కళ్లలో కారం చల్లి.. కత్తితో పొడిచి | Shocking Facts Revealed In Karnataka Ex-DGP Om Prakash Death Case, Wife And Daughter Arrested | Sakshi
Sakshi News home page

కళ్లలో కారం చల్లి.. కత్తితో పొడిచి

Apr 22 2025 6:10 AM | Updated on Apr 22 2025 9:32 AM

Wife and daughter arrested on Karnataka ex-DGP Om Prakash case

బనశంకరి: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌(68) హత్య కేసులో నిజాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఆదివారం ఉదయం ఓం ప్రకాశ్‌ నివాసంలో భార్య పల్లవి, కుమార్తె కృతిని హత్య నేరం కింద పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. విచారణలో పల్లవి ప్రధాన నిందితురాలని వెల్లడైందని పోలీసులు తెలిపారు. భర్త ఓం ప్రకాశ్‌ కళ్లలో కారం చల్లి, కత్తితో పలుమార్లు పొడిచి చంపినట్లు ఆమె ఒప్పుకున్నట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. 

కర్ణాటకలోని దండేలిలో ఉన్న భూమి విషయంలో ఓం ప్రకాశ్‌ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. శనివారం రాత్రి వారి మధ్య భోజనం చేస్తున్న సమయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆవేశంతో ఉన్న పల్లవి భర్త ముఖంపై కారం చల్లింది. మంటతో ఆయన విలవిల్లాడుతుండగా ఇదే అదనుగా పలుమార్లు ఆయన్ను కత్తితో పొడిచి చంపేసింది. అనంతరం తన ఫ్రెండ్‌కు వీడియో కాల్‌ చేసి, ‘ఆ రాక్షసుడిని చంపేశాను’అని చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. 

బిహార్‌కు చెందిన 1981 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఓం ప్రకాశ్‌ బెంగళూరు నగరంలోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లోని మూడంతస్తుల సొంతింట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా ఆదివారం పోలీసులు గుర్తించడం తెల్సిందే. కొన్ని నెలల క్రితం పల్లవి స్థానిక హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి, భర్తపై ఫిర్యాదుకు ప్రయతి్నంచింది. అధికారులు నిరాకరించడంతో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగింది. స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధితో 12 ఏళ్లుగా బాధపడుతున్న పల్లవి ప్రస్తుతం చికిత్స చేయించుకుంటోందని సమాచారం. ఇక, ఓం ప్రకాశ్‌కు ఓ అధ్యాపకురాలితో అక్రమ సంబంధం ఉందని, అది కూడా కుటుంబ కలహాలకు కారణమైందని తెలుస్తోంది.  

ఓం ప్రకాశ్‌ హత్య ఘటనపై ఆయన కుమారుడు కార్తికేశ్‌ స్పందించారు. తల్లి, సోదరి పైనే ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘వారం రోజులుగా మా నాన్నను చంపేస్తానంటూ మా అమ్మ బెదిరిస్తూ వస్తోంది. ఈ బెదిరింపుల భయంతోనే ఆయన సొంత సోదరి ఇంట్లో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం నా సోదరి కృతి అక్కడికి వెళ్లి బలవంతంగా ఆయన్ను ఇక్కడికి తీసుకువచి్చంది. 

ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో డొమ్లుర్‌లోని కర్నాటక గోల్ఫ్‌ అసోసియేషన్‌ వద్ద ఉండగా నాకు సమాచారం వచ్చింది. ఇంట్లో మా నాన్న రక్తపు మడుగులో పడి ఉన్నాడని..’అని కార్తికేశ్‌ తెలిపారు. ‘అక్కడికి వెళ్లే సరికి తల, శరీరంపై తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. పక్కనే పగిలిన సీసా, కత్తి పడి ఉన్నాయి. తర్వాత ఆయన్ను సెయింట్‌ జాన్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు’అని వివరించారు. నాన్నతో అమ్మ పల్లవి, సోదరి కృతి తరచూ గొడవపడుతున్నారు. ఆయన హత్యలో వీరిద్దరిపైనే నాకు ఎక్కువ అనుమానాలున్నాయి. వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి’అని ఆయన పోలీసులకిచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement