
– బషీర్ ఆలూరి
‘‘తెలుగులో ‘సమరం’, కన్నడంలో ఓ సినిమా చేశాను. నా మూడో సినిమా ‘6 జర్నీ’. ఆరుగురి జీవిత ప్రయాణమే ఈ చిత్రం. గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి, ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఓ బ్యాచ్ కథే ‘6 జర్నీ’’ అని డైరెక్టర్ బషీర్ ఆలూరి అన్నారు. రవిప్రకాశ్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘6 జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో పాల్యం రవిప్రకాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు బషీర్ ఆలూరి మాట్లాడుతూ– ‘‘టెర్రరిజం, దేశభక్తి వంటి అంశాలు మా ‘6 జర్నీ’లో ఉంటాయి. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? యువత ఎలా ΄ోరాడాలి? అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా క్లైమాక్స్‌ను తెరకెక్కించాను. మంచి కథాంశంతో తీసిన ‘6 జర్నీ’ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ముంబై నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నాను. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు.