వచ్చే లాభాలను బట్టి మిగతా రెమ్యూనరేషన్ ఉంటుందని సమాచారం. అంటే సినిమాకు వచ్చే రెవెన్యూలో ఆయనకు షేర్ ఉంటుందని ముందే ఒక డీల్ ఉందట. అందుకే ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు వంటి అంశాలపై పవన్ ఎక్కువ శ్రద్ధ పెట్టారని అంటున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా ఆయన రెండు రోజుల పాటు హైదరాబాద్, విశాఖపట్నంలో మీడియా సమావేశాలు నిర్వహించారు. ఇదంతా సొమ్ము చేసుకునే పనిలో భాగమేనని నెట్టింట టాక్. ఇందులో హీరోయిన్గా నటించిన నిధి అగర్వాల్ మాత్రం ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 2.5 కోట్ల వరకు తీసుకున్నట్లు ఇండస్ట్రీలో చెబుతున్నమాట.