వారికి కూడా నా ధన్యవాదాలు : నిఖిల్‌ | Nikhil Thanks Everyone Behind Wedding | Sakshi
Sakshi News home page

వారికి కూడా నా ధన్యవాదాలు : నిఖిల్‌

May 15 2020 8:56 PM | Updated on May 15 2020 9:17 PM

Nikhil Thanks Everyone Behind Wedding - Sakshi

హైదరాబాద్‌ : హీరో నిఖిల్‌ తన ప్రేయసి డాక్టర్‌ పల్లవి వర్మను గురువారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉండటంతో హైదరాబాద్‌ శివారులోని ఓ రిసార్ట్‌లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. వివాహ వేడుకకు హాజరైన కొద్ది మంది అతిథులకు కూడా థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించడంతోపాటు.. మాస్క్‌లు, శానిటైజర్‌ అందుబాటులో ఉంచారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా సినీ పరిశ్రమలోని నిఖిల్‌ స్నేహితులు చాలా మంది ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. (చదవండి : ప్రేయ‌సిని పెళ్లాడిన హీరో నిఖిల్)

ఈ క్రమంలో నిఖిల్‌ స్నేహితులతోపాటుగా, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా నిఖిల్‌, పల్లవి జంటకు బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. దీంతో నిఖిల్‌ వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘విషెస్‌ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌. నా ఫోన్‌, సోషల్‌ మీడియా మీ ఆశీస్సులు, ప్రేమతో నిండిపోయింది. ఈ పెళ్లి కోసం పనిచేసిన టీమ్‌కు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను. అద్భుతమైన డెకరెషన్‌, ఫొటోగ్రఫీ, ఔట్‌ఫిట్ అందించిన మీరు పెళ్లిని గుర్తుండిపోయేలా చేశారు ’ అని నిఖిల్‌ పేర్కొన్నారు.

కాగా, అంతకుముందు ఏప్రిల్‌ 16న వివాహం చేసుకోవాలని భావించిన కరోనా ఎఫెక్ట్‌తో అదికాస్త మే 14కు వాయిదా వేశారు. అయితే రెండోసారి కూడా పెళ్లి వాయిదా పడినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అనుకున్న ముహుర్తానికే నిఖిల్‌, పల్లవిలు వివాహ బంధంతో ఒకటయ్యారు.(చదవండి : క్లాసికల్‌ డ్యాన్స్‌‌తో అదరగొట్టిన సాయేషా)

Advertisement
 
Advertisement
Advertisement