దర్శకుడికి లీగల్ నోటీసు | Shirish Kunder responds to plagiarism claim with legal action | Sakshi
Sakshi News home page

దర్శకుడికి లీగల్ నోటీసు

Jun 27 2016 7:46 PM | Updated on Sep 4 2017 3:33 AM

దర్శకుడికి లీగల్ నోటీసు

దర్శకుడికి లీగల్ నోటీసు

నేపాల్ దర్శకుడు అనీల్ న్యుపనెకు 'కృతి' షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ శిరీష్ కుందర్ లీగల్ నోటీసు ఇచ్చారు.

ముంబై: నేపాల్ దర్శకుడు అనీల్ న్యుపనెకు 'కృతి' షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ శిరీష్ కుందర్ లీగల్ నోటీసు ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకముందు ఎటువంటి కామెంట్స్ చేయరాదని హెచ్చరించారు. 'కృతి' బాగుదంటూ సోషల్ మీడియాలో ప్రముఖులు ప్రశంసించారు. అయితే తన షార్ట్ ఫిలిమ్ 'బాబ్'ను కాపీ కొట్టి 'కృతి' తీశారని అనీల్ న్యుపనె ఆరోపించాడు.

దీంతో స్పందించిన శిరీష్ తన లాయర్ ద్వారా లీగల్ నోటీసు పంపాడు. తమ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తైందని, జూన్ 22న యూట్యూబ్ లో విడుదల చేశామని శిరీష్ తెలిపాడు. 'బాబ్' షార్ట్ ఫిలిమ్ మే 12న యూట్యూబ్ లో పెట్టారని వెల్లడించారు. రెండు సినిమాలకు సారూప్యత ఉన్నంత మాత్రానా కాపీ కొట్టారని ఆరోపణలు సమంజసం కాదని పేర్కొన్నారు. 'కృతి' సినిమా బాగుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement