22 ఏళ్ల బంధానికి గుడ్‌ బై.. డైెరెక్టర్‌తో బుల్లితెర నటి విడాకులు! | Tv Actress Pallavi Rao Announces Divorce From Husband Suraj Rao | Sakshi
Sakshi News home page

Pallavi Rao: 22 ఏళ్ల తర్వాత విడిపోయిన బుల్లితెర నటి!

Jul 14 2025 6:12 PM | Updated on Jul 14 2025 6:37 PM

Tv Actress Pallavi Rao Announces Divorce From Husband Suraj Rao

ప్రముఖ బుల్లితెర నటి వివాహా బంధానికి గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో అనే సీరియల్స్లో నటించిన నటి పల్లవిరావు తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పెళ్లైన దాదాపు 22 ఏళ్ల తర్వాత తన భర్త, దర్శకుడు సూరజ్ రావుతో బంధానికి ముగింపు పలకనున్నట్లు వెల్లడించింది. ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించడానికే తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. విషయాన్ని రెండు వారాల క్రితమే పోస్ట్ చేసింది.

పాండ్యా స్టోర్‌తో అనే సీరియల్లో పల్లవిరావు బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. పల్లవి 2009లో హిందీ సీరియల్ యహాన్ మే ఘర్ ఘర్ ఖేలీతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పునర్ వివాహ ఏక్ నయీ ఉమీద్, మెయిన్ లక్ష్మీ తేరే అంగన్ కీ, బిట్టో, పాండ్యా స్టోర్, కహానీ హుమారే మహాభారత్ కీ వంటి సీరియల్స్‌లో మెప్పించింది. అంతేకాకుండా పల్లవి ఫియర్ ఫైల్స్, సావధాన్ లాంటి వాటిలో కొన్ని ఎపిసోడ్‌లలో కూడా కనిపించింది. పల్లవి బుల్లితెర నటిగానే కాకుండా యాడ్స్లోనూ నటించింది. అనేక టీవీ సీరియల్స్‌లో అతిథి పాత్రలో అలరించింది.

కాగా.. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు 21 ఏళ్ల కుమార్తె, 18 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఈ జంట 2003లో వివాహం చేసుకున్నారు. అయితే విడాకులపై నటి భర్త సూరజ్ రావు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement