'పెద్ది'లో చరణ్‌ కోచ్‌గా స్టార్‌ హీరో.. ఫస్ట్‌లుక్‌ విడుదల | Kannada Actor Shivarajkumar First Look Poster Revealed From Peddi Movie Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

'పెద్ది'లో చరణ్‌ కోచ్‌గా స్టార్‌ హీరో.. ఫస్ట్‌లుక్‌ విడుదల

Jul 12 2025 10:32 AM | Updated on Jul 12 2025 11:42 AM

Kannada Actor Shivarajkumar First Look From Peddi Movie

రామ్చరణ్‌- బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'.. ఇప్పటికే విడుదలైన టైటిల్గ్లింప్స్తో చరణ్మెప్పించాడు. తనదైన శైలిలో బ్యాట్‌ ఝుళిపించి పాన్ఇండియా బాక్సాఫీస్వద్ద ‘పెద్ది’ సంతకం ఎలా ఉండబోతుందో చూపించాడు. అయితే, తాజాగా మరో స్టార్హీరో ఫస్ట్లుక్విడుదల చేశారు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా 'పెద్ది' సినిమాలో ఆయన లుక్ఎలా ఉంటుందో మేకర్స్రివీల్చేశారు. ఇదే సమయంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తన పాత్ర పేరు 'గౌర్నాయుడు' అని రివీల్‌ చేశారు.

పెద్ది సినిమా షూటింగ్హైదరాబాద్లో వేగంగా జరుగుతుంది. ఇప్పటికే  2 రోజులు షూట్ కూడా పూర్తి చేసినట్లు శివరాజ్కుమార్గతంలో ఇలా చెప్పారు. 'ఆ రెండు రోజులు చాలా సరదాగా అనిపించింది. తొలిసారి తెలుగులో మాట్లాడా. డైరెక్టర్‌ చాలా గుడ్ పర్సన్. నా షాట్‌ను ఆయన అభినందించారు. రామ్ చరణ్ బిహేవియర్‌ వెరీ గుడ్. ఈ సినిమాలో తొలిసారిగా తెలుగులో డైలాగ్ చెప్పాను. పెద్దిలో నా రోల్ చాలా స్పెషల్. బుచ్చిబాబు స్క్రిప్ట్ చాలా నచ్చింది.' అని ఆయన అన్నారు. సినిమాలో రామ్చరణ్కు కోచ్గా శివరాజ్కుమార్నటిస్తున్నట్లు సమాచారం.

వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మాత. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుంది. శివరాజ్‌ కుమార్తో పాటు జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి స్టార్స్ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement