నా ఫిలింను కాపీ కొట్టారు | Kriti, Starring Radhika Apte, Copied From My Film, Alleges Filmmaker | Sakshi
Sakshi News home page

నా ఫిలింను కాపీ కొట్టారు

Jun 24 2016 7:36 PM | Updated on Sep 4 2017 3:18 AM

నా ఫిలింను కాపీ కొట్టారు

నా ఫిలింను కాపీ కొట్టారు

బాలీవుడ్ తారలు మనోజ్ వాజ్పేయి, రాధికా ఆప్టే, నేహా శర్మలో దర్శకుడు శిరీష్ కుందర్ తీసిన షార్ట్ ఫిలిం కృతి ఓ వివాదంలో చిక్కుకుంది.

బాలీవుడ్ తారలు మనోజ్ వాజ్పేయి, రాధికా ఆప్టే, నేహా శర్మలో దర్శకుడు శిరీష్ కుందర్ తీసిన షార్ట్ ఫిలిం కృతి ఓ వివాదంలో చిక్కుకుంది. పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతున్న ఈ షార్ట్ ఫిలింను.. తన షార్ట్ ఫిలిం బాబ్ను కాపీ కొట్టి తీశారని నేపాల్కు చెందిన దర్శకుడు అనీల్ న్యుపనె ఆరోపిస్తున్నాడు.

బాబ్ ఏడు నెలల క్రితం విడుదలైనట్టు అనీల్ తెలిపాడు. ఇందులోని పాత్రలు, కథాంశంతోనే కృతిని తీసినట్టు చెప్పాడు. అయితే యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందని అన్నాడు. తన షార్ట్ ఫిలింకు, దీనికి ఎన్నో సారూప్యతలు ఉన్నాయని, కృతి షార్ట్ ఫిలింను చూసి షాకయ్యానని చెప్పాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement