నేడు నిఖిల్‌ వివాహం | Nikhil Siddharth to weds Pallavi Varma | Sakshi
Sakshi News home page

నేడు నిఖిల్‌ వివాహం

Published Thu, May 14 2020 5:36 AM | Last Updated on Thu, May 14 2020 2:43 PM

Nikhil Siddharth to weds Pallavi Varma - Sakshi

‘స్వామిరారా, సూర్య వర్సెస్‌ సూర్య, కార్తికేయ, ఎక్కడకి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్‌ సురవరం’ వంటి విజయాలు సొంతం చేసుకున్న కథానాయకుడు నిఖిల్‌ నేడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డాక్టర్‌ పల్లవి వర్మతో ఏడడుగులు వేయనున్నాడు. ఏప్రిల్‌ 16న వీరి పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. నేడు షామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్‌ అతిథి గృహంలో నిఖిల్‌–పల్లవిల వివాహం ఉదయం 6:31 గంటలకు జరగనుంది. కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథులతో నిరాడంబరంగా ఈ పెళ్లి జరగనుంది. కాగా బుధవారం సాయంత్రం నిఖిల్‌ని పెళ్లి కొడుకుని, పల్లవిని పెళ్లి కూతురిని చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement