The India House: Ram Charan Announced V Mega Pictures First Film With Nikhil Siddhartha, Anupam Kher - Sakshi
Sakshi News home page

Ram Charan: చెర్రీ కొత్త బ్యానర్‌లో పాన్ ఇండియా మూవీ.. టైటిల్ అదిరిపోయిందిగా!

May 28 2023 4:27 PM | Updated on May 28 2023 4:39 PM

Ram Charan Announced V mega Pictures First Film with Nikhil - Sakshi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన స్నేహితుడు విక్రమ్ రెడ్డి ఇటీవలే వి మెగా పిక్చర్స్ పేరుతో కొత్త బ్యానర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొత్తవారికి ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్‌ ప్రారంభించినట్లు వెల్లడించారు.   తాజాగా ఈ బ్యానర్‌లో తొలి చిత్రాన్ని అనౌన్స్ చేశారు మేకర్స్. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. 

(ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్‌ అవార్డులు.. నెటిజన్స్‌ ట్రోలింగ్‌)

వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా  పాన్ ఇండియా మూవీని ప్రకటిస్తున్నందుకు గర్వంగా ఉందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. కార్తికేయ సిరీస్‌తో సూపర్ హట్స్ సొంతం చేసుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా.. 'ది ఇండియా హౌస్‌' అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు.  ఈ చిత్రంతో రామ్ వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.లండన్‌లో స్వాతంత్య్రం రాకముందు ఏం జరిగిందనే నేపథ్యంలో ది ఇండియా హౌస్‌ను తెరకెక్కిస్తున్నారు. 

(ఇది చదవండి: కేఎల్ రాహుల్‌పై దారుణ ట్రోల్స్.. గట్టిగానే కౌంటరిచ్చిన అతియా శెట్టి!)

Advertisement
 
Advertisement
Advertisement