Kriti
-
కళ్లలో కారం చల్లి.. కత్తితో పొడిచి
బనశంకరి: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(68) హత్య కేసులో నిజాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఆదివారం ఉదయం ఓం ప్రకాశ్ నివాసంలో భార్య పల్లవి, కుమార్తె కృతిని హత్య నేరం కింద పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. విచారణలో పల్లవి ప్రధాన నిందితురాలని వెల్లడైందని పోలీసులు తెలిపారు. భర్త ఓం ప్రకాశ్ కళ్లలో కారం చల్లి, కత్తితో పలుమార్లు పొడిచి చంపినట్లు ఆమె ఒప్పుకున్నట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలోని దండేలిలో ఉన్న భూమి విషయంలో ఓం ప్రకాశ్ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. శనివారం రాత్రి వారి మధ్య భోజనం చేస్తున్న సమయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆవేశంతో ఉన్న పల్లవి భర్త ముఖంపై కారం చల్లింది. మంటతో ఆయన విలవిల్లాడుతుండగా ఇదే అదనుగా పలుమార్లు ఆయన్ను కత్తితో పొడిచి చంపేసింది. అనంతరం తన ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి, ‘ఆ రాక్షసుడిని చంపేశాను’అని చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. బిహార్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని మూడంతస్తుల సొంతింట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా ఆదివారం పోలీసులు గుర్తించడం తెల్సిందే. కొన్ని నెలల క్రితం పల్లవి స్థానిక హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, భర్తపై ఫిర్యాదుకు ప్రయతి్నంచింది. అధికారులు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధితో 12 ఏళ్లుగా బాధపడుతున్న పల్లవి ప్రస్తుతం చికిత్స చేయించుకుంటోందని సమాచారం. ఇక, ఓం ప్రకాశ్‌కు ఓ అధ్యాపకురాలితో అక్రమ సంబంధం ఉందని, అది కూడా కుటుంబ కలహాలకు కారణమైందని తెలుస్తోంది. ఓం ప్రకాశ్ హత్య ఘటనపై ఆయన కుమారుడు కార్తికేశ్ స్పందించారు. తల్లి, సోదరి పైనే ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘వారం రోజులుగా మా నాన్నను చంపేస్తానంటూ మా అమ్మ బెదిరిస్తూ వస్తోంది. ఈ బెదిరింపుల భయంతోనే ఆయన సొంత సోదరి ఇంట్లో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం నా సోదరి కృతి అక్కడికి వెళ్లి బలవంతంగా ఆయన్ను ఇక్కడికి తీసుకువచి్చంది. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో డొమ్లుర్లోని కర్నాటక గోల్ఫ్ అసోసియేషన్ వద్ద ఉండగా నాకు సమాచారం వచ్చింది. ఇంట్లో మా నాన్న రక్తపు మడుగులో పడి ఉన్నాడని..’అని కార్తికేశ్ తెలిపారు. ‘అక్కడికి వెళ్లే సరికి తల, శరీరంపై తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. పక్కనే పగిలిన సీసా, కత్తి పడి ఉన్నాయి. తర్వాత ఆయన్ను సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు’అని వివరించారు. నాన్నతో అమ్మ పల్లవి, సోదరి కృతి తరచూ గొడవపడుతున్నారు. ఆయన హత్యలో వీరిద్దరిపైనే నాకు ఎక్కువ అనుమానాలున్నాయి. వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి’అని ఆయన పోలీసులకిచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
నమస్తే... కోహ్–నీ–చీ–వా... అనియో
