Pallavi
-
పసిడి పతకం నెగ్గిన పల్లవి
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. శనివారం జరిగిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో సనాపతి పల్లవి పసిడి పతకం సొంతం చేసుకుంది. పల్లవి మొత్తం 212 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. పల్లవి స్నాచ్‌లో 94 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 118 కేజీలు బరువెత్తింది. శుక్రవారం పురుషుల 67 కేజీల విభాగంలో నీలంరాజు ఆంధ్రప్రదేశ్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. -
ఒకప్పడు తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేసిన ఈ బుల్లితెర నటి గురించి తెలుసా..? (ఫొటోలు)
-
ఎల్బీనగర్ లో పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబ్బందిపై దాడి
-
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం
విజయనగరం ఫోర్ట్: పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకు వెళ్లిపోతుందని తెలిసి అవయవదానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ ఈ నెల 20న భార్య దేవి, కుమార్తె పల్లవి (11)తో కలిసి ద్విచక్రవాహనంపై మండలంలోని ఎగువ కొండపర్తిలోని వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా అనంతగిరి మండలం ఎన్.ఆర్.పురం వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో పడిపోయారు. తుప్పల్లో ఉన్న రాళ్లపై పడడంతో పల్లవి తలకు తీవ్ర గాయమైంది. వెంకటరమణ కాలుకు, భార్య దేవి చేతికి గాయాలయ్యాయి. ప్రమాద బాధితులను వెంటనే గ్రామస్తులు ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పల్లవికి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. పాప అవయవాలు దానం చేస్తే మరికొందరికి పునర్జన్మనిచ్చినట్లు అవుతుందని మెడికవర్ వైద్యులు పల్లవి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. దీంతో వారు అవయవదానానికి అంగీకరించారు. తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో పల్లవి శరీరం నుంచి శుక్రవారం రెండు కిడ్నీలు, కళ్లలోని కార్నియాలను సేకరించారు. కిడ్నీలను గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్సులో విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రికి ఒకటి, కిమ్స్ ఐకాన్‌కు మరొకటి తరలించారు. నేత్రాలను విశాఖపట్నం ఎల్.వి.ప్రసాద్ ఐ ఆస్పత్రికి తరలించారు. అవయవదానానికి ముందుకొచి్చన పల్లవి తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్య సిబ్బంది, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
పల్లవి శ్రీనివాస్ డెంపో. దక్షిణ గోవా నుంచి బీజేపీ టికెట్‌పై లోక్‌సభ బరిలో ఉన్నారు. గోవాలో బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన తొలి మహిళగా నిలిచారు. అఫిడవిట్లో పల్లవి ప్రకటించిన ఆస్తులు చూసి అంతా నోరెళ్లబెట్టారు. భర్తతో కలిపి ఏకంగా రూ.1,361 కోట్ల ఆస్తులు వెల్లడించారు. మూడో దశలో రేసులో మొత్తం 1352 మంది అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. గోవా ఎన్నికల చరిత్రలో అత్యంత సంపన్న వ్యక్తి పల్లవే. ఏ రాజకీయానుభవం లేని కుటుంబానికి చెందిన ఆమెను ఎంపిక చేసుకోవడానికి ఆమె దాతృత్వ నేపథ్యమే కారణం కావచ్చంటున్నారు...దాతృత్వం నుంచి రాజకీయాలకు 49 ఏళ్ల పల్లవి స్వస్థలం గోవాలోని మార్గావ్. టింబ్లో కుటుంబంలో జని్మంచారు. రసాయన శాస్త్రంలో డిగ్రీ, పుణెలోని ఎంఐటీ నుంచి ఎంబీఏలో పీజీ చేశారు. 1997లో డెంపో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీనివాస్ డెంపోను పెళ్లాడారు. వారి కుటుంబం ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. డెంపో గ్రూప్ మైనింగ్ వ్యాపారంతో మొదలుపెట్టి ఫుడ్ ప్రాసెసింగ్, షిప్ బిల్డింగ్, న్యూస్ పేపర్ పబ్లిíÙంగ్, పెట్రోలియం, కోక్, రియల్ ఎస్టేట్ తదితరాలకు విస్తరించింది. పల్లవి ప్రస్తుతం డెంపో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మీడియా, రియల్ ఎస్టేట్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. డెంపో చారిటీస్ ట్రస్టీగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ప్రత్యేకించి గోవాలో బాలికల విద్యను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త వంటకాలను ప్రయతి్నంచడం తన అభిరుచి అంటారామె. ఇప్పుడు రాజకీయాల్లోకి దిగి మరో ప్రయోగం చేయబోతున్నారు. ఎన్నికల బాండ్ల రగడ... 2022 జనవరిలో గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెల ముందు పల్లవి భర్త శ్రీనివాస్ వ్యక్తిగతంగా రూ.1.25 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడవడం కలకలం రేపింది. ఇక గోవా కార్బన్ లిమిటెడ్, దేవశ్రీ నిర్మాణ్ ఎల్ఎల్పి, నవ్‌హింద్ పేపర్స్ అండ్ పబ్లికేషన్స్‌తో సహా డెంపో, గ్రూప్ అనుబంధ సంస్థలు 2019 నుంచి 2024 మధ్య రూ.1.1 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశాయి. ఇవన్నీ బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి.బీజేపీ సిద్ధాంతాలు నమ్మి... దక్షిణ గోవా కాంగ్రెస్ కంచుకోట. 2019లో ఈ స్థానాన్ని బీజేపీ కేవలం 9 వేల పై చిలుకు ఓట్ల తేడాతో చేజార్చుకుంది. ఈ సారి ఎలాగైనా ఇక్కడ నెగ్గి తీరాలని పట్టుదలగా ఉంది. క్యాథలిక్ క్రిస్టియన్ల ఓట్లపై పల్లవి ప్రధానంగా దృష్టి పెట్టారు. కాంగ్రెస్ కూడా నాలుగు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ ఫ్రాన్సిస్కో సార్డినాను అనూహ్యంగా పక్కనబెట్టి మాజీ నేవీ అధికారి కెపె్టన్ విరియాటో ఫెర్నాండెజ్‌ను బరిలోకి దించింది. అయితే ఏకంగా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ చేయడం వంటివన్నీ ఆ పారీ్టకి కలిసొచ్చేలా ఉన్నాయి. ఆప్, గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) వంటి ఇండియా కూటమి భాగస్వాముల దన్నుతో బీజేపీని కాంగ్రెస్ ఢీకొంటోంది. స్థానిక రివల్యూషనరీ గోవన్స్ (ఆర్జీ) పార్టీ అభ్యర్థి రూబర్ట్ పెరీరియా ఆ రెండింటికీ సవాలు విసురుతున్నారు. అయినా పల్లవి మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు. ‘‘రాజకీయాలు నా మనసులో ఎప్పుడూ లేవు. మూడు దశాబ్దాలుగా కుటుంబ వ్యాపారాలు, సేవా కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాను. అయితే దేనికైనా ఒక ఆరంభమంటూ ఉంటుంది. రాజకీయాల్లో ఇది నా తొలి అడుగు. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి ముందడుగు వేస్తున్నాను’’ అంటున్న ఆమె కాంగ్రెస్‌కు కంచుకోటలో చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పల్లవి పటేల్‌తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మూడు ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల ఇండియా కూటమితోపాటు ఇప్పుడు పీడీఎం (పిచ్చా, దళిత, ముసల్మాన్) కూటమి కూడా బరిలో నిలిచింది. అప్నా దళ్ కమరావాడి (ADK) నాయకురాలు పల్లవి పటేల్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసి పీడీఎం (PDM) కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి ఉత్తరప్రదేశ్‌లో తొలి జాబితా విడుదల చేసింది. ఈ రెండు పార్టీలు కలిసి ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. పీడీఎం తొలి జాబితాలో బరేలీ నుంచి సుభాష్ పటేల్, హత్రాస్ నుంచి జైవీర్ సింగ్ ధంగర్, ఫిరోజాబాద్ నుంచి న్యాయవాది ప్రేమ్ దత్ బఘేల్, రాయ్ బరేలీ నుంచి హఫీజ్ మహ్మద్ మొబీన్, ఫతేపూర్ నుంచి రామకృష్ణ పాల్, భదోహి నుంచి ప్రేమ్ చంద్ బింద్, చందౌలీ నుంచి జవహర్ బింద్ ప్రకటించారు. ఈ సమాచారాన్ని పీడీఎం కార్యాలయ కార్యదర్శి మహ్మద్ ఆషిక్ తెలిపారు. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఇండియా కూటమి తరపున పోటీ చేస్తారనే ఊహాగానాల మధ్య పీడీఎం ఇక్కడ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఇది కాంగ్రెస్ అభ్యర్థికి సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనకు ఒక రోజు ముందుగా శుక్రవారం నాడు లక్నోలో పీడీఎం మొదటి సమావేశం జరిగింది. ఇందులో పీడీఎంకు నేతృత్వం వహిస్తున్న పల్లవి పటేల్‌తో పాటు ఏఐఎంఐఎం నేతలు కూడా పాల్గొన్నారు. నాలుగైదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను చర్చించారు. ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేస్తామని, మిగతా స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని పీడీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు అజయ్ పటేల్ తెలిపారు. -
ఆ అడుగుల్లో భాగమేనా? వెనక్కి తగ్గిన పల్లవి పటేల్ పార్టీ
వచ్చే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన అప్నా దళ్ (కెమెరవాడి) తన నిర్ణయాన్ని మార్చుకుంది. పార్టీ అభ్యర్థుల సవరించిన జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి రామ్ సనేహి పటేల్ ఒక ప్రకటనలో ప్రకటించారు. ‘ఇండియా’ కూటమికి చెందిన అప్నా దళ్ (కామెరవాడి) కౌశంబి, ఫుల్పూర్, మీర్జాపూర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే తరువాత పార్టీ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ స్థానాల నుండి తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఆ పార్టీ గతంలో 2022 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఇంతకుముందు వారి సహకారం ఉన్నప్పటికీ, 2024 ఎన్నికలకు అప్నా దళ్ (కెమెరవాడి)తో పొత్తు ఉండదని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. దీంతో అప్నా దళ్ (కెమెరవాడి) త్వరలో అభ్యర్థుల కొత్త జాబితాను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం ఆ పార్టీ ముఖ్య నాయకురాలు పల్లవి పటేల్.. తమ పార్టీ ‘ఇండియా’ కూటమిలో ఉండాలా వద్దా అనేది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో చేరే అవకాశంపై సంకేతాలు ఇచ్చారు. బీజేపీ నుంచి ఏదైనా ఆఫర్ వస్తే తమ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని పల్లవి పటేల్ చెప్పారు. పార్టీ ప్రకటించిన స్థానాల విషయంలో నిర్ణయాన్ని మార్చుకోవడం ఇందులో భాగమేనా అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
అక్కా.. వచ్చేస్తున్నా! ఎన్డీఏ వైపు పల్లవి పటేల్
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ‘ఇండియా’ కూటమికి షాకిస్తూ అప్నా దళ్ (కామెరవాడి) నాయకురాలు, సిరతు ఎమ్మెల్యే పల్లవి పటేల్ ( Pallavi Patel ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక పొత్తుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బిహార్‌లో ‘ఇండియా’ కూటమికి నితీష్ కుమార్ ఇచ్చిన షాకే ఉత్తరప్రదేశ్‌లోని అప్నా దళ్-కామెరవాడి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. "ప్రస్తుతం ఎన్డీఏతో చర్చలు లేవు. ఒకవేళ ఆఫర్ వస్తే తమ పార్టీ పరిశీలిస్తుంది" అని డాక్టర్ పల్లవి పటేల్ చెప్పారు. మరోవైపు అప్నా దళ్ (కామెరవాడి) ఉత్తరప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఒక రోజు తర్వాత సమాజ్‌వాదీ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కృష్ణ పటేల్ నేతృత్వంలోని పార్టీతో పొత్తు లేదని తెలిపింది. “అప్నాదళ్ (కె), సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు 2022 అసెంబ్లీ ఎన్నికల కోసమే కానీ, 2024 ఎన్నికల కోసం కాదు” అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. పల్లవి పటేల్ సోదరి, అప్నా దళ్ (సోనేలాల్) అధినేత్రి అనుప్రియా పటేల్ ( Anupriya Patel ) ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అప్నా దళ్ (కే) ప్రకటించిన మూడు స్థానాల్లో మీర్జాపూర్ స్థానం నుండి అనుప్రియా పటేల్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఫుల్పూర్, కౌశంబి లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. -
తండ్రైన యంగ్ హీరో నిఖిల్.. ఫోటో వైరల్
యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. నిఖిల్ భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్, డాక్టర్ పల్లవి 2020లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. (చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?) నిఖిల్ సినీ కెరీర్ విషయాకొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కార్తికేయ, స్వామిరారా సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. . చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. Our Unique Star ⭐️@actor_Nikhil and his wife #Pallavi are now blessed with a BABY BOY❤️ Warmest congratulations to the glowing couple on this delightful addition to their family 🤗✨#NikPal pic.twitter.com/ihRleHFUY8 — Team Nikhil Siddhartha Telangana ✊ (@TS_Team_Nikhil) February 21, 2024 -
తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. సీమంతం ఫోటో వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ త్వరలోనే తండ్రి కాబోతున్నారు. తాజాగా ఆయన భార్యకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సీమంతం వేడుకలో తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. కాగా.. 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. నిఖిల్ తన ట్విటర్లో రాస్తూ.. 'నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డ స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నిఖిల్ అభిమానులు తమ హీరోకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. 'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో నిఖిల్. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన 'స్వయంభూ' సినిమాలో నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్‌కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon 👶🏼👼🏽 Please send in your blessings 🙏🏽😇 pic.twitter.com/3Nn4S3wFHv — Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2024 -
చిన్న సినిమాలు సక్సెస్ కావాలి
‘‘చిన్న సినిమాలు సక్సెస్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. లక్ష్మీపతిలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు. ‘ఐక్యూ’ సినిమా సక్సెస్‌తో ఆయన మరిన్ని సినిమాలు ప్లా¯Œ చేస్తున్నారు’’ అని నిర్మాత ప్రసన్న కుమార్ అన్నారు. సాయి చరణ్, పల్లవి జంటగా జీఎల్బీ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఐక్యూ’. కేఎల్పీ మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ–‘‘ఐక్యూ’ సినిమా కథ జనాలకు బాగా కనెక్ట్ అయింది.. అందుకే రెండో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది’’ అన్నారు. రచయిత ఘటికాచలం పాల్గొన్నారు. -
‘ఐక్యూ’ జనాలకు బాగా కనెక్ట్ అయింది: నిర్మాత లక్ష్మీపతి
సాయి చరణ్, పల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్ ఆఫ్ ద స్టూడెంట్’ అన్నది ఉపశీర్షిక. జిఎల్బి శ్రీనివాస్ దర్శకత్వం కె.ఎల్.పి మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా రెండోవారం నడుస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో నిర్మాత మాట్లాడుతూ ‘సరైన థియేటర్లు దొరుకుతాయా లేదా అన్న డైలామాలో ఉన్నాం. కానీ మా సినిమాకు 99 థియేటర్లు దొరికాయి. సినిమా కథ జనాలకు బాగా కనెక్ట్ అయింది. రెండో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇదంతా బాలకృష్ణగారి వల్లే సాధ్యమైంది. నందమూరి కుటుంబంతో సినిమా చేయాలనుకున్నా. తారకరత్నగారితో సినిమా అనుకున్నా. ఆయన మరణించడంతో కుదరలేదు. త్వరలో నందమూరి ఫ్యామిలీ హీరోలతో ఓ సినిమా చేస్తా’అని అన్నారు. ‘చిన్న సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. లక్ష్మీపతిలాంటి నిర్మాతలు వస్తారు. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమా సక్సెస్‌తో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు’ అని ప్రసన్నకుమార్ అన్నారు. డిఓపి సురేందర్‌రెడ్డి, అనంతపురం జగన్, చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
యూత్‌ఫుల్ ఐక్యూ
సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ముఖ్య తారలుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్ ఆఫ్ స్టూడెంట్’ అనేది ఉపశీర్షిక. కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ‘‘మేధావి అయిన ఓ విద్యార్థిని మెదడును అమ్మడానికి వాళ్ల ప్రొఫెసర్ ఏ విధంగా ప్లాన్ చేశాడు? ఆ అమ్మాయిని హీరో ఎలా కాపాడాడు? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
భార్య తో కలిసి శ్రీ వారిని దర్శించుకున్న నిఖిల్...
-
నీ బాగోతం తెలుసు.. పరువు తీస్తా!
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొంగరకలాన్ తండాకు చెందిన అంగోతు సరిత, అంతిరాం దంపతుల రెండో కుమార్తె పల్లవి (21). ఈమె వండర్లాలో ఉద్యోగం చేస్తోంది. హైదరాబాద్ మూసాపేటకు చెందిన ఎలుక క్రాంతి, కొంగరకలాన్‌లో ఉంటున్న తన అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం పల్లవి, క్రాంతి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా.. వండర్లాలో పనిచేస్తున్న ప్రణయ్‌తో పల్లవి చనువుగా ఉంటోందని, ఫోన్లు, చాటింగ్ చేస్తోందని క్రాంతికి అనుమానం వచ్చింది. దీంతో రెండు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో క్రాంతి గురువారం పల్లవిని కలిసి బైక్‌పై సాయిబాబా గుడి వద్దకు తీసుకెళ్లాడు. ‘నీ బాగోతం అంతా నాకు తెలుసు.. అందరికీ చెప్పి పరువు తీస్తా’అని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన పల్లవి.. ‘ఐ లవ్యూ.. లాస్ట్ మెసేజ్’ అని క్రాంతికి వాట్సాప్ చేసింది. అనంతరం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలాన్ని డీసీపీ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్రావు పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం బందోబస్తు మధ్య పల్లవి అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసుల అదుపులో ఇద్దరు ఇంటికి వెళ్లకుండా పల్లవి ఫోన్ స్విచ్చాఫ్ చేయడం, ఇదే చివరి మెసేజ్ అని పెట్టడంతో క్రాంతికి అనుమానం వచ్చింది. దీంతో అతను ఆదిబట్ల పోలీసులకు తెలిపాడు. పల్లవి అత్మహత్య చేసుకునే అవకాశం ఉందని తల్లిదండ్రులకు తెలియడంతో వారు కూడా పోలీసులను ఆశ్రయించారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. శుక్రవారం పల్లవి చెట్టుకు ఉరేసుకొని కని పించింది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా, క్రాంతి, ప్రణయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
యంగ్ హీరో నిఖిల్‌పై రూమర్స్.. అవన్నీ ఫేక్..!
యంగ్ హీరో నిఖిల్‌పై ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. టాలీవుడ్ హీరో తన భార్య పల్లవితో విడిపోతున్నట్లు కొద్దికాలంగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విడిపోయేందుకు నిఖిల్ సిద్ధమయ్యాడని అసత్య ప్రచారం నడుస్తోంది. ఇటీవలే కార్తికేయ-2తో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు నిఖిల్. ప్రస్తుతం తన భార్య పల్లవితో గోవాలో వెకేషన్లో ఉన్నారు యంగ్ హీరో. గోవాలో ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 'మనిద్దరం కలిసున్న ప్రతిక్షణం అద్భుతమే' అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. కాగా 2020లో భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి పల్లవి
బుల్లితెరపై సక్సెస్ఫుల్ నటిగా రాణిస్తోంది పల్లవి రామిశెట్టి. పలు సీరియల్స్‌లో లీడ్ రోల్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని నెలల క్రితం తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన పల్లవి ఆగస్టులో సీమంతం జరుపుకోగా అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయ్యాయి. తాజాగా పల్లవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. తాను పండంటి బాబుకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. మా కుటుంబంలోకి కొత్త అతిథి వచ్చేశాడోచ్ అంటూ పసివాడి పాదాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో తల్లిదండ్రులుగా మారిన పల్లవి-దిలీప్ దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by pallavi Ramisetty official (@pallaviramisettyofficial) చదవండి: బాలాదిత్య, వాసంతి పారితోషికం ఎంతో తెలుసా? టాలీవుడ్లో విషాదం, నటుడు కన్నుమూత -
ప్రముఖ బుల్లితెర నటి సీమంతం ఫొటోలు వైరల్
పల్లవి రామిశెట్టి.. కొన్నేళ్లుగా బుల్లితెర ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ నటిగా కొనసాగుతోంది. పలు ఛానళ్లలోని సీరియల్స్‌లో తళుక్కుమని మెరిసిందీ అచ్చ తెలుగు అమ్మాయి. సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తూ అభిమానుల మనసులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుందీ నటి. 2009లో కెరియర్ ప్రారంభించిన ఆమె త్వరలో తల్లి కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె సీమంతం జరుపుకుంది. ఈ వేడుకకు ఇతర బుల్లితెర నటులు హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు త్వరలో తల్లి కాబోతున్న పల్లవి-దిలీప్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: లలిత్ మోదీతో డేటింగ్.. మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కిన సుష్మితా, వీడియో వైరల్ షూటింగ్లో ప్రమాదం.. మరోసారి హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు -
దారుణం: ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని..
గద్వాల క్రైం: వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడమే ఆమెకు శాపంగా మారింది. కోపం పెంచుకున్న భర్త ఆమె ఉసురుతీశాడు. చిన్నారులకు తల్లి ప్రేమానురాగాలను దూరం చేశా డు. ఈ ఘటన గద్వాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన అన్నపూర్ణ అలియాస్ పల్లవి(26)కి గద్వాలకు చెందిన వెంకటేశ్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది క్రితం మొదటి సంతానం పాప జన్మించింది. ఈ నెల 24న ఇద్దరు ఆడపిల్లలు(కవలలు) పుట్టారు. దీంతో భార్యపై వెంకటేశ్ ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆదివారం ఇంట్లో నిద్రిస్తున్న భార్య గొంతు నులిపేస్తుండగా కేకలు వేసింది. ఇరుగుపొరుగువారు వచ్చి నిలదీయగా ఫిట్స్ వచ్చాయని నమ్మించేందుకు ప్రయత్నించాడు. స్థానికులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. అతని మాటల్లో పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు సోమవారం పోలీసులకు సమాచారమిచ్చారు. గద్వాల సీఐ షేక్ సయ్యద్‌బాషా, తహసీల్దార్ లక్ష్మి, వైద్యుల సమక్షంలో పల్లవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమెను పథకం ప్రకారమే హత్య చేసినట్టు తేలింది. మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు అల్లుడు వెంకటేశ్, అతని తల్లి జయమ్మ, బావ జనార్దన్, చెల్లెలు లీలావతిలపై కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. నిందితుడు మల్దకల్ ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. (చదవండి: AP: ఇద్దరు యువతులను కాపాడిన ‘దిశ’) -
వారికి కూడా నా ధన్యవాదాలు : నిఖిల్
హైదరాబాద్ : హీరో నిఖిల్ తన ప్రేయసి డాక్టర్ పల్లవి వర్మను గురువారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉండటంతో హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. వివాహ వేడుకకు హాజరైన కొద్ది మంది అతిథులకు కూడా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు.. మాస్క్‌లు, శానిటైజర్ అందుబాటులో ఉంచారు. అయితే లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమలోని నిఖిల్ స్నేహితులు చాలా మంది ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. (చదవండి : ప్రేయసిని పెళ్లాడిన హీరో నిఖిల్) ఈ క్రమంలో నిఖిల్ స్నేహితులతోపాటుగా, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిఖిల్, పల్లవి జంటకు బెస్ట్ విషెస్ తెలిపారు. దీంతో నిఖిల్ వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నా ఫోన్, సోషల్ మీడియా మీ ఆశీస్సులు, ప్రేమతో నిండిపోయింది. ఈ పెళ్లి కోసం పనిచేసిన టీమ్‌కు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను. అద్భుతమైన డెకరెషన్, ఫొటోగ్రఫీ, ఔట్ఫిట్ అందించిన మీరు పెళ్లిని గుర్తుండిపోయేలా చేశారు ’ అని నిఖిల్ పేర్కొన్నారు. కాగా, అంతకుముందు ఏప్రిల్ 16న వివాహం చేసుకోవాలని భావించిన కరోనా ఎఫెక్ట్‌తో అదికాస్త మే 14కు వాయిదా వేశారు. అయితే రెండోసారి కూడా పెళ్లి వాయిదా పడినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అనుకున్న ముహుర్తానికే నిఖిల్, పల్లవిలు వివాహ బంధంతో ఒకటయ్యారు.(చదవండి : క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టిన సాయేషా) Thanks for all the wishes pouring in.. my phn nd social media has been flooded with Blessings and Love. I also wanna thank the team behind the Wedding👉🏼Decor by @ekaa_customdecor Photography by @aswin_suresh_photography nd Outfit frm @jahanpanahhyd made the Wedding Memorable 4 me pic.twitter.com/la4EhFfu7h — Nikhil Siddhartha (@actor_Nikhil) May 15, 2020 -
ఒక ఇంటివారయ్యారు
గురువారం రెండు వివాహ వేడుకలు జరిగాయి. హీరో నిఖిల్ డాక్టర్ పల్లవిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయితే, సహాయ నటుడు మహేష్ పావనిని పెళ్లాడి ఇంటివాడు అయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఒక ఫార్మ్ హౌస్ లో నిఖిల్ వివాహం జరిగింది. అతి కొద్ది మంది బంధువుల మధ్య ఈ వేడుక నిర్వహించారు. మహేష్ వివాహం తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జరిగింది. ఈ రెండు వేడుకలను లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే నిర్వహించారని తెలిసింది. -
నేడు నిఖిల్ వివాహం
‘స్వామిరారా, సూర్య వర్సెస్ సూర్య, కార్తికేయ, ఎక్కడకి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం’ వంటి విజయాలు సొంతం చేసుకున్న కథానాయకుడు నిఖిల్ నేడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డాక్టర్ పల్లవి వర్మతో ఏడడుగులు వేయనున్నాడు. ఏప్రిల్ 16న వీరి పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. నేడు షామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో నిఖిల్–పల్లవిల వివాహం ఉదయం 6:31 గంటలకు జరగనుంది. కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథులతో నిరాడంబరంగా ఈ పెళ్లి జరగనుంది. కాగా బుధవారం సాయంత్రం నిఖిల్‌ని పెళ్లి కొడుకుని, పల్లవిని పెళ్లి కూతురిని చేశారు. -
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్..
కరోనా కారణంగా మరో టాలీవుడ్ హీరో పెళ్లి వాయిదా పడింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్టు హీరో నితిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో నిఖిల్ కూడా తన పెళ్లిని వాయిదా వేసకుంటున్నట్టు వెల్లడించారు. అయితే కొద్ది రోజుల క్రితం తన పెళ్లిని ఎవరూ ఆపలేరని నిఖిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసుకోవడమే మంచిదని నిఖిల్ భావించినట్టుగా తెలుస్తోంది. ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేము పెళ్లి చేసుకోవడం సాధ్యపడేలా కనిపించడం లేదు. వేరే మార్గం లేక మేము మా పెళ్లిని వాయిదా వేసకుంటున్నాం. అయితే ఈ పరిస్థితులు ఇంకా ఎంత కాలం కొనసాగుతాయో తెలియడం లేదు. పెళ్లి వాయిదా పడినందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొద్దిగా నిరాశ చెందారు. కానీ భద్రత అనేది అనింటి కంటే ముఖ్యమైనది. మనం కష్టాల్లో ఉన్న సమయంలో వేడుకలు జరుపుకోవడం సరైనది కాదు’ అని నిఖిల్ తెలిపారు. కాగా, ఫిబ్రవరి 1 వ తేదీన డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్, పల్లవిలు పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్దమయ్యారు. ఏప్రిల్ 16న వీరి వివాహం జరగాల్సి ఉంది. చదవండి : కరోనా ఎఫెక్ట్: అభిమానులకు నితిన్ విజ్ఞప్తి డాక్టర్‌తో హీరో నిఖిల్ నిశ్చితార్థం -
కసాయి తండ్రి ఘాతుకం..
సాక్షి,కర్ణాటక, బళ్లారి: మద్యం తాగుడుకు బానిసైన కసాయి తండ్రి నిత్యం కూతురిని తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వేధించడంతో పాటు గొడవ పడుతూ కూతురినే హెచ్ఎల్సీలోకి తోసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోమవారం నగరంలోని బండిహట్టి ప్రాంతానికి చెందిన సూరి అలియాస్ ఆటో సూరి తన కూతురు పల్లవిని హెచ్ఎల్సీ కాలువలోకి తోసి పోలీసు స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాడు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కార్యాలయంలో పని చేస్తున్న పల్లవి(22)ని ఆదివారం రాత్రి తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. దీంతో ఆమె విసిగిపోయి ప్రతి రోజు తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గొడవ చేస్తే ఎలా అని, నీతో కలిసి ఇంటిలో ఉండటం కంటే చావడం నయమని బెదిరించింది. రాత్రి కూడా గొడవ కొనసాగింది. సోమవారం ఉదయం కూడా అదే మాదిరిగా తాగేందుకు డబ్బులు ఇవ్వాలని మళ్లీ అడగటంతో ఆమె బెదిరించేందుకు పక్కనే ఉన్న హెచ్ఎల్సీ కాలువలోకి దూకుతానని బెదిరిస్తూ అక్కడికి వెళ్లింది. వెంబడించిన తండ్రి కూడా కాలువ వద్దకు చేరుకున్నాడు. ఆమె బెదిరిస్తూ అలాగే నిలబడటంతో ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దు అని చెప్పాల్సిన తండ్రి తానే కూతురిని కాలువలోకి తోసివేయడంతో పక్కనే ఉన్న ఓ యువకుడు చూసి తక్షణం రక్షించేందుకు ప్రయత్నించగా, కసాయి తండ్రి ఆ యువకుడితో కూడా గొడ వకు దిగాడు. అంతలోనే ఆమె నీటిలో కొట్టుకు పోయింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది. ఈతలో నైపుణ్యం ఉన్న యువకులను రప్పించి కాలువలో పల్లవి జాడ కోసం గాలింపు ప్రారంభించారు. మూడేళ్ల క్రితం సూరి వేధింపులకు అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఇతనికి రెండో కూతురు ఉంది. కాగా ఇదే వారంలో బళ్లారి తాలూకా గోడేహాల్లో పరువు హత్య జరిగింది. ఇందులో కూతురినే తండ్రి చంపేశాడు. ప్రస్తుతం తాగుడుకు బానిసైన తండ్రి ఏకంగా తన కూతురినే హెచ్ఎల్సీలోకి తోసేయడం ఈ ప్రాంత వాసులను కలిచివేసింది. ఈ ఘటనతో బండిహట్టిలో పల్లవి ఇంటి వద్ద బంధువులు, స్నేహితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానిక బ్రూస్‌పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హీరో నిఖిల్ నిశ్చితార్థం
-
డాక్టర్‌తో హీరో నిఖిల్ నిశ్చితార్థం
ప్రముఖ హీరో నిఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ వివాహం చేసుకోనున్నారు. కొద్దికాలంగా పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో శనివారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య నిఖిల్, పల్లవిల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఏప్రిల్ 16న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కానున్నట్టుగా సమాచారం. దీంతో పలువురు సినీ ప్రముఖులు నిఖిల్‌కు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అలాగే పల్లవి వర్మకు నిఖిల్ ప్రపోజ్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతోంది. నిఖిల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను ఓ డాక్టర్‌ను ప్రేమిస్తున్నానని చెప్పిన సంగతి తెలిసందే. కాగా, టాలీవుడ్లో డిఫరెంట్ మూవీస్‌తో నిఖిల్ తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆయన నటించిన అర్జున్ సురవరం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. -
నవ వధువు బలవన్మరణం
హస్తినాపురం: ఓ నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మలక్‌పేటకు చెందిన కొటిక లక్ష్మి, చంద్రశేఖర్ దంపతుల కుమార్తె పల్లవి(28)కి గత డిసెంబర్ 8న నల్గొండ జిల్లా, మునుగోడు పట్టణానికి చెందిన సామవరపు సంతోష్‌తో వివాహం జరిగింది. నూతన దంపతులు శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లవి తన బెడ్ రూంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి వెళ్లిన ఆమె అత్తమామలు పల్లవికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పక్కింటి వారికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వారు కిటికీలోంచి చూడగా పల్లవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో వారు ఈ విషయాన్ని మృతురాలి అత్తమాలకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శభాష్.. పల్లవి
సాక్షి, దుగ్గొండి: వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి ఎంపీడీఓ గుంటి పల్లవికి సీఎంఓ నుంచి గురువారం ఫోన్ వచ్చింది. ఎంపీడీఓగా వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్న విధానాన్ని సీఎం కేసీఆర్ అభినందించినట్లు సీఎంఓ అధికారులు తెలిపారు. పర్యావరణ హితం కోసం వాడిపడేసిన కొబ్బరిబొండాల్లో మొక్కలు నాటిన విధానాన్ని సీఎం ప్రశంసించారు. ‘బొండాం భలే ఐడియా’శీర్షికన ఈనెల 4న సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ మేరకు సీఎంఓ నుంచి అభినందనలురావడం సంతోషంగా ఉందని పల్లవి చెప్పారు. చదవండి: బొండాంతో భలే ఐడియా! -
'పల్లవిం'చిన సేవా స్ఫూర్తి
చక్కని ఉద్యోగం.. ఐదంకెల జీతం.. చేతి నిండా డబ్బు.. ఎంజాయ్ చేసే వయసు.. మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ ఇవన్నీ ఉన్నా ఆ యువతి మాత్రం నలుగురికి సాయం చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంది. అదే మానవ జన్మకు సార్థకమంటోంది. తండ్రి నుంచి సేవచేయడాన్ని వారసత్వంగా తీసుకున్న ఆమె పేరు ‘పల్లవి ప్రియ’. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఈమె సిటీలో ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అంతేకాదు.. ‘కాజ్ ఫర్ సెలబ్రేషన్’ పేరుతో ఓ ఎన్జీఓను నెలకొల్పి దాని ద్వారా వందలాది మందికి అండగా నిలుస్తోంది. సాక్షి,సిటీబ్యూరో: పల్లవి ప్రియ సిటీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తునే అదే కంపెనీలోని సీఎస్ఆర్లో కోర్ మెంబర్గాను ఉంది. ఉత్తరప్రదేశ్‌లో చదువుకునే రోజుల్లో ఎన్ఎస్ఎస్ మెంబర్‌గా కాలేజీ అయ్యాక తన స్నేహితులతో కలసి సమీపంలోని బస్తీల్లో పర్యటించి అక్కడి వారి అవసరాలను గుర్తించేంది. అలా తన వద్దనున్న డబ్బులతో చేతనైన సాయం అందించేది. ఉద్యోగం వచ్చాక ఈసేవను మరింత విస్తృతం చేసింది. పల్లవిప్రియ చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలంలో రోడ్డుపై ఉండే చిరు వ్యాపారులు వర్షంలో తడుస్తునే తమ పనులు చక్కబెట్టుకోవడం చూసిన ఆమె ‘ఫుట్‌పాత్ వ్యాపారులకు పెద్ద పెద్ద గొడుగులను ఇవ్వాలనే లక్ష్యంతో నేను ఓ అడుగు వేస్తున్నా.. ఆసక్తి ఉన్నవారు నాతో చేయి కలపండి’ అంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. అది జరిగి ఆరు గంటల్లో పదుల సంఖ్యలో ఆమెను సంప్రదించి నగర వ్యాప్తంగా ఫుట్‌పాత్‌పై ఉండే చిరు వ్యాపారులకు గొడుగులు పింపిణీ చేసే నగదు సమకూర్చుకుని వారిసి సాయం అందించింది. చిన్నారులకు బహుమతులు ఇస్తున్న పల్లవి ప్రియ ఒక్క రోజులో ఏడాదికి సరిపోయే బుక్స్ గత ఏడాది సెప్టెంబర్‌లో తన పుట్టిన రోజున నగరంలోని ఓ అనాథ ఆశ్రమానికి వెళ్లిన పల్లవి ప్రియ అక్కడి పిల్లలతో సరదాగా గడిపి, వారికి కడుపునిండా భోజనం పెట్టింది. తిరిగి వచ్చే సమయంలో వారంతా ‘అక్కా..మాకు నోట్ బుక్స్ లేవు, చదువుకోవడానికి, రాయడానికి చాలా ఇబ్బంది ఉంద’నడంతో అనాథ పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ చేసేందుకు దాతలు కావాలంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. కొన్ని గంటల్లోనే 12 మంది ముందుకు వచ్చారు. అక్కడి పిల్లలకు ఏడాది పాటు కావాల్సిన నోట్‌బుక్స్, బట్టలు, షూస్, ఇతరాత్ర అవసరాల కోసం సాయం అందించారు. మరోరోజు ఇన్ఫోసిస్ కార్యాలయానికి కొందరు పిల్లలు విజిటింగ్ కోసం వచ్చారు. ఆ సమయంలో వారి కాళ్లకు చెప్పులు లేవు. వారి వద్దకు వెళ్లి వారి గురించి ఆరా తీసింది పల్లవిప్రియ. వారంతా నిరుపేదలని తెలిసి రాచకొండ పోలీస్ కమిషనర్ సాయంతో ఆ రోజు అక్కడకు వచ్చిన పిల్లలందరికీ చెప్పులతో పాటు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇచ్చి వారిలో ఆనందాన్ని నింపింది. అంతేకాదు.. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ స్కూల్స్‌లో బెంచ్‌లు, ఫ్యాన్లు పంపిణీ చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది పల్లవిప్రియ. ఈమెకు ప్రకృతి అంటే ఎంతో ప్రేమ. అందుకే పర్యావరణంపై శ్రద్ధను తీసుకుంటోంది. స్కూలు విద్యార్థులను కలిసి పర్యావరణం ప్రాముఖ్యతను వివరిస్తూ వారితో ఎస్సై రైటింగ్స్ పోటీలు నిర్వహిస్తోంది. వక్తృత్వ పోటీలు పెట్టి బహుమతులు సూతం ఇస్తోంది. ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల కలిగే అనర్థాలు వివరించి చెబుతోంది. పల్లవి ప్రియ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇన్ఫోసిస్ ఉన్నతోద్యోగలు, స్వచ్ఛంద సంస్థలు సైతం అభినందింది సత్కరించడం గమనార్హం. నాన్నే స్ఫూర్తి.. మా నాన్నకు ఇతరులకు సాయం చేయడం అంటే ఇష్టం. ఆయన మార్గంలోనే నేనూ నడుస్తున్నాను. సమాజానికి నా వల్ల ఏ విధమైన ఉపయోగం ఉంటుందనేది గుర్తించాను. అప్పటి నుంచే పేదలకు నాకు తోచిన విధంగా సాయం చేస్తున్నా. అందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకున్నా. నా సొంత డబ్బులతో పాటు నాకెంతో మంది అండగా నిలుస్తున్నారు. వారు ఇచ్చిన ప్రతి రూపాయికి బిల్లులతో సహా లెక్క కూడా చెప్తుంటాను. అందుకే సహాయం కోసం పోస్ట్ పెట్టిన ప్రతిసారీ నాకు తోడుగా ఎంతో మంది వెన్నంటి వస్తున్నారు. – పల్లవి ప్రియ, ఇన్ఫోసిస్ ఉద్యోగి -
కాళ్లపారాణి ఆరకముందే నూరేళ్లు
కర్ణాటక, కృష్ణరాజపురం : భర్తతో కలిసి ఏడు అడుగులు నడిచి వైవాహిక జీవితంలోకి ప్రవేశించి ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన నవ వధువు అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా మారింది. ఈ ఘటన గురువారం కోణనకుంటెలో చోటు చేసుకుంది.కోలారు జిల్లా బంగారుపేటకు చెందిన పల్లవి(24)కి నవీన్ అనే వ్యక్తితో నెలన్నర క్రితం వివాహమైంది. నవీన్ బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్యతో కలిసి కోణనకుంటెలో నివాసం ఉంటున్నాడు. దంపతుల మధ్య ఏం జరిగిందో ఏమో కాని పల్లవి గురువారం ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. మృతురాలి తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని పల్లవి మృతదేహాన్ని పరిశీలించారు. నవీన్ వేధింపులు తాళలేకే పల్లవి ఆత్మహత్య చేసుకుందని కోణనకుంటె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
మీటూ: స్పందించిన ఎంజే అక్బర్ భార్య
-
అనుకోకుండా దక్కిన గెలుపు
విజయం ఇచ్చే కిక్ అలా ఇలా ఉండదు. అందులో ఆనందం అనుభవిస్తే కానీ తెలియదు. అది ఎలా దక్కినా మజా భలేగా ఉంటుంది. అందునా అనూహ్యంగా గెలుపు లభిస్తే.. ఆ ఉత్సాహం ఆకాశం అంచుకు తీసుకెళ్తుంది. క్యాట్ వాక్ ఎలా చేస్తారో కూడా అంతగా తెలియని అమ్మాయి అందాల పోటీలో రెండు కిరీటాలు దక్కించుకుంటే.. ఆమె సంబరం అలా ఉంటుంది. మోడలింగ్ పోటీల్లో ఒక్కసారి కూడా పాల్గొనని యువతి మిస్ ఇండియా పోటీల్లో ద్వితీయ రన్నరప్‌గా, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా రెండు మకుటాలు సొంతం చేసుకుంటే ఆమె అంబరం అంచుల్లో తేలిపోవడంలో ఆశ్చర్యమేముంది? విశాఖకు చెందిన మామిడి సాయి వెంకట పల్లవి ఇప్పుడా ఆనందోత్సాహాలలో మునిగితేలుతోంది. డాజిల్ సంస్థ ఇటీవల నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో రెండు కిరీటాలు సాధించిన పల్లవి ఆ సంస్థ ప్రచారకర్తగా ఎంపికయింది. అనుకోకుండా గెలుపు దక్కినందుకు ఆనందంగా ఉందని, అయితే ఫలితాన్ని ఆశించకుండా కష్టపడ్డానని పల్లవి చెబుతోంది. బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ‘అనుకోకుండా దక్కిన గెలుపు ఎంత సంబరాన్నిస్తుందో ఇప్పుడు నాకు అనుభవపూర్వకంగా తెలుస్తోంది. మోడలింగ్ పోటీల్లో పాల్గొన్న అనుభవం లేకుండా.. క్యాట్ వాక్ ఎలా చేస్తారో తెలియకుండా నేను రెండు టైటిళ్లు గెలిచానంటే నాకే నమ్మశక్యం కాకుండా ఉంది.’ అని మిస్ ఇండియా పోటీల్లో ద్వితీయ రన్నరప్, మిస్ ఆంధ్రప్రదేశ్ మామిడి సాయి వెంకట పల్లవి ఉత్సాహంతో అన్నారు. ఈ పోటీల్లో గెలుపు అనూహ్యమైనదే అయినా.. తాను మాత్రం ఫలితంపై దృష్టి పెట్టకుండా కష్టబడ్డానని చెప్పారు. తన జీవితం గురించి, లక్ష్యాల గురించి ఆమె వివరిస్తూ.. నిజానికి మోడలింగ్‌పై మొదట్లో తనకు దృష్టి లేదని చెప్పారు. ‘నేను ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నా. అందుకు సంబంధిత కోర్సు కూడా చేశా. అయితే అమ్మ, నా స్నేహితులు మాత్రం మోడలింగ్ వైపు వెళ్లాలని ప్రోత్సహించారు. దాంతో ఆ రంగంవైపు అడుగులేశాను.’ అని చెప్పారు. 83 నుంచి 60 కిలోలకు... ‘మోడలింగ్ చేయాలని అనుకున్నానే కానీ అధిక బరువు నన్ను భయపెట్టింది. ఎలాగైనా బరువు తగ్గాలని సంకల్పించాను. అందుకు రెండు నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నాను. అలా 83 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గాను. నాలో మార్పు చూసి ఆశ్చర్యపోని వారు లేరు. చివరికి జిమ్‌లో ఇన్స్ట్రక్టర్లు కూడా అబ్బురపడ్డారు. ఇప్పుడు ఆ జిమ్ నిర్వాహకులు నా ఫోటోను వారి ప్రచారానికి వినియోగించుకుంటున్నారు.’ అని చెప్పింది. టాలెంట్ ఒక్కటే లెక్క ‘ఒకప్పుడు మోడలింగ్ అంటే రకరకాల అభిప్రాయాలుండేవి. కొన్ని విషయాల్లో రాజీ పడితే తప్ప ఆ రంగంలో రాణించలేరన్న తప్పుడు అభిప్రాయం ఉండేది. అది చాలా తప్పు. నిజానికి ఎప్పుడైనా ఎక్కడైనా టాలెంట్ ఉంటే విజయం దక్కుతుంది. ప్రతిభ కలవారికి ఆకాశమే హద్దనుకునే పరిస్థితి ఉంది. కేవలం ప్రతిభను నమ్ముకుని రంగంలోకి దిగిన నాకు గెలుపు లభించడం బట్టి చూస్తే... టాలెంట్‌కు గల ప్రాధాన్యం అర్థమవుతుంది.’ అని ఆమె చెప్పారు. సమాజ సేవ ధ్యేయం ‘విద్యార్ధిగా ఉన్నప్పుడు రాబిన్ హుడ్ ఆర్మీలో సభ్యురాలిగా ఉండేదానిని. అలా పదిమందికీ ప్రయోజకం కలిగించే పనులు చేసేదానిని. భవిష్యత్తులో సమాజ సేవను కొనసాగిస్తాను. నాకు అవకాశాలు కల్పించిన సమాజానికి వీలైనంత మేరకు మేలు కలిగేలా కృషి చేస్తాను.’ అని పల్లవి చెప్పారు. ప్రాథమిక విద్య అందని పిల్లలకు విద్య అందేలా కృషి చేస్తానన్నారు. ప్రస్తుతానికి ప్రత్యేకించి లక్ష్యాలు లేనప్పటికీ మోడలింగ్‌లో ఉన్నత స్థానానికి చేరడమే తన ధ్యేయమని.. ఎప్పటికైనా మిస్ యూనివర్స్ కావాలన్న లక్ష్యంతో ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ రంగం నుంచి సినీ రంగానికి వెళ్లేందుకు పట్టుదలతో కృషి చేస్తానన్నారు. -
మహానటి ఓ కథేనా?!
మహానటి సినిమా చూశారా? అయితే టైటిల్స్ గమనించారా? చూస్తే.. గమనిస్తే.. గార్లపాటి పల్లవి పేరు కనిపించిందా? ఇప్పుడు అదో సినిమా అయింది! సావిత్రి మీద అభిమానంతో ఆమె గురించి అక్కడ చదివి.. ఇక్కడ చదివి.. వాళ్లను వాకబు చేసి.. వీళ్లను వాకబు చేసి ‘మహానటి సావిత్రి.. వెండితెర సామ్రాజ్ఞి’ అనే పుస్తకం రాశారు! సావిత్రి వాస్తవంగా ఓ మహానటి. అయితే.. మహానటి వాస్తవంగా సావిత్రి కాదు.. అని సోషల్ మీడియా వాల్స్ మీద ఈ మధ్య పోస్టర్లు వెలిసినప్పుడు.. మహానటి నిజంగానే ఓ కథేనా? లేక దాంట్లో వాస్తవాలున్నాయా అని తెలుసుకోవడానికి పల్లవిని పలకరించింది... సాక్షి. ‘మహానటి’.. సావిత్రిని ఈ తరానికి పరిచయం చేసిన సినిమా. అయితే అంతకుముందే ఆమె బయోగ్రఫీ వచ్చింది ‘మహానటి సావిత్రి.. వెండితెర సామ్రాజ్ఞి’ అనే పేరుతో. ఆ పుస్తకాన్ని రాసింది సావిత్రి కుటుంబీకురాలో.. ఆమె సన్నిహితురాలో.. లేదా ఇంకే సినిమా పర్సనాలిటీనో కాదు. రచయిత అంతకన్నా కాదు. ఓ సాధారణ గృహిణి. గార్లపాటి పల్లవి. సావిత్రి పుస్తకంతోనే ఆమె రచయిత్రిగా మారారు. మహానటి సావిత్రి సినిమాకు ఓ సోర్స్‌గా కూడా మారారు. అయినా ‘‘ఆ సినిమా తెలుగువారి మహానటి కాదు.. మద్రాస్వారి మహానటి’’ అంటారు ఆమె. అన్ని వివరాలు పల్లవి మాటల్లోనే విందాం.‘‘నాకోసం నేను రాసుకున్న పుస్తకం సావిత్రి. ఆమె సినిమాలు పెద్దగా చూసిందీ లేదు. ఎందుకంటే నాకు ఊహ తెలిసేటప్పటికే సావిత్రి క్యారెక్టర్ రోల్స్‌కి వచ్చేశారు. ఆవిడంటే మా నాన్నగారికి చాలా ఇష్టమని మా అమ్మ చెప్తుండేది. అలా ఆవిడ నా మైండ్‌లో అచ్చయిపోయారు. నేను ట్వల్త్క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంట్లోకి వీసీఆర్ వచ్చింది. అందులో మేం చూసిన మొదటి సినిమా ‘‘కన్యాశుల్కం’’. మధురవాణిగా సావిత్రిని ఎవరైనా మరిచిపోగలరా? ఆ తర్వాత 1990ల్లో మళ్లీ సావిత్రిగారి సినిమా చూశా. ఐ ఫాలెన్ ఇన్ లవ్ విత్ హర్. ఆ లవ్వే ఆమె బయోగ్రఫీ రాసేలా చేసింది. 2004లో అనుకుంటా ఘంటసాల గారి మీద రాసిన పుస్తకం చూపిస్తూ మాకు తెలిసినొకాయన..‘‘ దీని కోసం 6 లక్షలు ఖర్చయింది’’ అన్నారు. ‘నేనైతే సావిత్రి కోసం ఎన్ని లక్షలయినా ఖర్చుపెట్టేస్తా’ అన్నాను ఆసువుగా. అప్పటికి నాకు పెళ్లయి ముగ్గురు పిల్లలు. పాప ప్రణతి యూకేజీలో ఉంది. ఇద్దరు మగపిల్లలు ట్విన్స్ ఆకాశ్, పృథ్వీ. ఎల్కేజీలో ఉన్నారు. నేనూ ఏదో కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా. ఆ పరీక్ష అయిపోయిన వెంటనే ఆ వ్యక్తికి కాల్ చేశా ‘‘అంకుల్ విల్ గో ఫర్ బుక్’’ అని. అప్పటిదాకా నేను క్లాసిక్స్ అనదగ్గవి 20 వరకూ చదివుంటా. కానీ ఎప్పుడూ రాయలేదు. డైరెక్ట్‌గా మహానటి సావిత్రే. ముందు భూషణ్ (ప్రముఖ ఫొటోగ్రాఫర్) గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన సావిత్రి ఫొటోస్ కొన్ని ఇచ్చారు, ఆ తర్వాత చెన్నైకి వెళ్లాను. ఫిల్మ్ న్యూస్ ఆనంద్‌ను కలిశాను. సంజయ్కిశోర్ను కలిశాను. దశాదిశ లేకుండానే.. నేను మామూలు హౌస్‌వైఫ్‌ని. సినిమాలతో కానీ, సినిమా వాళ్లతో కానీ మా ఫ్యామిలీకి ఎలాంటి స్నేహం లేదు. సావిత్రిగారిమీదున్న ప్రేమ, పుస్తకం రాయాలి అన్న సంకల్పమే తప్ప ఎవరిని కలవాలి, ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నవేమీ తెలియవు. గుమ్మడి గారిని కలిశాను. ఆయన రాసిన ‘తీపి గుర్తులు.. చేదు జ్ఞాపకాలు’ పుస్తకం తీసుకున్నాను. భూషణ్ (ప్రముఖ ఫొటోగ్రాఫర్)ను కలిస్తే ఆయన కొన్ని ఫొటోస్ ఇచ్చారు. సంజయ్ కిశోర్‌ను, జమున గారిని, కాంతారావుగారిని, చెన్నైలో ఫిల్మ్‌న్యూస్ ఆనంద్‌ను కలిశాను. అప్పుడే జమునగారి కూతురి పెళ్లి ఉండడంతో ఆమె తర్వాత కలవమని చెప్పారు. కానీ వెళ్లలేకపోయాను. కాంతారావు గారేమో బ్యాడ్ హెల్త్ కండిషన్లో ఉండి ఏమీ చెప్పలేక పోయారు. ఆతర్వాత విజయ చాముండేశ్వరి గారినీ కలిశాను. నా పిల్లలు చిన్నవాళ్లవడంతో అవుట్స్టేషన్స్కు వెళ్లడం కుదర్లేదు. సావిత్రిగారి మీది ఆర్టికల్స్, ఆమె ఇంటర్వ్యూ బాగా ఉపయోగపడ్డాయి. వనితాజ్యోతిలోని పసుపులేటి రామారావుగారు రాసిన ఆర్టికల్.. ఇంకా అలాంటివి చాలా. పుస్తకం రాయడం మొదలుపెట్టాక, ఇంకా చెప్పాలంటే పూర్తయ్యాక ఒక్కొక్కరూ తెలియడం మొదలుపెట్టారు. సావిత్రిగారి అక్క భర్త మా ఇంటి దగ్గరే ఉంటారని తెలిసింది. నాకు దొరికిన సోర్స్‌ని బట్టి రాస్తూ వచ్చాను. అలాగని గ్రౌండ్ వర్క్ చేయలేదని చెప్పను. విజయవాడ, సత్యనారాయణపురంలో సావిత్రిగారు వాళ్లున్న వీధికి వెళ్లా. ఆ తరం వాళ్లను కలిసి మాట్లాడా. అలాగే ఆవిడ స్కూల్ కట్టించిన ఊరికీ వెళ్లా. వేటపాలెం లైబ్రరీనీ కాంటాక్ట్ చేశా. సావిత్రిగారు లక్స్ యాడ్‌కు మోడలింగ్ చేశారన్న సంగతి ఆ లైబ్రరీతోనే తెలిసింది. పుస్తకంలో చాముండి పాత్ర పుస్తకం రాసేటప్పుడు అప్పటికప్పుడు నాకు తట్టిన పాత్ర అది. సావిత్రికి ఫ్రెండ్‌గా పెట్టాను. ఆమె జీవితంలో వెన్నంటి ఉండే పాత్ర. సినిమాలు తీయకు, దానాలు చేయకు, జెమినీని నమ్మకు అంటూ సావిత్రికి అడుగడుగునా మంచిచెడులు చెప్తుంటుంది. అయితే ఈ పాత్ర మాత్రమే కల్పితం. కానీ ఆ మిగిలినవన్నీ సావిత్రిగారి జీవితం లో జరిగినవే. మరెందుకు ఆ కల్పిత పాత్ర? అంటే చెప్పలేను. చాముండి వల్లే నా పుస్తకం అంతా ఫిక్టీషియస్ అనుకున్నారు. సూజెన్ హెవర్డ్ ఉత్తరం కూడా అంతే. సావిత్రి లైఫ్ గురించే ఎక్కువ చెప్పాను. నటిగా ఆమెను ఎక్కడా డిస్క్రైబ్ చేయలేదు. ఆ ఉత్తరం ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా ఆమె నటనను వర్ణించాలనుకున్నాను. ఈ ఉత్తరం నా కల్పితమని నా పుస్తకం ముందుమాటలో గుమ్మడిగారు స్పష్టం చేశారు కూడా. అంతెందుకు గుమ్మడిగారి పుస్తకంలో.. సావిత్రిగారు బెంగళూరు హోటల్లో బస చేసినప్పుడు (తనతో స్నేహంగా ఉన్న) ఒక నటిని పిలిపించుకొని ఎప్పుడో ఆమెకు ఇచ్చిన తన నగను ఇవ్వమని సావిత్రి అడిగినట్టు, దానికి ఆ నటి తన దగ్గర ఆ నగలేదని చెప్పినట్టు, డబ్బు అవసరంలో ఉన్న సావిత్రిగారు ఆ మాట విని షాకైనట్టు అలా కోమాలోకి వెళ్లినట్టూ రాశారు. ‘‘ఇది నిజమేనా అండీ.. ’’ అని నేను గుమ్మడిగారిని అడిగా. ఆయన నిజమని చెప్పలేదు.. అబద్ధమనీ నిర్ధారించలేదు. మౌనంగా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉన్న సోర్సెస్ కూడా నిజాలను తేల్చలేదని తెలియజేయడానికే. స్టార్ట్‌చేసిన యేడాదికల్లా పుస్తకం రెడీ అయింది. మా నాన్నగారికి శాంతాబయోటిక్ వరప్రసాద్‌రెడ్డిగారు మంచి ఫ్రెండ్. ఆయనకు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాను. ఇప్పటి వరకు పన్నెండు వేల కాపీలను ప్రింట్ చేశాం. ప్రతి యేడాది రెండు వేల కాపీలను ప్రింట్ చేస్తూనే ఉన్నాం. ఈ పుస్తకంలో నేనెంత లీనమయ్యానంటే మా పిల్లలు ‘‘అమ్మా సావిత్రమ్మ మాకు అమ్మమ్మ అవుతుంది కదా’ అని అడిగేంతగా! రెండో పుస్తకం.. ఎమ్మెస్గారి మీద ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారు అంటే నాకు శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాతమే. అంతకుమించి ఆమె పాడినవి ఏవీ నేను వినలేదు. ఆమెను చూడలేదు. ఆమె పాడిన భజగోవిందంలోని పునరపి జననం.. పునరపి మరణం అనే వాక్యాలు కలిగించిన కుతూహలం టీజేఎస్ జార్జ్ .. ఎమ్మెస్ మీద రాసిన పుస్తకాన్ని పరిచయం చేసింది. అది చదివాక ఆమె బయోగ్రఫీ తెలుగులో రాస్తే బాగుంటుందనిపించింది. సావిత్రి బయోగ్రఫీ ఇచ్చిన ఎక్స్‌పీరియెన్స్‌తో ఈ పుస్తకానికి రీసెర్చ్ మొదలుపెట్టా. దాదాపు ఎనిమిదేళ్లు సాగింది. సావిత్రి పుస్తకం ఇష్టమైతే.. ఎమ్మెస్ మీద పుస్తకం ఓ యజ్ఞం. జార్జ్ మొదలు, ఎమ్మెస్గారి వదిన, ఎమ్మెస్ గారి మనవడు, మునిమనవరాలు, సదాశివం (ఎమ్మెస్ భర్త) కాంటెంపరరీస్ అయిన ఖాసా సుబ్బారావు గారి కూతురు, వీఏకే రంగారావు, స్వామినాథన్ ఇలా చాలామందిని కలిశాను. చెన్నై, కోయంబత్తూరు, మధురై, రాజుపాళెం వంటి చోట్లకూ వెళ్లా. ఆమె మీద వచ్చిన ఎన్నో పుస్తకాలను, ఆర్టికల్స్‌నూ ఔపోసన పట్టా. ఆమె మీద తీసిన ‘ఫరెవర్ లెజెండ్’ డాక్యుమెంటరీ చూశా. ఆడియోస్ విన్నా. అన్నీ హెల్ప్ అయ్యాయి. ఈ ప్రయాణం స్టార్ట్చేసేనాటికి నా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఈ పుస్తక రచనలో చాలా సాయపడ్డారు. ఫొటోలు తీయడం దగ్గర్నుంచి ఇంటర్వ్యూలను రికార్డ్చేయడం వరకు ఒకరకంగా నాకు అసిస్టెంట్స్‌గా ఉన్నారని చెప్పొచ్చు. మా నాన్నా అంతే తోడుగా ఉన్నారు. ఇలా మా ఇంట్లో వాళ్లంతా ఎవరికి తోచిన సహాయం వాళ్లు చేశారే తప్ప ఎందుకు ఈ ప్రయాస అంటూ నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఈ రీసెర్చ్ నాకు చాలా విషయాలను నేర్పింది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారికి సంబంధించి ఒక క్లూ ఇచ్చింది మాత్రం ఆమె వదినగారే. ఎమ్మెస్ భర్త సదాశివం..ఆమెను పెళ్లిచేసుకున్నాక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారట. ఈ విషయం తెలిసి సుబ్బులక్ష్మిగారు తన అన్నతో చెప్పి ఏడ్చారని చెప్పింది వాళ్ల వదిన. కానీ సుబ్బులక్ష్మి మనవడు చెప్పేదానికంటే కూడా ‘‘మీరు జార్జ్ లాగా రాయొద్దు’’ అని ఆంక్షలే ఎక్కువ పెట్టాడు. కానీ నేను జార్జ్ కన్నా నాలుగు నిజాలు ఎక్కువే రాశాను. జార్జ్ తన పుస్తకంలో ప్రశ్నార్థకాలు పెట్టిన వాస్తవాల దగ్గర నా పుస్తకంలో నేను ఫుల్స్టాప్ పెట్టా. ఎమ్మెస్ వాళ్లమ్మ చనిపోతే ఆమె వెళ్లలేదని ఎమ్మెస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి చెప్పాడు. నేనూ అదే రాశాను. పుస్తకం అచ్చుకి రెడీ అయిన టైమ్‌లో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మీద ‘ది హిందూ’లో ఓ వ్యాసం వచ్చింది. అందులో ఆమె వాళ్లమ్మ చనిపోయినప్పుడు వెళ్లింది అని రాశారు. ఆ ఆర్టికల్ రాసిన వ్యక్తి కాంటాక్ట్ నంబర్ పట్టుకొని క్రాస్ చెక్ చేసుకున్నా. నిజమే అని తేలింది. దాంతో నేను రాసింది మళ్లీ మార్చాల్సి వచ్చింది. అలాంటి ఎన్నో సంఘటనలు మళ్లీ మళ్లీ క్రాస్ చెక్ చేసుకుంటూ పోయా. ‘సుస్వరాల లక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి’గా పుస్తకాన్ని అచ్చువేశా. వరప్రసాద్‌రెడ్డి గారి తల్లిదండ్రులైన శాంతమ్మగారు, వెంకటరమణారెడ్డి గారికి ఆ పుస్తకాన్ని అంకితమిచ్చా. రిలీజ్ అయిన రోజే రెండు వందల కాపీలు అమ్ముడుపోయాయి. వితిన్ సిక్స్ మంత్స్ సెకండ్ ప్రింట్కు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెస్ ఎక్స్‌పీరియెన్స్‌తో సావిత్రి పుస్తకం మళ్లీ రాయాలనుంది. ఈ పుస్తకం నాకు సావిత్రి అభిమాని శిల్పను మంచి ఫ్రెండ్‌గా చేస్తే, తెలుగు యూనివర్సిటీ వారి ఉత్తమ వచన రచన పురస్కారాన్ని అందించింది. విమర్శలను పట్టించుకుంటూనే నా పని నేను చేసుకుంటా. ఏ పనికైనా ప్రత్యేకంగా ప్లాన్ అంటూ ఏమీ ఉండదు. అప్పటికప్పుడు బలంగా ఏదనిపిస్తే అది చేస్తా’’ అంటూ ముగించారు గార్లపాటి పల్లవి. పల్లవి.. కుటుంబం పల్లవి స్వస్థలం గుంటూరు జిల్లా, బోడిపాలెం. ఆమె తండ్రి రావిపాటి నాగేశ్వరరావు సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. తల్లి శాంతి. నిజానికి పల్లవి తెలుగు చదివింది మూడో తరగతి వరకే. ఎందుకంటే తర్వాత ఆమె విద్యాభ్యాసమంతా సెంట్రల్ స్కూల్స్‌లోనే సాగింది. ఎనిమిదో తరగతి వరకు గుంటూరులోనే. తండ్రి ఉద్యోగరీత్యా తర్వాత నుంచి అంతా హైదరాబాదే. కేంద్రీయ విద్యాలయాల్లో స్పోర్ట్స్‌కి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. అందువల్ల పల్లవి కూడా టేబుల్ టెన్నిస్ ఆడేవారు. స్కూల్స్ నేషనల్స్ వరకూ వెళ్లారు. ఎమ్మే హిస్టరీ చేశారు. సివిల్స్‌కూ ప్రిపేర్ అయ్యారు. ఆమె భర్త గార్లపాటి మధుసూదన్‌రావు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. కూతురు ప్రణతి. ఇంజనీరింగ్ చదువుతోంది. మగపిల్లలు ఆకాశ్, పృథ్వీ ట్విన్స్. ఇంటర్లో ఉన్నారు. – సరస్వతి రమ -
క్యూట్ లవ్ స్టోరీ
శ్రీరామ్, పల్లవి జంటగా ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. లాగిన్ మీడియా శ్రీధర్‌రెడ్డి ఆశీస్సులతో కృష్ణ కార్తీక్ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. కృష్ణ కార్తీక్ మాట్లాడుతూ –‘‘ప్రయోగాత్మక చిత్రాలను ఎంకరేజ్ చేస్తున్న ఉదయ్‌గారు నాకు రెండో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇదొక క్యూట్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరి మనసును తాకే కథ. రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా రియలిస్టిక్ కథను సినిమాగా రూపొందిస్తున్నాం. షూటింగ్ మొత్తం తెలంగాణలో జరుగుతుంది. నెక్ట్స్ వీక్‌లో మొదటి షెడ్యూల్ ప్రారంభించి, 35రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో వస్తున్న రెండో చిత్రమిది. మంచి కథతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు ఉదయ్‌భాస్కర్ గౌడ్. శ్రీరామ్, పల్లవి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నా కోటి, సంగీతం: మహి మదన్ యంయం, సమర్పణ: వై. బాలరాజు గౌడ్, సహ నిర్మాత: వినయ్‌కుమార్ గౌడ్. -
మాస్ మెచ్చేలా ఫైట్స్
నవీన్, పల్లవి జంటగా కె. కృష్ణప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డేర్’. యన్. కరణ్‌రెడ్డి సమర్పణలో యన్. రామారావు నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా యన్. కరణ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకుల ఊహకందని సన్నివేశాలు చాలా ఉన్నాయి. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి. నవీన్ కొత్త కుర్రాడైనా చక్కగా నటించాడు. తను చేసిన ఫైట్స్ మాస్ ప్రేక్షకులకు నచ్చుతాయి. జి.ఆర్. నరేన్ స్వరపరచిన ఈ సినిమా పాటలు ఇప్పటికే శ్రోతలకు బాగా చేరువయ్యాయి. మా సినిమా తప్పకుండా ప్రేక్షలకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకట్, నిర్మాణం: యన్. వరలక్ష్మి. -
భయం లేదు
‘‘డేర్’ ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. నవీన్ కొత్త కుర్రాడైనా బాగా నటించాడు. మిగతా ఆర్టిస్టులు కూడా బాగా నటించడంతో మంచి అవుట్‌పుట్ వచ్చింది. పాటలు, ఫైట్స్ హైలైట్. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని దర్శకుడు కె.కృష్ణప్రసాద్ అన్నారు. నవీన్, పల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో ఎస్. కరణ్ రెడ్డి సమర్పణలో ఎస్. రామారావు నిర్మించిన సినిమా ‘డేర్’. జి.ఆర్. నరేన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ విడుదల చేసి, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్‌కు అందించారు. నిర్మాత ఎస్.రామారావు మాట్లాడుతూ– ‘‘కథానుగుణంగా సదా చంద్ర మంచి పాటలు రాశారు. వాటికి నరేన్ తనదైన స్టైల్లో అందర్నీ ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు. సినిమాకు పాటలు పెద్ద ఎస్సెట్’’ అన్నారు. ‘‘మా టీమ్ కష్టపడి, ఇష్టపడి పనిచేశాం. మంచి అవుట్‌పుట్ వచ్చింది. విజువల్స్ బాగున్నాయి. అందరికీ నచ్చే సినిమా అవుతుందని డేర్‌గా చెప్పగలను’’ అన్నారు నవీన్. పల్లవి, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకట్. -
అనుమానం పెనుభూతమై..
- వివాహిత దారుణహత్య - పరారీలో భర్త, అతని అక్క మొగుడు - మాధవనగర్‌లో సంఘటన కర్నూలు: అనుమానం పెనుభూతమైంది. జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. బుధవారం సాయంత్రం మాధవనగర్‌లోని శివరామాలయం వెనుక వీధిలో పల్లవి (25) అనే వివాహిత దారుణహత్యకు గురైంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం సీపీ సముద్రం గ్రామానికి చెందిన ఉమాదేవి, చంద్ర మౌళీశ్వరుల ఏకైక కుమార్తె పల్లవితో 2010లో పాములపాడు మండలం మిట్టకందాల గ్రామానికి చెందిన లక్ష్మిదేవి కుమారుడు పురోహితుడైన చంద్రమోహన్‌కు వివాహమైంది. ఏకైక కుమార్తె కావడంతో ఆమె విడిచి ఉండలేక తండ్రి.. జొహరాపురంలో పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాధవనగర్‌లో కాపురం పెట్టిన చంద్రమోహన్, పల్లవి దంపతులు ఏడేళ్ల పాటు కుటుంబాన్ని సజావుగా సాగించారు. చంద్రమోహన్ తల్లి లక్ష్మిదేవి కూడా వీరితో పాటే కలిసి ఉంది. అనుమానంతోనే... జూన్ 26న జరిగిన సంఘటనను పల్లవి భర్త చంద్రమోహన్‌కు తెలియజేశారు. నాటి నుంచి అనుమానం పెంచుకున్న భర్త, అతని బావ తరచూ పల్లవిని వేధింపులకు గురి చేసేవారు. ఒకానొక సమయంలో కాల్చి వాతలు కూడా పెట్టారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒంటరిగా ఉన్న పల్లవిని భర్త, అతని బావ దారుణంగా హత్య చేసి పరారయ్యారని మృతురాలి తల్లిదండ్రులు ఉమాదేవి, చంద్రమౌళీశ్వర్‌లు పోలీసుల ముందు వాపోయారు. మృతురాలికి కుమార్తె ఆరాధ్య, కుమారుడు కౌషిక్‌లు ఉన్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. జూన్ 26 ఏం జరిగింది? గత నెల 26న చంద్రమోహన్ మొక్కు తీర్చుకునేందుకు తిరుపతికి వెళ్లాడు. అదే రోజు రాత్రి పల్లవి తల్లితో పాటు ఆమె బంధువులు ఇంటికొచ్చారు. అదే సమయంలో చంద్రమోహన్ తల్లి లక్ష్మిదేవి పెద్దమార్కెట్ వద్ద ఉన్న తన కుమార్తె వసుంధర వద్దకు పిల్లల్ని తీసుకెళ్లింది. ఒకేరోజు తల్లీపిల్లలు ఇంటికి రావడంతో అనుమానం వచ్చిన వసుంధర, ఆమె భర్త శేఖర్.. చంద్రమోహన్ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టారు. ఇంట్లో పల్లవి తన బంధువులతో కలిసి ఉన్న దృశ్యాలను చూసిన వసుంధర, శేఖర్లు తమ అమ్మను, పిల్లల్ని పంపించి మీ బంధువులతో ఏం చేస్తున్నావంటూ దాడికి దిగారు. ఇరుగుపొరుగు వారు వచ్చి వారించడం తో ఆ రాత్రికి గొడవ సద్దుమణిగింది. -
ధర్మవరం ఇన్చార్జ్ హెచ్వోగా పల్లవి
అనంతపురం అగ్రికల్చర్ : ధర్మవరం ఇన్చార్జ్ హార్టికల్చర్ ఆఫీసర్ (హెచ్‌వో)గా పల్లవిని నియమించినట్లు ఆ శాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కలెక్టర్ జి.వీరపాండియన్ ధర్మవరం మండలంలో పర్యటించిన సమయంలో గైర్హాజరు కావడంతో అక్కడ పని చేస్తున్న చిన్నరెడ్డయ్యపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో చిగిచెర్ల హార్టికల్చర్ ఫార్మ్‌లో పని చేస్తున్న హెచ్‌వో పల్లవికి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. -
లవ్..యాక్షన్..కామెడీ
కె.కృష్ణప్రసాద్ దర్శకత్వంలో ఎన్.ఆర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘డేర్’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నరేన్ సంగీత దర్శకుడు. నవీన్ హీరో. జీవ, మధు, పల్లవి, సుహాసిని ఇతర ముఖ్య తారాగణం. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్, కామెడీతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. నరేన్ మంచి సంగీతం అందించారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: రాఘవ, పాటలు: సదాచంద్ర. -
పాపం పల్లవి..
మృత్యువుతో పోరాడి తిరిగిరాని లోకాలకు.. ప్రేమ వేధింపులకు మరో యువతి బలి చాంద(టి)లో విషాదం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పాపం పల్లవి.. కన్ను మూసింది. ప్రేమ వేధింపులతో జీవితాన్నే చాలించింది. కాలిన గాయాలతో ఏడు రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి.. చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఎంతో జీవితం ఉన్న పల్లవిని ఓ యువకుడి రూపంలో మృత్యువు ఇలా వెంటాడింది. పుట్టినప్పుడే తల్లి ప్రేమకు దూరమై.. పెంచి పెద్ద చేసిన నానమ్మ, తాతయ్యలకూ ఇప్పుడు దూరమైంది. వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆదిలాబాద్ రూరల్ : ఆదిలాబాద్ మండలం చాంద(టి) గ్రామానికి చెందిన పల్లవి(17) ఈ నెల 14న ఇంట్లోనే వేకువజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించి చికిత్స అందజేశారు. తండ్రి దేవిదాస్ ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. తన ఆత్మహత్యకు యువకుడి వేధింపులే కారణమని పల్లవి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వాంగ్మూలం ఇచ్చినట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ వైద్యుల సలహా మేరకు పల్లవిని అదే రోజు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందినా పరిస్థితి మెరుగు కాకపోవడంతో బుధవారం రాత్రి మృతిచెందింది. దీంతో చాందా(టి)లో విషాదం అలుముకుంది. గురువారం గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఫిర్యాదు చేసిన వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వేధింపులకు పాల్పడిన జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన యువకుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి ఇదివరకే రిమాండ్‌కు తరలించారు. పల్లవి జీవితమే విషాదం పల్లవి జీవితంలో అన్నీ విషాదాలే ఉన్నాయి. ఆమె పుట్టిన రెండు నెలలకే తల్లి మృతిచెందింది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసే తండ్రి దేవిదాస్ అప్పట్లోనే మరో వివాహం చేసుకోవడంతో పల్లవి తన తాతయ్య, నానమ్మ బాపురావు, లసుంబాయిల వద్దే పెరిగింది. వారు కూడా తల్లి లేని పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆమె జీవితంపై అందమైన కలలు కన్న వారికి ఒక్కసారిగా పల్లవి మృతి విషాదం నింపింది. ఆమె వివాహం తమ చేతులమీదుగా చేద్దామనుకున్న వారికి ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకవేళ ఆస్తి పంపకాలు చేస్తే తల్లి లేని పిల్ల పల్లవి వివాహంలో ఇబ్బందులు అవుతాయని భావించిన తాత, నానమ్మలు తమ ముగ్గురు కుమారులకు ఆస్తి పంపకాలు చేయకపోవడం ఇక్కడ వారి మమకారాన్ని స్పష్టం చేస్తోంది. ప్రేమ భూతానికి బలి.. పల్లవి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివేది. రోజు బస్సు, ఆటోల ద్వారా రాకపోకలు సాగించేది. ఈ క్రమంలో ఆదిలాబాద్ పట్టణంలో పల్లవిని చూసిన జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన చంద్రశేఖర్ తనను ప్రేమించాలని ఆమె వెంట పడ్డాడు. ఈ పరిణామాలతో పల్లవి మనోవేదనకు గురైంది. యువకుడు వేధిస్తున్నాడని ఇంట్లో తెలియజేయడంతో తండ్రి కానిస్టేబుల్ దేవిదాస్ ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఘటనకు ఐదు రోజులు ముందు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు దర్యాప్తులో పోలీసులు జాప్యం చేశారని పల్లవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. త్వరగా స్పందించి ఇలా జరిగేది కాదని వారి వాదన. -
పాపం పల్లవి..
ఆదిలాబాద్ రూరల్ : ఆదిలాబాద్ మండలం చాంద(టి) గ్రామానికి చెందిన పల్లవి(17) ఈ నెల 14న ఇంట్లోనే వేకువజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించి చికిత్స అందజేశారు. తండ్రి దేవిదాస్ ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. తన ఆత్మహత్యకు యువకుడి వేధింపులే కారణమని పల్లవి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వాంగ్మూలం ఇచ్చినట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ వైద్యుల సలహా మేరకు పల్లవిని అదే రోజు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందినా పరిస్థితి మెరుగు కాకపోవడంతో బుధవారం రాత్రి మృతిచెందింది. దీంతో చాందా(టి)లో విషాదం అలుముకుంది. గురువారం గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఫిర్యాదు చేసిన వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వేధింపులకు పాల్పడిన జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన యువకుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి ఇదివరకే రిమాండ్‌కు తరలించారు. పల్లవి జీవితమే విషాదం పల్లవి జీవితంలో అన్నీ విషాదాలే ఉన్నాయి. ఆమె పుట్టిన రెండు నెలలకే తల్లి మృతిచెందింది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసే తండ్రి దేవిదాస్ అప్పట్లోనే మరో వివాహం చేసుకోవడంతో పల్లవి తన తాతయ్య, నానమ్మ బాపురావు, లసుంబాయిల వద్దే పెరిగింది. వారు కూడా తల్లి లేని పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆమె జీవితంపై అందమైన కలలు కన్న వారికి ఒక్కసారిగా పల్లవి మృతి విషాదం నింపింది. ఆమె వివాహం తమ చేతులమీదుగా చేద్దామనుకున్న వారికి ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకవేళ ఆస్తి పంపకాలు చేస్తే తల్లి లేని పిల్ల పల్లవి వివాహంలో ఇబ్బందులు అవుతాయని భావించిన తాత, నానమ్మలు తమ ముగ్గురు కుమారులకు ఆస్తి పంపకాలు చేయకపోవడం ఇక్కడ వారి మమకారాన్ని స్పష్టం చేస్తోంది. ప్రేమ భూతానికి బలి.. పల్లవి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివేది. రోజు బస్సు, ఆటోల ద్వారా రాకపోకలు సాగించేది. ఈ క్రమంలో ఆదిలాబాద్ పట్టణంలో పల్లవిని చూసిన జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన చంద్రశేఖర్ తనను ప్రేమించాలని ఆమె వెంట పడ్డాడు. ఈ పరిణామాలతో పల్లవి మనోవేదనకు గురైంది. యువకుడు వేధిస్తున్నాడని ఇంట్లో తెలియజేయడంతో తండ్రి కానిస్టేబుల్ దేవిదాస్ ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఘటనకు ఐదు రోజులు ముందు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు దర్యాప్తులో పోలీసులు జాప్యం చేశారని పల్లవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. త్వరగా స్పందించి ఇలా జరిగేది కాదని వారి వాదన. మృత్యువుతో పోరాడి తిరిగిరాని లోకాలకు.. ప్రేమ వేధింపులకు మరో యువతి బలి చాంద(టి)లో విషాదం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పాపం పల్లవి.. కన్ను మూసింది. ప్రేమ వేధింపులతో జీవితాన్నే చాలించింది. కాలిన గాయాలతో ఏడు రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి.. చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఎంతో జీవితం ఉన్న పల్లవిని ఓ యువకుడి రూపంలో మృత్యువు ఇలా వెంటాడింది. పుట్టినప్పుడే తల్లి ప్రేమకు దూరమై.. పెంచి పెద్ద చేసిన నానమ్మ, తాతయ్యలకూ ఇప్పుడు దూరమైంది. వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆదిలాబాద్ రూరల్ : ఆదిలాబాద్ మండలం చాంద(టి) గ్రామానికి చెందిన పల్లవి(17) ఈ నెల 14న ఇంట్లోనే వేకువజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించి చికిత్స అందజేశారు. తండ్రి దేవిదాస్ ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. తన ఆత్మహత్యకు యువకుడి వేధింపులే కారణమని పల్లవి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వాంగ్మూలం ఇచ్చినట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ వైద్యుల సలహా మేరకు పల్లవిని అదే రోజు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందినా పరిస్థితి మెరుగు కాకపోవడంతో బుధవారం రాత్రి మృతిచెందింది. దీంతో చాందా(టి)లో విషాదం అలుముకుంది. గురువారం గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఫిర్యాదు చేసిన వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వేధింపులకు పాల్పడిన జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన యువకుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి ఇదివరకే రిమాండ్‌కు తరలించారు. పల్లవి జీవితమే విషాదం పల్లవి జీవితంలో అన్నీ విషాదాలే ఉన్నాయి. ఆమె పుట్టిన రెండు నెలలకే తల్లి మృతిచెందింది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసే తండ్రి దేవిదాస్ అప్పట్లోనే మరో వివాహం చేసుకోవడంతో పల్లవి తన తాతయ్య, నానమ్మ బాపురావు, లసుంబాయిల వద్దే పెరిగింది. వారు కూడా తల్లి లేని పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆమె జీవితంపై అందమైన కలలు కన్న వారికి ఒక్కసారిగా పల్లవి మృతి విషాదం నింపింది. ఆమె వివాహం తమ చేతులమీదుగా చేద్దామనుకున్న వారికి ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకవేళ ఆస్తి పంపకాలు చేస్తే తల్లి లేని పిల్ల పల్లవి వివాహంలో ఇబ్బందులు అవుతాయని భావించిన తాత, నానమ్మలు తమ ముగ్గురు కుమారులకు ఆస్తి పంపకాలు చేయకపోవడం ఇక్కడ వారి మమకారాన్ని స్పష్టం చేస్తోంది. ప్రేమ భూతానికి బలి.. పల్లవి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివేది. రోజు బస్సు, ఆటోల ద్వారా రాకపోకలు సాగించేది. ఈ క్రమంలో ఆదిలాబాద్ పట్టణంలో పల్లవిని చూసిన జైనథ్ మండలం లేఖర్వాడకు చెందిన చంద్రశేఖర్ తనను ప్రేమించాలని ఆమె వెంట పడ్డాడు. ఈ పరిణామాలతో పల్లవి మనోవేదనకు గురైంది. యువకుడు వేధిస్తున్నాడని ఇంట్లో తెలియజేయడంతో తండ్రి కానిస్టేబుల్ దేవిదాస్ ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఘటనకు ఐదు రోజులు ముందు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు దర్యాప్తులో పోలీసులు జాప్యం చేశారని పల్లవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. త్వరగా స్పందించి ఇలా జరిగేది కాదని వారి వాదన. మృత్యువుతో పోరాడి తిరిగిరాని లోకాలకు.. ప్రేమ వేధింపులకు మరో యువతి బలి చాంద(టి)లో విషాదం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు -
'పల్లవి'oచిన పాట
ఆమె గానం ‘పల్లవి’oచిన తొలిరాగమై పలకరిస్తుంది. ఆ పాటలోని మాధుర్యం నేరుగా మనసును తాకుతుంది. ఆమె ఉఛ్వాస నిశ్వాసాలు వేణుగానాలై మార్మోగుతాయి. వారసత్వంగా వచ్చిన సంగీతానికి ఊపిరిలూది గాత్రంతో పాటు వయొలిన్‌కు ప్రాణం పోస్తున్నారు గాయని చారుమతి పల్లవి. అనేక పోటీల్లో బహుమతులు అందుకుని ‘సంఝావాన్’ వీడియో ఆల్బమ్‌ను కూడా ఆమె రూపొందించారు. కేఎల్ విశ్వవిద్యాలయంలో బీబీఎం ఫైనలియర్ చదువుతున్న పల్లవి ఇటీవల విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో గాత్రం, వయొలిన్ కచేరీలు చేసి అందరి ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. చిన్నతనం నుంచే.. రాగం తానం పల్లవి.. సంగీతానికి ఇవి ప్రాణం. మా తల్లిదండ్రులు రాగం తానం అయితే పల్లవిని నా పేరులో చేర్చారు. బాల్యం నుంచి ఇంట్లో సంగీతం వినికిడి ఉండటంతో అప్పటి నుంచే ఎవరైనా పాడుతుంటే తాళం వేసేదాన్నట. అది గమనించి నాన్న గౌరీనాథ్ నన్ను సంగీతంలో ముంచారు. నా నాల్గో ఏటే పాడటం ప్రారంభించానట. నేను పాడిన మొట్టమొదటి గీతం మోహనరాగంలో ‘వరవీణా మృదుపాణి’. ప్రస్తుతం కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయంలో బీబీఎం ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. చదువులో టాప్‌లోనే ఉన్నాను. సంగీతం, చదువు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. అధ్యాపకులు, స్నేహితులు సహకరిస్తున్నారు. పోటీలే గెలుపు దివిటీలు అభ్యుదయ ఫౌండేషన్ వారు నిర్వహించిన పోటీలో వయొలిన్, గాత్రం రెండు విభాగాల్లోనూ బంగారు పతకం, కళాదర్శిని పోటీల్లో వరుసగా నాలుగేళ్లు మొదటి బహుమతి సంపాదించాను. ఎస్వీబీసీ వారి గీతాంజలి, ‘జి తెలుగు’ సరిగమప, పాటల పల్లకి, ఆలాపన, పాడుతా తీయగా, నాదవినోదం... వంటి పలు రియాలిటీ షోల్లో పాల్గొని అనేక బహుమతులు, ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాను. ప్రముఖుల ప్రశంసలు ఐదో తరగతి చదువుతున్నప్పుడు మా టీవీ ‘పాడాలని ఉంది’ లో మొట్టమొదటిసారిగా రియాలిటీ షోలో పాల్గొని ఫైనల్స్ వరకూ వెళ్లాను. ఏడో తరగతి చదువుతున్నప్పుడు రాష్ట్రస్థాయిలో ‘బాలరత్న’ అవార్డు పొందాను. ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో ‘రాసక్రీడ ఇక చాలు’ పాడినప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిలబడి తప్పట్లు కొట్టడం నా జీవితంలో నేను పొందిన అత్యున్నత సత్కారం. ఆయన స్పందనకు నేను ‘థాంక్యూ..’ అంటే, ఆయన ‘నువ్వు కాదు థాంక్స్ చెప్పాల్సింది. ఇంత మంచి యుగళగీతాన్ని పాడి సంతోషాన్ని ఇచ్చినందుకు నేనే నీకు థాంక్స్ చెప్పాలి’ అన్నారు. ప్రముఖ జాజ్ కళాకారులు శివమణి, సంగీత దర్శకుడు విద్యాసాగర్ ‘కర్ణాటక సంగీతం బ్యాక్‌గ్రౌండ్ ఉండటం వల్లే ఈ పాట పాడగలిగావు’ అన్నారు. ‘నీ ఉచ్ఛారణ బాగుంది. నువ్వు వెర్సటైల్ సింగర్వి..’ అని కితాబిచ్చారు నేపథ్యగాయని జమునారాణి. ‘శివుడి ముందు ఘంటానాదం మోగినట్లుంది నీ గొంతు’ అన్నారు తనికెళ్ల భరణి. ‘లలితభావనా’ పాట పాడినప్పుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖశర్మ ‘ఇప్పుడు చాలామంది తెలుగు పాటలే తప్పులతో పాడుతున్నారు. అటువంటిది సంస్కృత గీతాన్ని నువ్వు ఒక్క తప్పు లేకుండా పాడావు. చాలా సంతోషం’ అని ప్రశంసించారు. వయొలిన్ పైనా ఆసక్తి అంపోలు మురళీకృష్ణ దగ్గర, ఆ తరువాత పద్మశ్రీ కన్యాకుమారి దగ్గర వయొలిన్ నేర్చుకున్నాను. తమ్ముడు మృదంగం వాయిస్తాడు. అందువల్ల ఇంట్లోనే మృదంగంతో ప్రాక్టీస్ ఉంటుంది. అలాగే, నాన్నగారు పాడేటప్పుడు ఆయనకు పక్కవాద్యంగా వయొలిన్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. చెన్నై ‘శర్వాణి సంగీత సభ’లో నా మొట్టమొదటి వయొలిన్ కచేరీ ఇచ్చాను. ప్రస్తుతం ‘యామినీ చంద్రశేఖర’ సినిమాలో వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో పాడాను. ఆ సినిమా ఇంకా రిలీజ్ కావాలి. ఎప్పటికైనా బాంబే జయశ్రీలా కర్ణాటక సంగీతం పాడుతూ, సినీ సంగీతం కూడా పాడాలనేది నా కోరిక. -
నీటి గుంతలో పడి చిన్నారి మృతి
గోరంట్ల (అనంతపురం జిల్లా): నీటి గుంతలో పడి ఒక చిన్నారి మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా గోరంట్లలో బుధవారం జరిగింది. వివరాలు.. గోరంట్లలోని మోహన్‌రావునగర్‌కు చెందిన వేమనారాయణ, పుష్పలత దంపతుల కుమార్తె పల్లవి (2) ఆడుకుంటూ వెళ్లి సమీపంలోని నీటి గుంతలో పడింది. గమనించిన కుటుంబసభ్యులు బాలికను వెలికి తీసినా అప్పటికే ఆ చిన్నారి మృతిచెందింది. చిన్నారి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తా
చింతలపూడి : సినిమాల్లో మంచి అవకాశం వస్తే నటిస్తానని టీవీ సీరియల్ నటి ఆర్.పల్లవి అన్నారు. చింతలపూడి మండలం యర్రగుం టపల్లి రామునిగట్టుపై శ్రీరామనవమి వేడుకలకు శనివారం ఆమె హాజరయ్యూరు. కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణ రాముడిని దర్శిం చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తనది విజయవాడ అని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 2008లో టీవీ రంగంలో అడుగుపెట్టానన్నారు. ఆడదే ఆధారం, భార్యామణి, అత్తారింటికి దారేది సీరియళ్లలో నటిస్తున్నానని చెప్పారు. భవిష్యత్‌లోనూ మహిళలు మెచ్చే పాత్రలలో నటిస్తానన్నారు. పల్లెవాతావరణం అంటే తనకు ఇష్టమని, మూడేళ్లుగా రామునిగట్టుపై వేడుకలకు వద్దామనుకుంటున్నా.. ఈసారి వీలు కుదిరిందని పల్లవి చెప్పారు. -
స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి
కర్నూలు: కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతున్న గర్భిణీ శుక్రవారం మృతి చెందింది. హాలహర్వి మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన పల్లవి(20) స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఈనెల 3వ తేదీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. స్వైప్ పరీక్షలు నిర్వహించి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి శాంపిల్స్ పంపించారు. స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించినట్లు కర్నూలు ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. -
పండుగకు వచ్చి... విగతజీవులయ్యారు
అత్తిలి : పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడులో విషాదం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు..చివరికి చెరువులో శవాలై తేలారు. దుళ్ళ గ్రామానికి చెందిన వేల్పూరు రాంబాబు కుమారుడు మణికంఠ, తణుకు మండలం వేల్పూరుకు చెందిన కోటి చుక్కల నాగేంద్ర కుమార్ ఇద్దరు కుమార్తెలు పావని దుర్గ మహాలక్ష్మి, పల్లవిలు సంక్రాంతికి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. వీరంతా దగ్గరలోని గుడి దగ్గరకు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళనతో కుటుంబసభ్యుల వెతికారు. అయినా ఫలితం లేకపోవటంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు జరుపుతుండగనే..చిన్నారుల శవాలు చెరువులో లభ్యం కావడంతో వారి తల్లిదండ్రులు ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఇప్పటివరకూ ఓ చిన్నారి మృతదేహం వెలికి తీయగా, మిగతా ఇద్దరి మృతదేహాలు వెలికి తీస్తున్నారు. -
పల్లవిపై విషప్రయోగం..?
- పోస్టుమార్టం వివరాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు రెండ్రోజుల్లో తేలనున్న నిజం హుజూరాబాద్ :పట్టణంలోని విద్యానగర్‌లో శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన నామని పల్లవిపై విషప్రయోగం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఫ్యాన్ రెక్కకు ఉరి వేసుకుని మృతిచెందిందని ఆమె భర్త రాజు పోలీసులకు తెలిపిన విషయం తెలిసిందే. పల్లవి ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను హత్యచేసి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారని మృతురాలి తండ్రి నర్సింహులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్లవి శరీరంపై గాయాలు ఉండటం, ఈ సంఘటనపై అనుమానాలు తలెత్తడంతో మృతురాలి బంధువులు రాజు ఇంటిపై దాడిచేశారు. ఆదివారం పల్లవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సాయంత్రం 6గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మృతదేహాన్ని పరిశీలన చేసి ఆ తర్వాత వైద్యబృందం పోస్టుమార్టం చేశారు. పల్లవి నోరు, ముక్కు నుంచి తెల్లని నురుగలు రావడం, ఆమె శరీరంలోని కొన్ని భాగాలు నల్లగా మారడంతో వైద్యులు మరింత దృష్టి సారించినట్లు తెలిసింది. తలపై వెంట్రుకలు తొలగించి అణువణువు పరీక్షించినట్లు సమాచారం. అయితే నురగలు కక్కడంతో పల్లవిపై విషప్రయోగం జరిగిందని ఆమె తరపు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. వైద్యులు పోస్టుమార్టం వివరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిసింది. మరో రెండు రోజులు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దాడి చేసిన వారిపై కేసు నమోదు... పల్లవిని చంపారని ఆరోపిస్తూ రాజు ఇంటిపై దాడిచేసి, వస్తువులను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో పలువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. నామని రాజు బావ పేరాల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందికట్ల మదుసుధన్, బచ్చు శివశంకర్, దీకొండ కృష్ణ, దీకొండ రాజేందర్, శ్రీనివాస్, తిరుపతి, నర్సమ్మ మరికొందరు మహిళలపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
కడతేరిన కుటుంబం
అగ్రరాజ్యంలో ఓ ప్రవాస భారతీయ జంట అనుమానాస్పద పరిస్థితుల్లో కడతేరిపోయింది. కొడుకు పోయిన విషాదం నుంచి తేరుకోకముందే భార్యాభర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరి మరణానికి గల కారణాలు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ హృదయ విదారక ఘటన టెక్సాస్ లోని ఫ్రిస్కోలో చోటుచేసుకుంది. సుమీత్ ధావన్(43), పల్లవి(39) భార్యాభర్తలు. వీరికి అర్నవ్ అనే పదేళ్ల కొడుకు ఉండేవాడు. అనారోగ్య సమస్యలతో బాధపడే అర్నవ్ ను ఎప్పుడు ఒక మనిషి కనిపెట్టుకుని చూడాల్సివచ్చేది. ఈ ఏడాది జనవరిలో ఆర్నావ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నానాల గదిలో బాత్ టబ్‌లో ఐస్ గడ్డలతో కప్పబడిన అతడి మృతదేహం వెలుగుచూసింది. అర్నవ్ అనారోగ్యం కారణంగానే చనిపోయాడని, విదేశాలకు వెళ్లిన సుమీత్ తిరిగివచ్చే వరకు ఉంచాలన్న ఉద్దేశంతో అర్నవ్ మృతదేహాన్ని ఐస్ లో పెట్టానని పల్లవి పేర్కొంది. హిందూ ధర్మం ప్రకారం అతడి కర్మకాండలు జరిపించాలన్న ఉద్దేశంతో తానీ పనిచేసినట్టు పేర్కొంది. అయితే టెక్సాస్ లో ఉంటున్న సుమీత్ తోబుట్టువులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న ప్రశ్నకు పల్లవి వద్ద సమాధానం లేదు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి ప్రశ్నించారు. అర్నవ్ హత్య చేశారా అన్న ప్రశ్నకు పల్లవి అవును అన్నట్టుగా తలవూపిందని పోలీసులు పేర్కొన్నారు. తమ ఒక్కగానొక్క కొడుకుని ఎప్పుడు చిన్నదెబ్బ కూడా వేయని పల్లవి హత్య చేసిందంటే తనకు నమ్మశక్యంగా లేదని సుమీత్ వాపోయాడు. ఈ కేసు విచారణ నడుస్తుండగానే సుమీత్, పల్లవి తమ నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్విమ్మింగ్ పూల్ లో పల్లవి శవమై తేలగా, సుమీత్ తలపై గాయంతో తన గదిలో నిర్జీవ స్థితిలో కనిపించాడు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా, మరేదైన కారణం ఉందా అనేది ఇంకా తేలలేదు. వీరి ఇంట్లో దొరికిన నోట్ లో ఏముందో వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. ఏదేమైనా ఓ విషాదం ప్రవాస కుటుంబాన్ని కడతేర్చింది. -
ముగ్గురు విద్యార్థినుల అనుమానాస్పద మృతి
తాడేపల్లి: విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారి మృతదేహాలు గుంటూరు జిల్లా సీతానగరం సమీపంలోని కృష్ణానదిలో ఆదివారం తెల్లవారు జామున కనిపించాయి. రెండు జిల్లాల్లో కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి చెందిన సరిపూడి పూజిత(17), తాడిగడపకు చెందిన యలమంచిలి నాగలక్ష్మి(17), పెనమలూరుకు చెం దిన బిళ్లా పల్లవి(17) విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరంతా కలసి ఒకే బస్సులో వెళ్లి వస్తుండేవారు. ఎప్పటి మాదిరిగానే శనివారం ఉదయం వారు కాలేజికి వెళ్లి తిరిగిరాలేదు. కానీ వారి పుస్తకాల బ్యాగ్ లు సీతానగరం సమీపంలోని నది ఒడ్డున శనివారం రాత్రి పోలీసులకు లభ్యమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున వారి మృత దేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. ఈ ముగ్గురు బాలికలు రెండు రోజుల నుంచి కళాశాలకు హాజరు కాలేదని చెబుతున్నారు. వారు ఇళ్లకు రాకపోయేసరికి తల్లిదండ్రులు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి ఆచూకీ కోసం వాకబు చేశామని చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం చేసుకున్నట్లు వారి బ్యాగుల్లో లభిం చిన దర్శనం టికెట్ల ద్వారా తెలుస్తోంది. శనివా రం సాయంత్రం వారు ఇసుక తిన్నెల్లో కనిపించినట్టు స్థాని కుల సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టు ఆదేశాల మేరకే రంభపై కేసు: డీసీపీ
-
అది తప్పుడు కేసు: రంభ సోదరుడు
తన భార్య పల్లవి పెట్టినది తప్పుడు కేసని, తమ ఇంట్లో ఉన్న వజ్రాల నగలు, పిల్లలను తీసుకుని ఆమె ఫిబ్రవరి 3వ తేదీన చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లిపోతే.. 4వ తేదీన తమ తండ్రి చెన్నైలో కేసు నమోదు చేశారని రంభ సోదరుడు శ్రీనివాస్ తెలిపారు. తన భార్య పెట్టిన వరకట్నం వేధింపుల కేసు విషయమై ఆయన 'సాక్షి'తో మాట్లాడారు. కెనడాలోని టొరంటోలో ఉన్న తాను ఈ విషయం తెలిసి ఫిబ్రవరి 12వ తేదీన వచ్చానన్నారు. దొంగతనం కేసును తప్పుదోవ పట్టించడానికే ఇప్పుడీ వరకట్నం కేసు పెట్టారని ఆయన అన్నారు. తమకు పెళ్లయ్యి 15 సంవత్సరాలు అయ్యిందని, పెద్ద కొడుకుకు 14 ఏళ్లు, చిన్న కుమారుడికి 10 ఏళ్లు ఉన్నాయని తెలిపారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని వేధింపులు ఇప్పుడే ఎలా గుర్తుకొచ్చాయని శ్రీనివాస్ ప్రశ్నించారు. తాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా, తనను అరెస్టు చేయకూడదని కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన వివరించారు. 1999లో పల్లవితో తనకు పెళ్లయ్యే సరికి వాళ్లు అద్దె ఇంట్లో ఉండేవారని, ఇప్పుడు వాళ్లకు ఒక బంగ్లా, మూడు ఫ్లాట్లు ఎక్కడినుంచి వచ్చాయని ఆయన అడిగారు. అసలు వాళ్లు ఏ రూపంలో కట్నం ఇచ్చారో రుజువు చేయాలన్నారు. తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని, అయితే 498ఎ సెక్షన్‌ను ఇలా దుర్వినియోగం చేయడం మాత్రం సరికాదని ఆయన చెప్పారు. -
కోర్టు ఆదేశాల మేరకే రంభపై కేసు: డీసీపీ
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ నటి రంభ సోదరుడు శ్రీనివాస్ వెంకటేశ్వర్రావు భార్య పల్లవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వెస్ట్ జోన్ డీసీసీ సత్యనారాయణ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు రంభ, తల్లిదండ్రులు, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. త్వరలోనే వారికి నోటీసులు పంపుతామని వెల్లడించారు. వారి వాంగ్మూలాన్ని తీసుకుంటామని చెప్పారు. కేసుపై అన్నివైపుల విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పల్లవి భర్త శ్రీనివాస్‌తో పాటు రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వర్రావుపై బంజారాహిల్స్ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
'పబ్లిసిటీ కోసమే నాపై, రంభపై ఆరోపణలు'
చెన్నై : పబ్లిసిటీ కోసమే తన భార్య పల్లవి ఆరోపణలు చేస్తోందని సినీనటి రంభ సోదరుడు శ్రీనివాస్ వెంకటేశ్వర్రావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ రంభపై ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని అన్నారు. పల్లవి కుటుంబ సభ్యులే వెనకుండి ఆమెను ఆడిస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. కాగా కొంతకాలంగా భర్త శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచు రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వర్రావు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ బంజారాహిల్స్ నివాసి పల్లవి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేసిన పోలీసులు రంభతో పాటు ఆమె భర్త శ్రీనివాస్, అత్తా మామలపై ఐపీసీ సెక్షన్ 498(ఎ) కింద కేసు నమోదు చేశారు. -
సినీ నటి రంభ కుటుంబ సభ్యులపై కేసు
-
సినీ నటి రంభ కుటుంబ సభ్యులపై కేసు
హైదరాబాద్: సినీ నటి రంభ కుటుంబ సభ్యులపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. రంభ సోదరుడు శ్రీనివాస్ భార్య పల్లవి ఈ కేసు పెట్టారు. అదనపు కట్నం కోసం తనను అత్తింటివారు వేధిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా శ్రీనివాస్ పై కేసు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, వ్యాపారవేత్త ఇంద్రకుమరన్‌ని రంభ పెళ్లి చేసుకున్న కెనడాలో ఉంటున్నారు. వీరికి ‘లాన్య’ అనే పాప ఉంది. అయితే భర్త నుంచి రంభ విడాకులు తీసుకోనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను సీనియర్ నటి కుష్బూ ఖండించారు. రంభ చక్కగా కాపురం చేసుకుంటోందని ఆమె తెలిపారు. రంభ గురించి అలాంటి ప్రచారం చేయొద్దు: కుష్బూ -
అనుకోకుండా నటినయ్యాను
సినీ తారలకు దీటుగా బుల్లి తెర నటులు రాణిస్తున్నారు. తమదైన నటనతో ప్రేక్షకుల మనసును దోచేస్తున్నారు. అలాంటి వారిలో పల్లవి ఒకరు. భార్యామణి సీరియల్లో అలేఖ్యగా సుపరిచుతురాలైన పల్లవి.. ఆడదే ఆధారం అంటూ తన నటనతో అనతి కాలంలోనే మహిళల అభిమానాన్ని సొంతం చేసుకుంది. బుధవారం బీబీనగర్ మండలం చత్రఖానిగూడెంలో నిర్వహిస్తున్న భార్యామణి సీరియల్ షూటింగ్లో పాల్గొంది. సింగర్ కావాలనుకుని.. అనుకోకుండా నటినయ్యాయని పేర్కొంటున్న పల్లవి అంతరంగం... అందరూ పిలిచే పేరు అలేఖ్య, అమృత స్వస్థలం విజయవాడ ప్రస్తుత నివాసం హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ విద్యార్హత సోషాలజీ పూర్తి(చిన్ననాటి నుంచి హైదరాబద్‌లోనే చదువుకున్నాను) కుటుంబ నేపథ్యం మాది మధ్య తరగతి కుటుంబం. నేను ఒక్కదాన్నే. నాన్న నాగేశ్వరరావు, అమ్మ లలిత. ఇష్టమైన దైవం సాయిబాబా. ప్రతి పుట్టిన రోజు శిర్డీకి వెళ్తా. ఇష్టమైన వంటకాలు హైదరాబాద్ బిర్యానీ నటిస్తున్న సీరియల్స్ ప్రస్తుతం భార్యామణి, ఆడదే ఆధారం సీరి యల్స్‌లో నటిస్తున్నాను. మరికొన్ని సీరియల్స్‌లో నటించే అవకాశం లభించింది. సిని మాలలో సైతం ఆపర్లు వచ్చాయి. ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ సమయం లేక వదులుకున్నా. పేరు తెచ్చిన పాత్రలు అలేఖ్య, అమృత అవార్డు.. రివార్డులు 2012లో భార్యామణి సీరియల్‌కు గాను నంది అవార్డు లభించింది. ఆడదే ఆధారం సీరియల్‌కు బెస్ట్ యాక్టర్‌గా 15అవార్డులు వచ్చాయి. పాఠశాల, కళాశాల స్థాయిల్లో సింగర్‌గా అనేక బహుమతులు గెలుపొందా. యువతకు మీరు ఇచ్చే సందేశం.. సింగర్ కావాలనుకున్నా.. కానీ నటినయ్యాను. గతంలో ఎలాంటి అనుభవం లేకపోయినా బుల్లి తెరకు వచ్చాక నటించడం నేర్చుకుని స్వశక్తితో ఎదుగుతున్నా. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోయినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నాను. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉటుంది. అందివచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ ఉన్నత స్థాయి కి ఎదిగేం దుకు కృషి చేయాలి. -
ముద్దుగా మూవీ వాల్‌పోస్టర్స్
-
'బేషరమ్' చిత్ర మీడియా సమావేశంలో రణబీర్, పల్లవి