బాల భీముడు.. ప్రతి వెయ్యి మందిలో ఒకరు మాత్రమే ఇలా..

Baby Boy Born With Heavy Weight In Khammam - Sakshi

సాక్షి, భద్రాచలం(ఖమ్మం): భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు కిలోల బరువుతో మగ శిశువు జన్మించాడు. పాల్వంచకు చెందిన శ్రావణి నెలలు నిండడంతో ప్రసవం కోసం భద్రాచలంలోని సురక్ష ఆస్పత్రికి వచ్చింది. కాగా, వైద్యులు డాక్టర్‌ శ్రీక్రాంతి, డాక్టర్‌ అక్కినేని లోకేష్, నర్సుల బృందం సోమవారం సాయంత్రం ఆపరేషన్‌ చేశారు. శ్రావణికి పండంటి బాబు జన్మించగా.. శిశువు ఐదు కిలోల బరువు ఉన్నాడు.

సహజంగా పిల్లలు రెండున్నర నుంచి నాలుగు కిలోల వరకు జన్మిస్తారని, ఐదు కేజీలు ఉండడం అరుదైన విషయమని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి 1000 మందిలో ఒకరు మాత్రమే ఇలా అధిక బరువుతో జన్మిస్తారని తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top