అనుకోకుండా నటినయ్యాను | tv serial actress pallavi interview | Sakshi
Sakshi News home page

అనుకోకుండా నటినయ్యాను

Jul 17 2014 1:11 AM | Updated on Apr 3 2019 8:58 PM

అనుకోకుండా నటినయ్యాను - Sakshi

అనుకోకుండా నటినయ్యాను

సినీ తారలకు దీటుగా బుల్లి తెర నటులు రాణిస్తున్నారు. తమదైన నటనతో ప్రేక్షకుల మనసును దోచేస్తున్నారు. అలాంటి వారిలో పల్లవి ఒకరు. భార్యామణి సీరియల్‌లో

సినీ తారలకు దీటుగా బుల్లి తెర నటులు రాణిస్తున్నారు. తమదైన నటనతో ప్రేక్షకుల మనసును దోచేస్తున్నారు. అలాంటి వారిలో పల్లవి ఒకరు. భార్యామణి సీరియల్‌లో అలేఖ్యగా సుపరిచుతురాలైన పల్లవి.. ఆడదే ఆధారం అంటూ తన నటనతో అనతి కాలంలోనే మహిళల అభిమానాన్ని సొంతం చేసుకుంది. బుధవారం బీబీనగర్ మండలం చత్రఖానిగూడెంలో నిర్వహిస్తున్న భార్యామణి సీరియల్ షూటింగ్‌లో పాల్గొంది. సింగర్ కావాలనుకుని.. అనుకోకుండా నటినయ్యాయని పేర్కొంటున్న పల్లవి అంతరంగం...
 
 అందరూ పిలిచే పేరు
 అలేఖ్య, అమృత
 
 స్వస్థలం
 విజయవాడ
 
 ప్రస్తుత నివాసం
 హైదరాబాద్‌లోని ఈసీఐఎల్
 
 విద్యార్హత
 సోషాలజీ పూర్తి(చిన్ననాటి నుంచి హైదరాబద్‌లోనే చదువుకున్నాను)
 
 కుటుంబ నేపథ్యం
 మాది మధ్య తరగతి కుటుంబం. నేను ఒక్కదాన్నే. నాన్న నాగేశ్వరరావు, అమ్మ లలిత.
 
 ఇష్టమైన దైవం
 సాయిబాబా. ప్రతి పుట్టిన రోజు శిర్డీకి వెళ్తా.
 
 ఇష్టమైన వంటకాలు
 హైదరాబాద్ బిర్యానీ
 
 నటిస్తున్న సీరియల్స్
 ప్రస్తుతం భార్యామణి, ఆడదే ఆధారం సీరి యల్స్‌లో నటిస్తున్నాను. మరికొన్ని సీరియల్స్‌లో నటించే అవకాశం లభించింది. సిని మాలలో సైతం ఆపర్లు వచ్చాయి. ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ సమయం లేక వదులుకున్నా.
 
 పేరు తెచ్చిన పాత్రలు
 అలేఖ్య, అమృత
 
 అవార్డు.. రివార్డులు
 2012లో భార్యామణి సీరియల్‌కు గాను నంది అవార్డు లభించింది. ఆడదే ఆధారం సీరియల్‌కు బెస్ట్ యాక్టర్‌గా 15అవార్డులు వచ్చాయి. పాఠశాల, కళాశాల స్థాయిల్లో సింగర్‌గా అనేక బహుమతులు గెలుపొందా.
 
 యువతకు మీరు ఇచ్చే సందేశం..
 సింగర్ కావాలనుకున్నా.. కానీ నటినయ్యాను. గతంలో ఎలాంటి అనుభవం లేకపోయినా బుల్లి తెరకు వచ్చాక నటించడం నేర్చుకుని స్వశక్తితో ఎదుగుతున్నా. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోయినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నాను. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉటుంది. అందివచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ ఉన్నత స్థాయి కి ఎదిగేం దుకు కృషి చేయాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement