
తనపై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నవారిపై నటి, యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj ) తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని సోషల్ మీడియా చానల్స్ తనను లక్ష్యంగా చేసుకొని ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ సుధీర్గమైన పోస్ట్‌ని షేర్ చేశారు.
(చదవండి: హిట్ అండ్ రన్ కేసులో నటి అరెస్ట్)
‘నాపై ఎవరు కామెంట్ చేస్తున్నా..ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నాను. కానీ కొంతమంది నా జీవన విధానంపైనే విమర్శలు చేస్తుంటే స్పందించక తప్పడం లేదు. కొన్ని సోషల్ మీడియా చానల్స్ నన్నే లక్ష్యంగా చేసుకొని అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి. కొంతమంది మహిళలనే నన్ను విమర్శిస్తూ వీడియోలు చేస్తున్నారు. వారెవరో నాకు తెలియదు. వారికి నేను తెలియదు. అయినా కూడా నా వ్యక్తిత్వంపై మాట్లాడుతున్నారు. నేను ధరించే దుస్తులపై కామెంట్ చేస్తున్నారు.
(చదవండి: కింగ్‌డమ్‌లో ఎవరా స్టార్ హీరో?.. విజయ్ దేవరకొండ)
అవును.. నేను ఒక స్త్రీని, భార్యని, ఇద్దరు పిల్లల తల్లిని. నాకు సెట్ అయ్యే దుస్తులను ధరించడాన్ని నేను ఆస్వాదిస్తా. నేను ఒక తల్లిగా ప్రవర్తించడంలేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. తల్లికావడం అంటే మనల్ని మనం వదులుకోవడమా? నా భర్త, పిల్లలను నన్ను ప్రేమిస్తున్నారు. నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. వారెప్పుడు నన్ను జడ్జ్ చేయలేదు. బోల్డ్గా ఉండటమంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్టు కాదు. నేను ఇష్టపడే విధంగా దుస్తులు ధరిస్తున్నానంటే నేను నా విలువలను కోల్పోయానని కాదు. నన్ను ఆదర్శంగా తీసుకోమని ఎవరికి చెప్పడం లేదు. నాకు నచ్చినట్లుగా నేను బతుకున్నాను. మీకు నచ్చినట్లుగా మీరు బతకండి’ అని అనసూయ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది.