breaking news
6Journey Movie
-
ఆరుగురి ప్రయాణమే ఈ సినిమా
‘‘తెలుగులో ‘సమరం’, కన్నడంలో ఓ సినిమా చేశాను. నా మూడో సినిమా ‘6 జర్నీ’. ఆరుగురి జీవిత ప్రయాణమే ఈ చిత్రం. గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి, ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఓ బ్యాచ్ కథే ‘6 జర్నీ’’ అని డైరెక్టర్ బషీర్ ఆలూరి అన్నారు. రవిప్రకాశ్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘6 జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో పాల్యం రవిప్రకాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు బషీర్ ఆలూరి మాట్లాడుతూ– ‘‘టెర్రరిజం, దేశభక్తి వంటి అంశాలు మా ‘6 జర్నీ’లో ఉంటాయి. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? యువత ఎలా ΄ోరాడాలి? అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా క్లైమాక్స్‌ను తెరకెక్కించాను. మంచి కథాంశంతో తీసిన ‘6 జర్నీ’ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ముంబై నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నాను. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. -
టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో ‘6జర్నీ’
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘6జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బసీర్ ఆలూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 9న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు బసీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డాను. ఇది వరకు తెలుగులో సమరం, కన్నడలో మరో చిత్రాన్ని చేశాను. ఇప్పుడు నా మూడో సినిమా 6 జర్నీ అంటూ ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. ఇది ఆరుగురి జీవిత ప్రయాణం. గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి సూసైడ్ చేసుకోవాలని అనుకునే ఓ బ్యాచ్ కథే ‘6జర్నీ’. అలాంటి వారి ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథ.→ సమీర్, పల్లవి జంట అద్భుతంగా నటించింది. కొత్త అబ్బాయి విలన్‌గా అభిరాం చక్కగా నటించారు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త ఫైట్ మాస్టర్ ఇలా అందరూ అద్భుతంగా పని చేశారు. నిర్మాతది మా ఊరే. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఈ కథ ఆయనకు నచ్చడంతో ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది.→ వర్షాకాలంలో ఈ మూవీ షూటింగ్ చేశాం. షూటింగ్ సమయంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. ప్రకృతి మాకు ఎంతో సహకరించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా షూటింగ్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశాం.→ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎన్ సింహా మంచి పాటల్ని ఇచ్చారు. మంచి సంగీతం, మంచి పాటలు ఉన్నాయి. ఆల్రెడీ మా పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.→ క్లైమాక్స్ చాలా గొప్పగా ఉంటుంది. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా క్లైమాక్స్‌ను అద్భుతంగా తెరకెక్కించాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా పూర్తిగా టెర్రరిజం మీదే నడుస్తుంది. అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువే అయింది. బోర్డర్లో సినిమా షూటింగ్, వర్షాకాలం అవ్వడంతో కాస్త బడ్జెట్ పెరిగింది.→ మళ్లీ అక్టోబర్‌లో ఓ సినిమాను చేయబోతోన్నాను. ముంబై బ్యాక్ డ్రాప్లో ఆ చిత్రం ఉంటుంది. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.