హిందీ, బెంగాలీ, అస్సామీ, కొరియన్, జపనీస్, ఇంగ్లీష్... ఆరు భాషలు అనర్గళంగా మాట్లాడుతూ నెటిజనుల చేత ‘వావ్’ అనిపిస్తోంది కంటెంట్ క్రియేటర్ కృతి. జపాన్‌లో ఉంటున్న కృతి జపనీస్ కల్చర్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తుంటుంది. ‘మల్టీలింగ్వల్ ఇండియన్ గర్ల్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 14.1 మిలియన్లు అంటే కోటీ నలభై ఒక్క లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఒక్క భాష నేర్చుకోవడానికే ఆపపోపాలు పడుతుంటాం. అలాంటిది చిన్న వయసులోనే కృతి ఆరు భాషలు అవలీలగా మాట్లాడడం అపూర్వంగా ఉంది’ అంటూ నెటిజనులు స్పందించారు. ఇద్దరు సౌత్ కొరియన్ కంటెంట్ క్రియేటర్లు బెంగాలీ బేషుగ్గా మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయింది. ఆ ఇద్దరిలో ఒకరు హోటల్లో పనిచేస్తాడు. హోటల్‌కు వచ్చే బెంగాలీ గెస్ట్‌ల సహాయంతో ఆ భాష నేర్చుకున్నాడు. -
నిర్మాతగా మారిన బాలీవుడ్ నటి
‘పింక్’, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్స్’, ‘మిషన్ మంగళ్’ వంటి హిందీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు కృతీ కుల్హారీ. అయితే ఆమె నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. అంతేకాదు.. తన నిర్మాణ సంస్థలోని తొలి సినిమాలో ఆమె లీడ్‌రోల్ చేస్తున్నారు. అజకిరన్నైర్ దర్శకత్వంలో ‘నయేక’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కృతీది పోలీసాఫీసర్ పాత్ర. ‘‘2022లో నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాను. కొత్త ప్రతిభావంతులకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు కృతీ. -
ఆ సినిమాను యూట్యూబ్ లో చూడలేరు!
ముంబై: మనోజ్ బాజపేయి, రాధిక ఆప్టే నటించిన షార్ట్ ఫిలిమ్ 'కృతి' యూట్యూబ్ నుంచి తొలగించారు. కాపీ రైట్ వివాదం తలెత్తడంతో ఈ సినిమాను యూట్యూబ్ తొలగించింది. ఈ విషయాన్ని దర్శకుడు శిరీష్ కుందర్ ధ్రువీకరించారు. యూట్యూబ్ నుంచి తమ సినిమాను తొలగించారని ట్వీట్ చేశారు. తమకు మద్దతుగా నిలిచినందుకు ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'కృతి' షార్ట్ ఫిలిమ్ ను యూట్యూబ్ లో 25 లక్షల మంది వీక్షించారు. 18 నిమిషాల నిడివున్న ఈ సినిమాను యూట్యూబ్ లో జూన్ 22న విడుదల చేశారు. తన షార్ట్ ఫిలిమ్ 'బాబ్'ను కాపీ కొట్టి 'కృతి' తీశారని నేపాల్ దర్శకుడు అనీల్ న్యుపనె ఆరోపించడంతో వివాదం రేగింది. 'కృతి' కంటే ఏడు నెలల ముందే 'బాబ్' తీశానని వెల్లడించాడు. అనీల్ న్యుపనె ఆరోపణలను శిరీష్ తోసిపుచ్చాడు. తనపై ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అతడికి లీగల్ నోటీసు పంపాడు. -
దర్శకుడికి లీగల్ నోటీసు
ముంబై: నేపాల్ దర్శకుడు అనీల్ న్యుపనెకు 'కృతి' షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ శిరీష్ కుందర్ లీగల్ నోటీసు ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకముందు ఎటువంటి కామెంట్స్ చేయరాదని హెచ్చరించారు. 'కృతి' బాగుదంటూ సోషల్ మీడియాలో ప్రముఖులు ప్రశంసించారు. అయితే తన షార్ట్ ఫిలిమ్ 'బాబ్'ను కాపీ కొట్టి 'కృతి' తీశారని అనీల్ న్యుపనె ఆరోపించాడు. దీంతో స్పందించిన శిరీష్ తన లాయర్ ద్వారా లీగల్ నోటీసు పంపాడు. తమ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తైందని, జూన్ 22న యూట్యూబ్ లో విడుదల చేశామని శిరీష్ తెలిపాడు. 'బాబ్' షార్ట్ ఫిలిమ్ మే 12న యూట్యూబ్ లో పెట్టారని వెల్లడించారు. రెండు సినిమాలకు సారూప్యత ఉన్నంత మాత్రానా కాపీ కొట్టారని ఆరోపణలు సమంజసం కాదని పేర్కొన్నారు. 'కృతి' సినిమా బాగుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. -
నా ఫిలింను కాపీ కొట్టారు
బాలీవుడ్ తారలు మనోజ్ వాజ్‌పేయి, రాధికా ఆప్టే, నేహా శర్మలో దర్శకుడు శిరీష్ కుందర్ తీసిన షార్ట్ ఫిలిం కృతి ఓ వివాదంలో చిక్కుకుంది. పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతున్న ఈ షార్ట్ ఫిలింను.. తన షార్ట్ ఫిలిం బాబ్ను కాపీ కొట్టి తీశారని నేపాల్‌కు చెందిన దర్శకుడు అనీల్ న్యుపనె ఆరోపిస్తున్నాడు. బాబ్ ఏడు నెలల క్రితం విడుదలైనట్టు అనీల్ తెలిపాడు. ఇందులోని పాత్రలు, కథాంశంతోనే కృతిని తీసినట్టు చెప్పాడు. అయితే యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందని అన్నాడు. తన షార్ట్ ఫిలింకు, దీనికి ఎన్నో సారూప్యతలు ఉన్నాయని, కృతి షార్ట్ ఫిలింను చూసి షాకయ్యానని చెప్పాడు. -
షార్ట్‌ఫిలింలో నటిస్తున్న సూపర్ స్టార్లు!
ముంబై: ఒకప్పుడు షార్ట్ఫిలింలంటే చులకన భావం ఉండేది. సినిమాల కంటే నిడివి తక్కువగా ఉండే వీటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. షార్ట్ ఫిలింలు అంటే డాక్యుమెంటరీలు అన్న భావన ఉండేది. ఇంటర్నెట్, సోషల్ మీడియా రాకతో ఇది పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ హీరోయిన రాధికా ఆఫ్టే ఇటీవల షార్ట్ ఫిలిం 'అహల్య'తో సంచలనం సృష్టించింది. ఈ ష్టార్ఫిలిం ఇటు వీక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలందుకుంది. తాజాగా డైరెక్టర్ శిరీష్ కుందర్ కూడా ఇలాంటి ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నాడు. మనోజ్ బాజ్‌పేయి, రాధికా ఆఫ్టే వంటి బాలీవుడ్ స్టార్లతో 'క్రితి' అనే చిన్న సినిమాను ఆయన నిర్మిస్తాడు. 15 నిమిషాల నిడిమి మాత్రమే ఉండే ఈ సినిమా ఓ సైకాలజికల్ థ్రిల్లర్. ఇందులో హీరోయిన్ నేహా శర్మ కూడా ఓ పాత్రలో కనిపిస్తుంది. 2006లో జానేమన్ సినిమా తీసిన శీరిష్.. ఈ పొట్టి చిత్రంతో షార్ట్‌ఫిలిం రంగంలోకి అడుగుపెడుతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కన్నా షార్ట్ఫిలింలోనే సబ్జెక్ట్‌ను నేరుగా చెప్పే స్కోప్ ఎక్కువగా ఉంటుందని ఆయన అంటున్నాడు. ఉత్కంఠ కలిగించే ఎక్సైటింగ్ స్టోరీలను చెప్పడానికి షార్ట్‌ఫిలింలు ఎంతోగానో ఉపయోగపడతాయని, ఇందుకు అందుబాటులో ఉన్న డిజిటల్ స్పేస్ ఎంతగానో తోడ్పాటు అందిస్తోందని ఆయన అంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు నిర్మించేందుకు, వాటిని విడుదలచేసేందుకు ఎంతగానో సమయం పడుతుందని, ఇబ్బందులూ ఎదురవుతాయని, షార్ట్‌ఫిలింలకు ఆ చిక్కులు లేవని ఆయన చెప్పారు. గతంలో పలు షార్ట్ ఫిలింలలో నటించిన రాధిక, మనోజ్ తొలిసారి ఈ ప్రాజెక్టు కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ షార్ట్ ఫిలిం సెట్‌పైకి వెళ్లనుంది. ఏప్రిల్ 22న విడదల కానుంది.